ముందుస్తు బెయిల్ తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో టివి9 మాజీ సిఇవొ రవిప్రకాశ్ ఈ రోజు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముందు విచారణ కు హాజరైయ్యారు. ముందస్తు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యంచేసుకునేందుకు నిన్న నిరాకరించింది. హైకోర్టునే సంప్రదించాలని చెప్పింది. అంతేకాదు, విచారణ కు హాజరుకావాలని కూడా ఆదేశించింది.
ఆయన టివి9 కొత్త మేనేజ్ మెంట్ పలు కేసులు పెట్టింది. రెండు కేసులు పై విచారణ చేసి, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం.