మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోమాలో…

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిస్థితిలో మార్పులేదని ఆయన కుమారుడు అభిజిత్ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితుల మీద వూహాగానాలు మొదలవడంతో ఆయన ట్విట్టర్ ద్వారా ఈ వివరణ ఇచ్చారు. తన తండ్రి ఇంకా సజీవంగా ఉన్నారని, హెమోడైనమికల్ గా ఇంకా నిలకడగా ఉన్నారని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

ఈ లోపు ఆసుపత్రి కూడా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం మీద ఒక బులెటీన్ విడుదత చేస్తూ ఈ ఉదయానికి ఆయనపరిస్థితిలో మార్పలేదని పేర్కొంది. కోమాలో ఉన్నారని పేర్కొంది.
“He is deeply comatose with stable vital parameters and continues to be on ventilatory support,” అని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి బులెటీన్ లో పేర్కొంది.
ఆయన కొద్దిరోజులుగా న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రిలో ఉంటున్నారు. మొదట మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్‌ సర్జరీజరిగింది. అది విజయవంతమయింది.అయితే పరీక్షలు నిర్వహిస్తున్నపుడు ఆయనకు కరోనా సోకింది.
ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ట్వీట్ చేశారు.
ఆపరేషన్ విజయవంతమయ్యాక ఆయన పరిస్థితి కరోనా వల్ల విషమించడంతో ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. అయితే, పరిస్థితి తొలినుంచి  క్రిటికల్ గానే ఉండింది.