అనంతపురం జిల్లా రాయదుర్గం, ఆంధ్రభూమి విలేకరి, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ కవి కేరె జగదీష్ స్వర్గస్తులయ్యారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ రోజు రాత్రి తన ఇంటిలో తుది శ్వాస వదిలారు. ఆయన మరణ సాహితీమిత్రులకు,అనంతపురం సాహిత్య రంగానికి తీరని లోటు.
‘సముద్రమంత గాయం’, ‘రాతినిశ్శబ్దం’ వంటి కవితాసంపుటాలను , ‘రాత్రిసూర్యడు’ , ‘ఎల్లక్క’ వంటి దీర్ఘ కావ్యాలను తెలుగు సాహిత్యలోకానికి అందించారు.
రాత్రిసూర్యడు ఒక విలక్షణమైన దీర్ఘ కావ్యం. ఇందులో మనకెవ్వరికీ అందని అంధుల దుర్భర జీవితాన్ని తన ఆర్ద్ర హృదయం తో దర్శించి దీర్ఘ కావ్యంగా చిత్రించిన అరుదయిన కవి కెరె జగదీష్.
మొన్ననే ఎల్లక్క పేరుతో మరొక దీర్ఘ కావ్యాన్ని ముద్రించి ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా చేయాలని ఆరాటపడుతూ ఉండేవారు. ఆ కల తీరకనే వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
కెరె కు భార్య పుష్ప, కుమారులు వినాయక, శరత్, కూతురు శిల్ప
ఉన్నారు.
30 ఏళ్లు పైబడి జర్నలిస్టుగా సమాజానికి సేవలు అందించారు.