సినిమాను అతిగా ప్రేమించే అభిమానులకు మన తెలుగు రాష్ట్రాల్లో కొదవలేదు. వారందరికీ ఇప్పటి వరకు నిరాశే మిగిలింది. ఎంత ఓటీటీ అందుబాటులో ఉన్నా థియోటర్స్ లో చూస్తే ఆ కిక్కే వేరు. వందల మందిలో తమ అభిమాన హీరో సినిమా విజిల్స్ వేస్తూ,కేకలు పెడుతూ చూస్తుంటే ఆ మజానే వేరు.
అయితే కరోనా దెబ్బతీసింది. ఎప్పుడైతే మహమ్మారీ ప్రపంచ దేశాల మీద దాడి చేసిందో అప్పటి నుండి టాలీవుడ్ అతలాకుతలం అయ్యింది. తెలుగు సినిమా అభిమానులు కుప్పకూలిపోయారు.
థియేటర్లు, షూటింగ్‌లు అన్ని బంద్ చేసే పరిస్థితి నెలకొంది. గత ఐదారు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అన్ లాక్ 5.0 తో సినీపరిశ్రమలకు రిలాక్సేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇక థియేటర్లు మల్టీప్లెక్సులు తెరుచుకోవడమే తరువాయి అని అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15 నుండి థియేటర్లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అన్‌లాక్ 5 ఆదేశాలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుండి 50% ఆక్యుపెన్సీతో థియేటర్లను తిరిగి ప్రారంభించడానికి ఇది ఒక GO ను సైతం జారీ చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇంకా అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదు. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ థియేటర్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే AP ఎగ్జిబిటర్లు ఇంకా అలాంటి ప్రకటనలు చేయలేదు.
ఎపిలో మెజారిటీ థియేటర్లను కలిగి ఉన్న సురేష్ బాబు థియేటర్లను తిరిగి తెరవడానికి ఇష్టపడటం లేదని సమచారం. ఆయన నిర్ణయం ఏంటనే దానిపై రాష్ట్రంలోని మిగిలిన థియేటర్ యజమానుల డెసిషన్ ఉంటుంది. అందుకే అందరి కళ్లు ఆయన మీదున్నారు. అయన ఏ నిర్ణయం తీసుకుంటాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరిస్తేనే సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సురేష్ బాబు మాత్రం ప్రతిదీ క్లియర్ అయిన తర్వాత, క్రిస్మస్ లేదా సంక్రాంతికి యాధా స్థితిని పునరుద్ధరించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాబోయే కొద్ది నెలల్లో విషయాలు ఎలా ముందుకు వెళ్తాయో ప్లాన్ చేయడానికి ఆయన ఎగ్జిబిటర్లతో కూర్చోవాలి అనుకుంటన్నారట.
లాక్డౌన్ సమయంలో కనీస విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయడం, పార్కింగ్ ఛార్జీలను తిరిగి తీసుకురావడం , ప్రస్తుత సంవత్సరానికి ఆస్తిపన్ను మరియు రహదారి పన్నును వదులుకోవడం వంటి సడలింపులతో ఎగ్జిబిషన్ రంగం రాష్ట్ర ప్రభుత్వం నుండి కొంత సహాయం ఆశిస్తోంది. ఇవన్నీ ప్రభుత్వాలు ఇవ్వాలి. అలాగే జనం థియోటర్స్ కు సేఫ్ గా వెళ్దామనే థైర్యం రావాలి అప్పుడే సినిమా హాల్స్ ఓపెన్ అవుతాయి.
ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే వెంటనే మల్టీ ప్లెక్స్ లు, థియేటర్లు తెరిచేందుకు అందరూ సిద్దంగా ఉన్నారు. అధికారిక ప్రకటన వచ్చేస్తే.. దసరా, దీపావళి బరిలో వరుసగా సినిమాల్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారన్నది నిజం. అయితే ప్రేక్షకుల ఆలోచన ఎలా ఉందో అన్నది మాత్రం సందేహంగా ఉంది. మొత్తానికి అందరూ అనుకున్నట్టు కరోనా నిబంధనలతో థియోటర్స్ ఓపెన్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సునామీనే.