చీర్స్, ఈ రోజు ఇంటర్నేషనల్ విస్కీ డే…

ప్రపంచ వ్యాపితంగా ఈ రోజు విష్కీ పండగ చేసుకుంటారు. ఈ పండగ 2009 లో మొదలయింది. ఇంటర్నేషనల్ విస్కీ డే (IWD) ఒకటి జరుపుకోవాలని 2008లో నిర్ణయించారు. తర్వాత ఆఫిషల్ గా  నెదర్లాండ్స్ లో 2009 ఈ విస్కీ పండగని మార్చి 27న మొదటి సారి ఘనంగా జరుపుకున్నారు.

మార్చి 27నే విష్కీపండగ ఎందుకు?

పూర్వం మైఖేల్ జేమ్స్ జాక్సన్ అనే మహానుభావుడుండేవాడు. ఆయన వృత్తిరీత్యా జర్నలిస్టు. ప్రవృత్తి రీత్యా మాంచి రచయిత కూడాను. ఆయన 1942 మార్చి 27న పుట్టాడు. ఆయన గౌరవార్థం  ప్రతిసంవత్సరం విస్కీ ప్రియులు  మార్చిన 27 రకరకాల విస్కీలు,విష్కీ కాక్ టెయిల్స్ లాగించి, గాల్లో తేలిపోతూ, తూలిపోతూ, జాక్సన్ కు నివాళులర్పిస్తారు.

జాక్సన్  బీరు మీద,విష్కీ మీద చాలా ఆధెంటిక్ పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాలలో Michael  Jackson’s Malt Whisky Companion అనేది చాలా పాపులర్ పుస్తకం.

(source: Amazon)

ప్రపంచ వ్యాపితంగా మందు ప్రియులంతా తెగ మెచ్చుకున్న పుస్తకం. మాల్ట్ విస్కీ గురించి జాక్సన్ కు తెలిసినంత మరొకరికి తెలియదేమో అనేంత లోతుగా ఆయన విస్కీ గురించి రాస్తాడని పేరు. అందుకే అది ఇప్పటికి బెస్ట్ సెల్ల ర్ పుస్తకంగా ఉంది. బీర్ హంటర్ అనే ఆయన టెలివిజన్ సీరియల్ కూడా చాలా పాపులర్ అయింది. The world Beer Guide, Best Beers of Belgium, Scotland and Its Whiskies, Bar and Cocktail Party Book, The Little Beer Book అనేవి ఆయన రాసిన మరికొన్ని గొప్ప పుస్తకాలు.

ఆయన రాసిన విస్కీ రివ్యూలకు చాలా పేరుంది. ఆయన విస్కీలకు క్వాలిటీని బట్టి 0 నుంచి 100 మార్కులు వేసి ర్యాంకులు ఇచ్చే వారు. నిజానికి జాక్సన్ బీర్ మీద బాగా పట్టున్న వాడు. అయితే, తర్వాత్తర్వాత ఆయన విస్కీ గురించి కిక్కెక్కించే రివ్యూలు రాశారు. ప్రపంచంలో ఇద్దరే ఇలా విస్కీ సాహిత్యంలో గొప్పవాళ్లున్నారు. ఇందులో ఒకరు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ ఆయన 18 వ శతాబ్దపు విస్కీ కామెంటేటర్. ఆ తర్వాత అంతపేరు తెచ్చుకున్నవాడు జాక్సనే.

విష్కీసాహిత్యానిని ఆయన చేసిన సేవలకు గుర్తింపు మాస్టర్ అఫ్ ది క్వైక్  (Master of the Quaich) అనే అవార్డు కూడా లభించింది. క్వైక్ అంటే పూర్వ కాలపు మధుపాత్ర. సింగిల్ మాల్ట్ విస్కీకి ప్రపంచ ఖ్యాతి వచ్చేందుకు కారణం జాక్సన్ రివ్యూలే కారణమని చెబుతారు. ఆగస్టు 30,2007 లో 65వ యేట జాక్సన్ చనిపోయారు. 2013లో ఆయన జీవితం మీద  Beer Hunter  The Movie అనే డాక్యుమెంటరీ వచ్చింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *