తిరుపతి ఉప ఎన్నికల్లో భూవివాదమే కీలకమవుతుందా?

(నవీన్ కుమార్ రెడ్డి)

తిరుపతి నగరంలో సుమారు 10 వేల మందికి హఠాత్తుగా రిస్ట్రేషన్ సమస్య వచ్చే తిరుపతి ఎన్నికలను ప్రభావితం చేయనుంది. వీళ్లందరికి ఈ సమస్య గత ఏడాది మాత్రమే మొదలయింది. ఈ ప్రభుత్వం ఎప్పటినుంచో సాగుతున్న ఈ పదివేల మంది  నివసిస్తున్న ప్రాంతాలలో రిజస్ట్రేషన్లను, కట్టడాలను నిలిపి వేసింది. వారి సమస్య ఏమిటంటే…

“చింతలచేను””పెద్ద కాపు వీధి”జయ శ్యామ్ టాకీస్ రోడ్”డిబిఆర్ హాస్పిటల్ రోడ్డు పరిసర ప్రాంతాలలోని టౌన్ సర్వే నెంబర్ 6,8,9,12,623 మరియు 4073 లలో ఈ పదివేల మంది  ప్రజలు ఆరు దశాబ్దాలుగా 188 ఎకరాల భూములలో నివసిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ భూములకు 1957 సంవత్సరంలో రైత్వారీ పట్టా జారీ చేసింది. ఇది 1958 లో చంద్రగిరి సబ్ కలెక్టర్ చే  ధ్రువ పరచబడింది.  తర్వాత 1959 నవంబర్ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా గెజిట్ ద్వారా ప్రచురించబడింది. ఆ పైన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

అలాంటిది గత సంవత్సరం నుంచి ఉన్నఫలంగా రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసింది.

టీటీడీ శ్రీనివాసం వసతి సముదాయ నిర్మాణానికి, ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ఇదే సర్వేనెంబర్ లో దశాబ్దకాలంగా అనుభవిస్తున్న ప్రైవేటు వ్యక్తుల నుంచి టిటిడి స్థలం కొనుగోలు చేసింది వాస్తవం కాదా?? టీటీడీ స్థలం అయినప్పుడు ప్రైవేటు వ్యక్తుల నుంచి మీళ్లీ కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది??

2003 వ సంవత్సరంలో 781 జీవో జారీ చేసిన  రిజిస్ట్రేషన్లను  కొంతకాలం నిలిపివేశారు. స్థానిక ప్రజల నుంచి,అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో GO ఉపసంహరించుకున్నారు. నాటి నుంచి నేటి 2019 వరకు కొన్నివేల రిజిస్ట్రేషన్లు,ఇండ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు ఆ ప్రాంతంలో జరిగాయి.

గత సంవత్సరం నుంచి ఉన్నఫళంగా మళ్లీ రిజిస్ట్రేషన్లు నిలపడం,నగరపాలక సంస్థ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడంతో చిన్నా చితకా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి ప్లాట్లు కొనుగోలు చేసిన స్థానికులకు, మధ్యతరగతి కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు. వారి బతుకు దినదినగండంగా మారింది!

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కోర్టు తీర్పు వచ్చేవరకు పై సర్వే నెంబర్లలో గల ఖాళీ జాగాలకు,అపార్ట్మెంట్ లకు, ఇండ్లకు రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి.

ఇక్కడ ఆస్తుల క్రయ విక్రయాలు జరుపుకునేలా ప్రభుత్వం వెంటనే అనుమతించాలి!

తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఈ సర్వే నెంబర్లలోని ఖాళీ స్థలాలలో ఇంటి,వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు తక్షణం అనుమతులు ఇవ్వాలి!

అలాగే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే విధంగా టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్,అధికార పార్టీ నాయకులు,తిరుపతి ఆర్డిఓ, నగరపాలక సంస్థ కమిషనర్ గారు చొరవ చూపాలి!

టీటీడీ ధర్మకర్తల మండలి,జిల్లా అధికార పార్టీ నాయకులు సంబంధిత స్థలాలలో నివాసముంటున్న వారితో పాటు నగరంలో అనేక ప్రాంతాలలో రిజిస్ట్రేషన్లు జరగక, బ్యాంకు లోన్ లు రాక, అవసరానికి అమ్ముకోలేక ప్రజలు  సతమతమవుతున్నారు.  ఈ ప్రజలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి చర్చించి వారి సాధక బాధలను ఆలకించి, సమస్యను    ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లి “పాస్ట్ ట్రాక్” పద్ధతిలో పరిష్కరించారు.

అలా కాని పక్షంలో ఈ పదివేల మంది ప్రజలు వచ్చే లోక్ సభ ఎన్నికలను తప్పకుండా ప్రభావితం చేస్తారు.

(నవీన్ కుమార్ రెడ్డి, సోషల్ యాక్టివిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *