తెలంగాణలో కరోనా కన్ఫ్యూజన్, రేపు ముఖ్యమంత్రి క్లారిటీ

తెలంగాణలో కరోనా కేసులు  బాగా పెరుగుతూ ఉండటంతో ఏదో ఒక రూపంలో రాష్ట్రంలో ఆంక్షలు మొదలవుతాయనేచర్చ మొదలయింది. గత ఏడాది ఇదే రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ జనతా కర్యూకు పిలుపునిచ్చారు. ఈ రోజు ఇదే రోజున కరోనా ఉధృతి ఆరోజు లాగే మైల్డ్ గానే ఉంది. ఆ రోజు జనతా కర్ఫ్యూ తర్వాత క్రమంగా కేసులు పెరగడం మొదలై 2020 మధ్య దాకా ఆగలేదు.

ఇపుడు మళ్లీ  కేసులు పెరుగుతూ ఉండటంతో ముఖ్యమంత్రి  వైద్య అధికారులతో  అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆరోగ్యమంత్రి ఈ టెల రాజేందర్ కూడా సమావేశం  ఉన్నారు. మొత్తం పరిస్థితి మీద రేపు అసెంబ్లీలో ఆయన క్లారిటీ ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

రేపు  అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్

ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించరాని ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు, లాక్ డౌన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు, పూర్తిగా కేంద్రం తీసుకునే నిర్ణయం కాబట్టి తెలంగాణాలో లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ఒక సీనియర్ అధికారి ట్రెండింగ్ తెలుగున్యూస్ కు చెప్పారు.

ఇతర రాష్ట్రాల్లో స్థానిక అంక్షలు మాత్రమే ఉన్నాయి మహారాష్ట్రలో దాదాపు రోజు 50వేలకు పైబడి కేసులున్న రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించలేదు.

కాకపోతే,    రాత్రికర్యూ  విధించడం, పాఠశాలను బంద్ చేయడం వంటివి చేయవచ్చు. మధ్యప్రదేశ్, ఛత్తీష్ గడ్ లలో కూడా పాఠశాలను బంద్ చేస్తున్నారు. ఇంకా ఎవరూ నిరవధికంగా బంద్ చేయలేదు.  మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాక్ విధించడం జరగదని ఇప్పటికే స్పష్టం చేశారు.

మహారాష్ట్ర, పంజాబ్, మధ్య ప్రదేశ్ తదితర రాష్ట్రాలఅనుభవాలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ కూడా నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు.

అనేక జిల్లాలో  పాఠశాలల కోవిడ్ క్లస్టర్ లుగా మారడంతో మరికొన్ని రోజులు  మూసివేయడం, సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించడం చేయవచ్చని తెలిసింది. రాత్రిపూట కర్ఫ్యూపై విదించడం మరొక  ఆప్షన్.

కరోనా ఆంక్షలు కఠినంగా విధించండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్బి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఇది ఇలా ఉంటే… స్కూల్స్ బంద్ పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో  పెళ్ళిలలో  కూడా 50 మందికి మించకుండా పరిమితి విధిస్తే బాగుటుందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రికి సూచించారు.

కరోనాను ఈ దశలోనే నివారించేందుకు ఆయన సూచించిన చర్యలు

మాల్స్ ని కూడా కొన్ని రోజులు మూసివేయాలి. సామూహిక పండుగలకు కూడా సంఖ్య పరిమితి తో చేసుకునేలా ఆంక్షలు విధించాలి.

రాష్ట్రం లో కరోనా పోజిటివ్ సంఖ్య పెరగకముందే నియంత్రించి పరిస్థితి మళ్ళీ లాక్ డౌన్ దాకా వెళ్లకుండా చూడాలి.

హొలీ వేడుకలకు అందరూ దూరంగా ఉండాల్సిందే…

శ్రీరామనవి ఉత్సవాలకు కూడా గత సంవత్సరం లాగే  కేవలం ఆలయానికి పరిమితి చేయాలి.

ఇది ప్రజలందరూ ఇదే ఆలోచన చేయాల్సిన అవసరముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *