రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో దౌర్జన్యాలకు పాల్పడే వారి మీద ప్రజలెవరైనా ఫిర్యాదు చేసేందుకు రాజకీయ పార్టీలు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేస్తున్నాయి. గత వారం తెలుగుదేశం పార్టీ టోల్ ఫ్రీనెంబర్ ప్రకటించింది. అంతేకాదు, పంచాయతీ ఎన్నికలకోసం 24X7 కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.
ఈ రోజు బిజెపి కూడా టోల్ ఫ్రీనెంబర్ ను ప్రకటించింది.బీజేపీ టోల్‌ఫ్రీ నెంబర్..9650713714ను ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని ప్రభుత్వం వత్తిడి తీసుకువస్తుండటం ఆయనవిచారం వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలు సహజంగా జరగాలని ప్రభుత్వ ఒత్తిడితో కాదని సోమువీర్రాజు అభిప్రాయపడ్డారు. బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ నామినేషన్లు వేసేవారిపై దొంగ కేసులు పెడుతున్నారని, ఈ విషయాలను కేంద్ర హోం సహాయం మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు.
వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు కేంద బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. బడ్జెట్ అనేది అంశాల ప్రాతిపదికన ఉంటుంది గాని, రాష్ట్రాల వారీగా కాదని వీర్రాజు గుర్తు చేశారు.