సోము వీర్రాజు అరెస్టు, అమలాపురం డివిజన్ లో 3 రోజులు 144 సెక్షన్

అంతర్వేది రథ దగ్దం విషయంలో దోషులను గుర్తించడంలో విఫలమయినంుకు నిరసనగా భారతీయజనతా పార్టీ చలో అమలాపురం పిలునీయడంతో  డివిజన్ నిషేదాజ్ఞలు విధించారు.
రేపటి నుండి మూడు రోజులు( 18.9.20 వ తేదీ నుండి 20.9.20 వతేదీ వరకు) పాటు 144 సెక్షన్ అమలు లో వుంటుందని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ గురువారం ఒక ప్రకటనలో తెలియచేశారు.
ఇది ఇలా ఉంటే  రేపటి కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
చలో అమలాపురం నేపథ్యంలో అని కాకుండా డివిజన్ లో కరోనా వ్యాప్తి తీవ్రం గా వున్న దృష్ట్యా దీనిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల లో భాగంగా డివిజన్ అంతటా మూడు రోజులు పాటు 144 సెక్షన్ విధించడం జరిగిందని సబ్ కలెక్టర్ తెలియ చేశారు.
144 సెక్షన్ అమలు లో వున్న సమయంలో నలుగురు,అంతకంటే ఎక్కువ మంది గుంపులు గా వున్నా, ఏ విధమైన ఆయుధాలు కలిగి ఉన్నా వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్ కలెక్టర్ హెచ్చరించారు.
ఇటీవల అంతర్వేది లో రథం దగ్ధమైన ఘటనలో జరిగిన అలజడులను అరికట్టి శాంతి భద్రతలను పరిరక్షించే విషయంలో అనేకమంది పోలీస్ అధికారులు సిబ్బంది తో బాటు అనేక మంది ప్రభుత్వ అధికారులు కోవిడ్ బారిన పడిన కారణంగాను మూడు రోజులు పాటు ఏ విధమైన అలజడులు జరగ కుండా వుండేందుకు సెక్షన్ 144 డివిజన్ అంతటా విధించడం జరిగిందని సబ్ కలెక్టర్ తెలియ చేశారు.
144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలు లో వున్న సమయంలో ధర్నాలు, సమావేశాలు పూర్తిగా నిషేధమని,ప్రజలు గుంపులు గా తిరగడం, సమూహాలుగా వుండటం నిషేధమని, ఉత్తర్వు లను ఉల్లంఘిస్తే పోలీస్ అధికారులు చట్ట ప్రకారం ఖటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్ కలెక్టర్ హెచ్చరించారు.