చాన్నాళ్ల తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ దీక్షకు పూనుకున్నారు.
మొన్న తుపాను వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పరిహారం అందునందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిరసన తెలిపారు. ప్రతిరైతుకు 35వేల రూపాయల ఇవ్వాలని, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు ఈ రోజు దీక్ష చేపట్టారు. హైదరాబాదులోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు దీక్షలో కూర్చున్నారు.
గతంలోఇలా ఆయన 2018 మే26న శ్రీకాకుళంలో ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. అపుడు అక్కడి కిడ్నీ బాధితులకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాయం చేయడం లేదని నిరసనగా ఆయన దీక్ చేపట్టారు. కిడ్నీ బాధితులకు సంబంధించి 17 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతూ 24 గంటలలోపు స్పందించాలని అల్టిమేటమ్ ఇస్తూ దీక్ష లో కూర్చున్నారు. చంద్రబాబు నాయడి ప్రభుత్వం ఈ డిమాండ్లను పెద్ద పట్టించుకోలేదు. అంతేకాదు, పవన్ పబ్లిషిటీ స్టంట్ అని తెలుగుదేవం నేతలు ఎద్దేవా చేశారు. దీనితో శుక్రవారం మొదలుపెట్టిన దీక్షను ఆయన శనివారం నాడు విరమించుకున్నారు.