శ్రీలంక తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో 2.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు విడుదల చేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈ రోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈ రోజు, రేపు రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.