విమానాలు ఎగురుతున్నపుడు పక్షి బెడద ఉంటుంది. పక్షి చిన్నదే అయినా, అది ఢీ కొన్నపుడు విమానానికి జరిగే నష్టం అంతా ఇంత కాదు. విమానాలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ విమానాలను సాధ్యమయినంతవరకు ఎక్కువ ఎత్తున ఎగిరిస్తూ ఉంటారు. అయితే, అయితే ఎత్తు దాకా పక్షులుంటాయి. 1975, నవంబర్ 29న ఒక జెట్ విమానాం ఐవరీకోస్టు మీద 37,900 అడుగుల ఎత్తున,చాలా సురక్షితమయిన ఎత్తున ఎగురుతూ ఉంది. అయితే, ఆఎత్తులో కూడా ఒక గద్ద విమానం ఇంజిన్ లోకి దూసుకుపోయింది. ఇంజన్ ని ధ్వంసం చేసింది. మరొక ఇంజిన్ పనిచేస్తూ ఉంది కాబట్టి విమానం సురక్షితంగా ల్యండ్ అయింది. అపుడుగాని తెలియలేదు, కొన్ని పక్షలు 40 వేల అడుగుల ఎత్తున కూడా ఎగురుతున్నాయని. ఐవరీకోస్ట్ మీద విమానం ఇంజన్ లోకి దూసుకుపోయిన గద్ద పేరు రప్పెల్స్ గ్రిఫాన్ (Ruppells’s Griffon, Gyps Ruepellii). ఈ పక్షి పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలలోని టాంజానియా, ఇధియోపియా,సూడాన్, గినీ లలోకనిపిస్తుంది.
ఈ గద్ద పొడవు మూడు అడుగులుంటుంది. రెక్కలు 2.6 మీటర్ల దాకా విచ్చుకుంటాయి. బరువు ఏడునుంచి 9 కేజీలుంటుంది. మెడ,తల తెల్లగా ఉంటాయి. కళ్లు పచ్చగా లేదా ఎర్రటినిప్పుల్లా ఉంటాయి. శరీరమంతా చాకొలేట్ కలర్లో తెలుపు పొడలతో ఉంటుంది. జర్మనీకి చెందిన జంతుశాస్త్రవేత్త ఎడ్వర్డ్ రప్పెల్ స్మారకార్థం దీనికి ఈ పేరు పెట్టారు. ప్రపంచంలో అత్యంత ఎత్తున ఎగిరే పక్షలువే. అంటే ఎవరెస్టు శిఖరం (29,035 అడుగులు) కంటే ఎత్తున ఎగిరే పక్షలు ఇవే. ఆ ఎత్తున గంటలకు 35.4 కి.మీ వేగంతో ఇవి దూసుకుపోతాయి. నవంబర్ 29, 1975న బోయింగ్ 747ను ఈ పక్షి ఢీ కొనే దాకా అంతఎత్తున ఎగిరే పక్షులు భూమ్మీద ఉన్నాయని ఎవరికీ తెలియదు.ముఖ్యంగా ఈ విమానం నడుపుతున్న పైలట్లకు,ఫైట్ ఇంజినీర్లకు అసలు అసలు తెలియదు.
అంత ఎత్తున అదీ కూడా ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తున ఈ పక్షులు ఎలా ఎగరకలుగుతున్నాయి? దీనికి కారణంలో వీటీ శరీరంలో ఉండే హిమోగ్లోబిన్ ఇతర ప్రాణులకు కంటే భిన్నమైంది. దీనికి ఆక్సిజన్ బైండింగ్ ఎపినిటీ చాలా ఎక్కువ. ఈ విమానం వల్లనే రికార్డు ఎత్తులో ఎగిరే పక్షి రప్పెల్స్ గ్రిఫాన్ అని తేలింది.
ఎత్తు గురించి సరే, మరి లోతు గురించేమిటి?
ఇలా అత్యంత ఎత్తున రప్పెల్ గ్రిఫాన్ ఎగిరినట్లే, సాధారణంగా ప్రాణులు తట్టుకోలేనంత సముద్రలోతుల్లో కూడా కొన్ని రకాల రొయ్యలుతిరగడం కనిపించింది.
Like this story? Share it with a friend!
జనవరి 23, 1960న మరొక అద్భుతం జరిగింది. రికార్డ్ సెట్టింగ్ అన్వేషకుడు జాక్వెస్ పిచార్డ్ (Jacques Piccard), యుఎస్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ డాన్ వాల్ష్ (Don Walsh) పసిఫిక్ మహాసముద్రంలోకి లోతుల్లోకి యాత్ర (Bathyscaphe) ప్రారంభించారు. పసిఫిక్ మహాసముద్రం లో లోతైన ప్రాంతం పేరు మేరియానా ట్రెంచ్ (Mariana Trench) .చివరకు వాళ్లు 35,800 అడుగల లోతుకు వెళ్లారు. ఆశ్చర్యంలో అంత లోతున, అంటే భయంకరమయిన సముద్రపు వత్తిడి ఉండే చోట కూడా వారికి కొన్నిరకాల ష్రింపులు కనిపిండంతో ఆశ్చర్యపోయారు. అక్కడ ప్రెజర్ ఎంతో తెలుసా? ఒక చదరపు అంగుళం మీద 17,000 పౌండ్ల వత్తిడి ఉంటుంది. దీనిని లెక్కచేయకుండా ఈ ష్రింపులు హ్యీపీగా అక్కడ తిరుగుతున్నాయి.
మార్చి 26, 2012న హాలివుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ మేరియానా ట్రెంచ్ లోని అత్యంత లోతైన ప్రదేశానికి ప్రయాణించి మరొక ఒక అద్భతం వెల్లడించాడు. ఒంటరిగా సముద్రంలో 11 కిమీ లోతుకు వెళ్లిన వ్యక్తి కామెరాన్ ఒక్కడే. ఆలోతుల్లో సుముద్ర ప్రాణులను, పరిసరాలను పరిశీలించేందుకు ఆయన రెండున్నర అంతస్థుల ఎత్తు పరిమాణం ఉన్న డీప్ సీ చాలెంజర్ సబ్ మెరైన్ లో మేరియానా ట్రెంచ్ లోయల్లోకి ఈ యాత్ర చేశారు.
First footage from the bottom of the ocean via @JimCameron‘s #deepseachallenge sub: http://t.co/Duq4crL5 (@DeepChallenge)
— National Geographic (@NatGeo) March 26, 2012