తిరుపతి నగరంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ల కొరత కారణంగా నగర ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దినదినగండంగా ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు!
ఈ నేపథ్యంలో తిరుపతి ప్రజలను ఆదుకునేందుకు ఎస్ వి యూనివర్శిటీ స్టేడియంలో వేయి పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని తిరుపతి యాక్టివిస్టు, కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
“మానవ సేవే మాధవ సేవ” అని నిత్యం పలికే టీటీడీ శ్రీవారి నిధులను దేశవ్యాప్తంగా అయినదానికి కానిదానికి ఖర్చు చేస్తారే మరి తిరుపతి ప్రజల ఆర్తనాదాలపే పట్టించుకోవడం లేదు. మీకు వినపడడం లేదా అని నవీన్ కుమార్ ప్రశ్నించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
కరోనా కష్టకాలంలో టీటీడీ ఉదారంగా ముందుకొచ్చి శ్రీవారి నిధులతో “ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం” తో పాటు ఇతర మైదానాలలో భారీ టెంట్లు వేసి వెయ్యి పడకల ఏర్పాటుచేసి ప్రైవేట్ నర్సింగ్ సిబ్బంది ద్వారా కనీసం 500 ప్రాణవాయువు (Oxygen) మిషన్లను కొనుగోలు చేసి అభాగ్యుల ప్రాణాలు కాపాడాలి పేద ప్రజలందరికీ పౌష్టికాహారం అందించాలి!
టీటీడీ కి ఎంతోమంది భారీ విరాళాలు ఇచ్చే దాతలున్నారు ధర్మకర్తల మండలి ఐఏఎస్ అధికారులు చొరవ తీసుకొని వారి ద్వారా తిరుపతి నగరంలో కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి వైరస్ నివారణ “మందుల కిట్” అందజేయాలి!
తిరుపతిలో వైరస్ వ్యాప్తి చెందకుండా శాసనసభ్యులు “భూమన కరుణాకర్ రెడ్డి” గారు నగరపాలక సంస్థ కమిషనర్ “గిరీష” గారు చాంబర్ ఆఫ్ కామర్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి లాక్‌డౌన్ ప్రకటించారు శుభపరిణామం
కానీ, “మద్యం షాపులకు” కరోనా నిబంధనలు వర్తించవా?
ప్రభుత్వ మద్యం షాపుల తలుపులు బార్లా తెరిచారు. నిత్యావసర వస్తువుల షాపుల “తలుపులు మూసారు” లాక్ డౌన్ నిర్వచనమే మార్చారు!
లాక్ డౌన్ అంటే నగర ప్రజలకు అత్యవసర సేవలు అందించే “వైద్యశాలలు” “మందుల షాపులు” వంటి ఇతరత్రా మాత్రమే నిత్యం అందుబాటులో ఉంచుతారు మరి మద్యం షాపులను సైతం అత్యవసర సేవలలో భాగంగా ప్రభుత్వం అనుమతించారా అన్న చర్చ నగర ప్రజలలో జరుగుతున్నది!
తిరుపతి నగరంలో ప్రతి నిత్యం పెరుగుతున్న కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే,నగరపాలక సంస్థ కమిషనర్, మేయర్ చొరవతో “నగరపాలక సంస్థ కౌన్సిల్ లో తీర్మానం” చేసి జిల్లా కలెక్టర్ పై ఒత్తిడి తీసుకొచ్చి లాక్ డౌన్ సమయంలో నగరంలోని “మద్యం షాపులను పూర్తిగా మూసి వేసేలా” చర్యలు చేపట్టాలి!