ముస్లిం మహిళలకు మసీదులోకే ప్రవేశం లేదు. అలాంటివాళ్లు హిందూ ఆలయాల్లోకి పూజ చేస్తారా. ఇలాంటి సామాజిక నేపథ్యంలో కొంత మంది ముస్లిం మహిళలు ఏకంగా హిందూ ఆలయం నిర్మించేందకు పూనుకుంటారా? అందునా ప్రధాని మోదీకి గుడి కట్టాలనుకుంటారా?
నిజం. ఇది ఉత్తర ప్రదేశ్ లో జరుగుతూ ఉంది.
ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నేగర్ కు చెందిన కొంతమంది ముస్లిం మహిళలు ప్రధాని నరేంద్ర మోదీకి గడి నిర్మించేందుకు పూనుకున్నారు. రూబీ ఘాజ్నీ అనే మహిళ నాయకత్వంలో కొంతమహిళలు ఒక బృందంగా ఏర్పడి ప్రధాని మోదీ ముస్లిం మహిళకు చేసిన మేలుకు గుర్తుగా గుడి కట్టాలనుకుంటున్నారు. ఈ మేరకు ఈ మహిళలు గురువారం నాడు ముజఫర్ నగర్ జిల్లా కలెక్టర్ ఒక వినతి పత్రం సమర్పించారు.
‘ట్రిపుల్ తలాక్ ను నిషేధించి ఆయన ముస్లిం మహిళ జీవితాలలో పెను మార్పు తీసుకువచ్చారు. అదే విధంగా ఆయన మహిళల మేలుకోరి గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు. ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఇంతకంటే మహిళలకేం కావాలి,’ అని ఘాజ్ని చెప్పారు. ప్రపంచమంతా మోదీని కీర్తిస్తూ ఉంది. అందువల్ల ఆయన మాతృభూమిలో కూడా ఇది జరగాలని ఆమె మోదీ ఆలయ నిర్మాణానికి కారణం చెప్పారు.
తమ సొంత విరాళాలతో మోదీగుడి కడుతున్నామని చెబుతూ మోదీని ముస్లిం వ్యతిరేకిగా ముద్రవేయడాన్ని ఆమె వ్యతిరేకించారు.