కౌరవులను రామతీర్థం పంపి,పాండవులను అడ్డకుంటారా?: సునీల్ దేవధర్

విశాఖపట్నం నుండి రామతీర్థం బయలుదేరిన భాజపా రాష్ట్ర సహా ఇంచార్జి సునిల్ దేవధర్ ను  విశాఖ నగర పోలీసులు అడ్డుకున్నారు. ఆయన రామతీర్థం వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఆయనకు ఒక నోటీసు జారీ చేశారు.

దీని మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌరవులను రామతీర్థానికి అనుమతించారు, పాండవులను అడ్డకుంటున్నారు, చివరకు యుద్ధం లో పాండవులే గెలుస్తారని ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హితవు చేశారు. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడులను వేల సంఖ్యలో అనుచరులతో పోలీసు ఎస్కార్ట్ తో పంపించారు, బిజెపి , జనసేన నేతలను అడ్డుకుంటున్నారు.  కేవలం అయిదుగురిని మాత్రమే అనుమతిస్తామంటున్నారు, పాండవుల్లాగా. మీకు తెలుసోలేదో, చివరకు భారత యుద్ధంలో పాండవులదే విజయం అని ముఖ్యమంత్రి కి చెప్పారు.

రోమ్ అజండా అమలుచేసేందుకు మీరు ముఖ్యమంత్రి అయ్యారా అని సునీల్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో రామ్ వర్సెస్ రోమ్ లడాయి కావాలుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణ వర్సెస్ క్రైస్త్ , బైబిల్ వర్సెస్ గీత గొడవ జరగాలనుకుంటున్నారా అని ఆయనప్రశ్నించారు.

ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆయన ఎంతగా ఆగ్రహించారో ఈ వీడియోచూడండి. రామతీర్థం మీద మాత్రమే సిఐడి విచారణ కాదు, రాష్ట్రంలో జరిగిన అన్ని దేవాలయ దాడుల మీద విచారణ జరగాలంటున్నారు. ఈ విచారణక క్రైస్తవ అధికారులను నియమించారాదు అంటున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *