కూలీగా మారిన ‘తెలుగు సార్’ కు అండగా నిలిచిన సాహిత్యాభిమానులు

రాయలసీమ కథా సాహిత్యానికి డాక్టర్ తవ్వా వెంకటయ్య  అందించిన సేవలకు కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం ‘గడియారం సాహితీ పీఠం’  మొమెంటో తో పాటు ఇరవై వేల నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
డాక్టర్ వెంకటయ్య ఒక ప్రయివేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. కడప జిల్లా ఖాజీపేట మండలం తవ్వావారి పల్లెకు చెందిన వెంకయ్య లాక్ డౌన్ కారణంగా  టీచర్ ఉపాధి కోల్పోయారు. స్కూళ్లు మూతపడటంతో   ప్రయివేటు పాఠశాలలు జీతాలు ఇవ్వడం మానేశాయి. దీనితో  డాక్టర్ వెంకటయ్య కుటుంబ పోషణకు బేల్దార్ కూలీగా మారాడు. ఈ విషయం మీద ట్రెండింగ్ తెలుగు న్యూస్ ఒక కథనం కూడా ప్రచురించిది.
ఆయన కష్టాలను చూశాక జిల్లాలోని సాహిత్యాభిమానులు అర్ధిక సాయం అందించాలని నిర్ణయించారు.తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా రాయలసీమ కథాసాహిత్యాన్ని తన పరిశోధనల ద్వారా సుసంపన్నం చేసిన డాక్టర్ వెంకటయ్య తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఇదే అనువయిన  సమయమని  గడియారం సాహితీ పీఠం సభ్యులు  భావించారు.
  నిన్న జమ్మలమడుగులోని సాహిత్యభిమానులు గడియారం వేంకటశేష శాస్త్రి పీఠం తరఫున ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇలాంటి సాహిత్య కార్యక్రమాలకు ఎపుడూ అండగా నిలిచే సాహితీ పీఠం అధ్యక్షులు డాక్టర్ ఎంఎల్ నారాయణ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ తవ్వా వెంకటయ్య ఇలాంటి వారిని కాపాడుకోవడం సాహితీవేత్తల విధి అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ తవ్వా వెంకటయ్య  మాట్లాడుతూ క్రీడాకారులకున్న విలువ సాహిత్య కారులకు లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే రాయలసీమలో ప్రారంభించబడిన తొలి మిషనరీ స్కూల్ అనగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ జమ్మలమడుగుకు చెందినదే నని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ గురు కుమార్ గారు జమ్మలమడుగుకు ఒక గొప్ప  సాంస్కృత చరిత్ర ఉందని, ఆ గత వైభవాన్ని చాటే విధంగ పట్ణణంలో  ఒక సాంస్కృతిక కేంద్రంగా ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని గుర్తుచేశారు. దీనికి తగిన కార్యాచరణ రూపొందించ వలసిందిగా సాహితీ పీఠం సభ్యులను కోరారు. కార్యక్రమంలో బండారు శ్రీనివాసులు, మిర్యాల శివ గణపతి దర్పణం శ్రీనివాస్ గొంటుముక్కల గోవిందు తదితరులు పాల్గొన్నారు.

(Like this story? Share it with a friend)

 

ఇది కూడా చదవండి

కూలీగా మారిన రాయలసీమ కథా పరిశోధకుడు, డాక్టర్ తవ్వా వెంకటయ్య

మరిన్ని విశేషాలు