ఉద్యమాల్లో కనిపిస్తే ఉద్యోగాలు రావు : నితీష్ బీహార్ లో కొత్త రూల్

సోషలిస్టు రాజకీయాల్లో పుట్టి పెరిగిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న   బీహార్ లో యువకులు, విద్యార్థులెవరూ నిరసన ఉద్యమాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంత బాహాటంగా యువకులను ఉద్యమాలకు దూరం చేసేందుకు ఒక రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం బహుశా ఎక్కడా జరిగి ఉండదు. ఉద్యమాలకు ప్రభుత్వాలన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి. అయితే, ఉద్యమాల్లో అసలు పాల్గొనకుండా ఒక రూల్ తీసుకురావడం బీహార్ లోనే జరుగుతూ ఉంది.

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తొలినాళ్ల రాజకీయాలు ఉద్యమాలతోనే మొదలయ్యాయి. ఆయన సోషలిస్టుగా రాజకీయ జీవితం ప్రారంభించారు.నిరసన ఉద్యమాలకు, కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ వంటి వారి శిష్యరికంలో ఉన్నారు.  1974-77 మధ్య జయప్రకాశ్ నారాయణ నడిపిన ఎమర్జీన్సీ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాలొన్నారు. ఈ ఉద్యమాల కోసమే బీహార్ విద్యుత్ శాఖలో ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెకానికల్ ఇంజినీరింగ్ బిటెక్ చేశారు. ఇలాంటి నాయకుడి రాష్ట్రంలో పోలీసులు యువకులు ఉద్యమాల్లో పాల్గొనకుండా బెదిరిస్తున్నారు.

దీని కోసం ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తా రోకోలు  నిర్వహించినా, వాటిలో పాల్గొన్న విద్యార్థులు యువకులు  ప్రభుత్వోద్యోగాలకు అనర్హులవుతారు. అంతేకాదు, ప్రయివేటు రంగంలో కూడా వాళ్లకి ఉద్యోగాలు రాకుండా చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది. సమ్మెల్లో పాల్గొన్ని లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించారని, ఉద్యోగాలకు ఇచ్చే కాండక్ట్ సర్టిఫికేట్ (క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్) స్పష్టంగా రాయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఉద్యోగం ఇవ్వడం, ఇవ్వక పోవడం వారిష్టం అని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నకుండా ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నది.

“లా అండ్ ఆర్డర్ ను దెబ్బతీసే నేరాలలో పాల్గొన్నా, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా, రాస్తా రోకోలునిర్వహించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నవారి క్యారెక్టర్ రికార్డులలో దీనిని రికార్డు చేస్తారు. వీళ్లకి ప్రభుత్వోద్యోగాలు రావు. ప్రభుత్వలిక్కర్ దుకాణాలను  కేటాయించారు,” అని బీహార్ పోలీసులు ప్రకటించారు.

బీహార్ ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ జితేంద్ర కుమార్ ఈ హెచ్చరిక  చేశారు. ఎలాంటి లా అండ్ అర్డర్ కార్యక్రమాలలో ఎవరూ  పాల్గొన్న అతని రికార్డు భ్రదపరుస్తారు. ఉద్యోగాల కోసం క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ జారీ  చేసేటపుడు ఈ క్రిమినల్ యాక్టవిటీస్ ను అందులో పొందుపరుస్తారు. దానిని బట్టి అతనికి ఉద్యోగమియ్యాలా లేదా అనే విషయాన్నిప్రభుత్వ సంస్థలుగాని, ప్రయివేటు సంస్థలు గాని నిర్ణయించుకుంటాయి.

సోషల్ మీడియా పోస్టుల మీద చర్యలుతీసుకుంటామని ప్రకటించిన వారంరోజుల్లోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ్యుల మీద, ఎంపిల మీద,  రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద,  మంత్రుల మీద అభ్యంతర కరమయిన పోస్టులను పెట్టడాన్ని పోలీసులు సైబర్ క్రైమ్ గా పరిగణించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేరానికి జరిమానాతో ఏడేళ్ళ దాకా జైలు శిక్ష ఉంటుంది. ఈ మేరకు బీహార్ ఆర్థిక నేరాల ఎడిజి నయ్యర్ హస్నియర్ ఖాన్ ఒక సర్క్యు లర్ జారీ చేశారు.

ఈ సర్క్యులర్ అన్ని ప్రభుత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు పంపించారు. ఈ శాఖల మీద సోషల్  మీడియాలో  అభ్యంతరకర పోస్టులు చేసిన వారి సమాచారం పంపాలని కోరారు.

అయితే, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ ఈ రూల్స్ ని ఖండించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హిట్లర్ లాగా తయారయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. నితీష్ ఎలా హిట్లర్ అడుగుజాడల్లో నడుస్తున్నారోచూండండని ఆయన ట్వీట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *