ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే వైసిపికి పడుతుందని మాజీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు.
బిజెపి-జనసేన ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఈ రోజు రామతీర్థం ధర్మయాత్రలో పాల్గొనేందుకు బయలుదేశారు. అయితే, ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీని మీద ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు:
వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ అండతో హిందూ దేవాలయాలు,ఆస్తులు,దేవుళ్ళు విగ్రహాలను నాశనం చేసే కార్యక్రమాలు ప్రతి రోజూ జరుగతున్నాయి.
ఇప్పటి వరకు దాడులు చేసిన వారిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు.
రామతీర్దంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేపధ్యంలో బిజెపి ఛలో రామతీర్దం కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు తమ పని తప్పా మిగిలిన పనులు చేస్తున్నారు.
రామతీర్దం బయలుదేరుతున్న నన్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
హౌస్ అరెస్ట్ లు చేయడం అప్రజాస్వామికం.
దుర్మార్గంగా ప్రజల నోటిని మూసేయాలని చూస్తే టిడిపి కి పట్టిన గతే వైసిపికి పడుతుంది.