తెలంగాణ గవర్నమెంట్ లెక్కలో బాగా పూర్ అని అగ్రి కల్చర్ ప్రొక్యూర్ మెంట్ పాలసీని (farm produce procurement policy) వెనక్కు తీసుకోవడంలో అర్థమవుతుంది.
తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. కోటి ఏకరాలకు సాగునీరని స్లోగన్ ఇచ్చింది. ఇష్టాను సారం ఎవరూ పంటలు వేయడానికి వీల్లేదు, చెప్పిన పంటలే వేయాలని ప్రకటించింది. అలా చేస్తేనే రైతు బంధు డబ్బు బ్యాంక్ అకౌంట్లలో పడుతుందని లేకపోతే లేదని హచ్చరించింది. విలెజ్ లెవెల్ కలెక్షన్ సెంటర్లో ధాన్యం కొంటారని అన్నారు.
క్రాప్ కాలనీస్ అన్నారు. క్రాప్ కాలనీస్ అంటే ఎంపిక చేసిన ప్రదేశంలో ప్రకటించిన పంటను మాత్రమే వేయడం. దీని వల్ల అన్నిరకాల పంటలు రాష్ట్రంలో పండి అందుబాటులోకి వస్తాయి. ఈ ఉద్దేశం పైకి చాలా బాగుంది. తెలంగాణ లో మేధావులు చప్పట్లు కొంటారు. ప్రజలు కూడా ఏదో గొప్ప వ్యవసాయం విప్లవం రాబోతుందని ఎదురుచూస్తున్నారు. ఈ డిబెట్ టివిల్లో ఇంకా ముగియనేలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాట మార్చేశారు.దాన్యాన్నంతా కొనేందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్న గ్రామస్థానం ధాన్య సేకరణ కేంద్రాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం వల్ల ప్రభుత్వం బాగా నష్టపోయిందని, దీనిని కొనసాగించలేమని ప్రకటించారు.
ప్రతిపక్ష నాయకులు దీనికి అభ్యంతరం చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుసుకుని వచ్చాకే ఇలా మారిపోయారని విమర్శించారు. వ్యవసాయోత్పత్తుల కొనుగోలు ప్రభుత్వానికి రు. 7500 కోట్లు నష్టమొచ్చిందని ముఖ్యమంత్రిచెప్పిన విషయాన్ని అనుమానిస్తున్నారు. ఇదొక కుంభకోణమని, దీని మీద దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ రు. 7500 కోట్ల నష్టం లెక్కలు బయటపెట్టాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది. ఇంత నష్టం ఎలావచ్చిందో చెప్పితీరాలని ఈ పార్టీ చెబుతున్నది. ఇదొక లెక్కల పరీక్షయే.
ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గడానికి కారణం ప్రభుత్వం లెక్కలు తప్పు చేయడమనేనని చాలా మంది చెబుతున్నారు.
నిర్భంధ వ్యవసాయం కింద రైతులు ప్రభుత్వం చెప్పిన పంటనే వేయాలి. దీనికింద సన్నవరి పంట వేయాలన్నారు. రైతుల ఒకె అన్నారు. అయితే, సన్నవడ్లు పండించాలంటే ఖర్చెక్కువవుతుంది. అందవల్ల ఇపుడిస్తున్న క్వింటాలు రు. 1888 ల మద్దతు ధరను రు. 2500 చేయాలన్నారు.
బంగారు తెలంగాణ అనే పేరుతో రైతుల దగ్గిర ఉన్న మొక్కజొన్నలను తెలంగాణ ప్రభుత్వం క్వింటాల్ కు రు.1800 చొప్పున కొనింది.దీని భారం సరిగ్గా లెక్కేయలేదు. ఉదాహరణకు పక్కనున్న చత్తీష్ గడ్ లో మొక్కజొన్న మద్దతు ధర రు. 800 మాత్రమే. ఇదంతా భారమై కూర్చుంది.
ఇలా ముఖ్యమంత్రి కెసిఆర్ కలలు గన్న రెగ్యులేటెడ్ ఫార్మింగ్ కింద రైతుల చేత తాము చెప్పిన పంటలనే వేయించి అదంతా కొనడం మొదలుపెడితే ఏమవుతుంది?
ప్రభుత్వం సేకరించిన మొత్తంవ్యవసాయోత్పత్తులను కొనేందుకు మార్కెట్ నుంచి వ్యాపారస్థులు ఎవరూ ముందుకు రాకపోతే, పరిస్థతి ఎలా ఉంటుంది?
ఇదంతా భారమే. అధిక ధరలు పెట్టికొనడం కష్టం. అది ప్రభుత్వం దగ్గిరే మగ్గిపోతే, మరొక సమస్య. రైతులకు రైతుబంధు అమలు చేయాలి, ప్లస్ ధాన్యం కొనుగోళ్లు… ఈ భారం భరించడం కష్టమే.
అందవల్ల ధాన్యసేకరణ విధానాన్ని ఇపుడు ఎత్తేయాల్సి వచ్చింది.
క్రాప్ కాలనీ విధానాన్ని రాష్ట్రమంతా అమలుచేయకుండా అక్కడక్కడా శాంపిల్ గా అమలుచేసి చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.