గత కొద్దరోజులుగా జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బూర్గుల భవన్ లోకి విలేకరులను అనుమతిస్తామని వెల్లడించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణా భవన్లో జరిగిన ప్రెస్ మీట్ లో బీఆర్కేఆర్ భవన్లోకి మీడియా ప్రతినిధుల అనుమతి రద్దయిన ప్రస్తావన తీశారు.
మీడియా లేనిదే రాజకీయాలు లేవని కామెంట్ చేస్తూ వాళ్ళ సౌకర్యం కోసం ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 2 క్వార్టర్స్ కేటాయించాలనిఅన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శికి సూచిస్తానని హామీ ఇచ్చారు.
అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎస్ కు కూడా చెప్తానని అన్నారు.
తాను ఈ విషయమై స్వయంగా ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తో మాట్లాడుతానని, మీడియా ప్రతినిధి బృందం శనివారం నాడు ఆయనను కలవాల్సిందిగా కోరారు.
అసలు మీడియాను నియంత్రించే ఉద్దేశ్యమే తమకు లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
విలేకరులు అధికారులను కలవడానికి కూడా బీఆర్కేఆర్ భవన్లోకి వెళ్ళడానికి యాక్సెస్ పాస్ లు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
అంతకు ముందు జర్నలిస్టుల ఇళ్లసమస్యను పరిష్కరిస్తాననికూడా చెప్పారు.
వెంటనే కృతజ్ఞతలు…
జర్నలిస్టుల సమస్యలపై స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని, ఇంటి స్థలాల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారికి కృతజ్ఞతలు. అట్లాగే మీడియా అకాడమీ తరుఫున చేసిన పనిని గుర్తించి అభినందించి నిధులు పెంచి అకాడమీ కార్యక్రమాలు జరగడానికి శ్రద్ధ తీసుకుంటానని, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి మీడియా అకాడమీ అనే స్థలం ఉన్నదని ప్రత్యేకంగా చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక వందనాలు.
కృతజ్ఞతలతో . . .
అల్లం నారాయణ, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్.