ఇందిరా పార్కు వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి & కో దీక్ష

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతువ్యతిరేకవిధానాలకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్   ఇందిరా పార్కు వద్ద  దీక్ష ప్రారంభించింది. పిసిపి అధ్యక్షుడు  ఎన్ ఉత్తమ్ కుమార్  రెడ్డి,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి,మాజీ ఎంపీ రాజయ్య, ఎఐసిపి కార్యదర్శి జి చిన్నారెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో దాదాపు నలభై రోజులుగా చలిని లెక్క చేయకుండా ఢీల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. ఆందోళన చేస్తున్న ఆ రైతులకు విరాళాలు కూడా అందజేశారు. కాంగ్రెస్ నాయకుడు కెఎలార్ 40 వేలు ఇచ్చారు. ప్రముఖ కళాకారులు విమలక్క,ప్రభాకర్ రూ.2 వేలు అందజేశారు. మాజీ ఎంపీ వి.హనుమంత రావ్ 5 వేలు అందించారు.

కాంగ్రెస్ నాయకుడు  కోదండరెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు తెచ్చిందని, అవి కేవలం వ్యాపారులకు అనుకూలంగా రూపొందించారని అన్నారు.

ప్రధాని మోదీ రైతులకు నష్టం చేసి కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూర్చేందుకు  ఈ చట్టాలు తీసుకువచ్చారని అన్నారు. ఢిల్లీసమీపాన
రైతులు చేస్తున్న దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *