(మెరుగు రాజయ్య)
“అర్ధ సత్యమే చెప్పుతారెందుకు ?? పెషేంట్ల, వాల్ల బందువుల బాధ్యతల గురించి చెప్పినారు —– సరే ! హక్కుల గురించి కూడా చెప్పుతే బాగుంటుంది కదా ????”
ఈ మద్యన మా అక్క అనారోగ్యము పాలై ప్రైవేటు హస్పటల్ లో ఇన్ పెషేంట్ గా వైద్య చికిత్స పొందుచుంటే చూడడానికి పోగా ” హెచ్చరిక “” బోర్డ్ కనిపించింది.
అట్టి హెచ్చరిక బోర్డ్ ను క్లుప్తంగా చదువగా అందులో కేవలం పెషేంట్ల బందువుల బాధ్యతల గురించి మాత్రమే పేర్కొనబడి ఉన్నవి.
IMA / ఇండియన్ మెడికల్ అసోసియేషన్ , TGDA/ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ , THANA/ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్శ్ అసోసియేషన్ వారు కూడా వాల్ల వాల్ల సమ్మతిని తెలిపినారు.
హాస్పిటల్స్/ డాక్టర్స్ / వైద్య సిబ్బందిని ప్రజలు గౌరవ భావముతో ఆరాదిస్తారు. దాదాపు ప్రాణ దాతగా కొలుస్తారు. అటువంటి ఆరాధన భావము కలగిన ప్రజలు హాస్పిటల్స్ ను ధ్వంసం చేయడము , డాక్టర్ ల మీద చేయి చేసుకోవడము… లక్ష కేసులలో ఒకటి జరుగుచున్నది.
పెషేంట్ల బందువులు తమ తోబుట్టువులను , రక్త సంబదీకులను భౌతికముగా కొల్పోయినప్పుడు , డాక్టర్ల నిర్లక్ష్యం వలనగాని , సమయానుకూలమైన సమయస్పూర్తితో కూడిన వైద్య చికిత్స చేయని సందర్భాలలో పెషేంట్లు చనిపోయినప్పుడు సదరు పెషేంట్ల బంధువులు అలజడికి గురికావడము సహజము.
ఇంకా కొన్ని సందర్భాలలో త్రీవ మానసిక అందోళనలకు గురై హాస్పిటల్స్ పైన ,డాక్టర్స్ పై బౌతిక దాడులకు కూడా పాల్పడుచున్న సంఘటనలు చాల అరుదుగా జరుగుచున్నవి. ఈ అరుదైన సంఘటనలను కూడా ఎవరూ సమర్ధించరు.
ప్రభుత్వము తమ బాద్యతగా అక్ట్ నంభర్ 11 ఆఫ్ 2008 తీసుకవచ్చి ప్రైవేటు , గవర్నమెంట్ హాస్పిటల్స్ కు అలాగే డాక్టర్స్ కు రక్షణ కల్పించింది. హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై , డాక్టర్స్ విధులను అడ్డగించిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తుంది. న్యాయ విచారణలో సదరు కేసు నమోదు చేసిన వారి నేరాలు నివృత్తి అయితే మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.రూ.50 వేల జరిమానా కూడా వసూలు చేయడము జరుగుతుంది.
రెవెన్యూ రికవరీ అక్ట్ 1864 ప్రకారముగా ఆస్పత్రుల ఆస్తులకు కూడా రక్షణ కల్పించ బడింది. ధ్వంసం చేయబడిన హాస్పిటల్స్ ఆస్తులకు రెట్టింపుగా సదరు ధ్వంసం చేసిన వారి నుండి వసూలు చేసి ఇవ్వాలి. ఒక వేళ వాల్లు చెల్లించడానికి మొండికేస్తే వాల్ల స్ధిరాస్తుల నుండి రాబట్టి ఇవ్వడానికి ప్రభుత్వము సహకరించుతుంది.
నేను గాని ఎవరైన గాని ప్రభుత్వ నిర్ణయము బాగున్నదని సమర్ధించుతాము.
కాని హాస్పిటల్స్ లలో వైద్య చికిత్స పొందుచున్న పెషేంట్ల కు రక్షణగా ప్రభుత్వము ఎందుకు రాదు ?? జివో లను ఎందుుకు జారీ చేయడము లేదు. ఒక వేళ పెషేంట్ల కు రక్షణగా ప్రభుత్వము జివోలను జారీ చేసి ఉంటే హాస్పిటల్స్ లలో ఎందుకు ??? ప్రదర్శించడము లేదు. / DISPLAY చేయడము లేదు. ప్రభుత్వము / చట్టాలు హాస్పిటల్స్ కు , డాక్టర్స్ కు రక్షణ కల్పించినట్లుగానే పెషేంట్లకు కూడా రక్షణ కల్పించడానికి ఎందుకు ? చొరవ చూపడము లేదు.
ఈ మధ్య కాలములో తహాశీల్దార్ ఆపీస్ లలో , బ్యాంక్ లలో మొదలగు ప్రభుత్వ కార్యాలయాలలో “” ప్రజలకు మాత్రమే / వినియోగ దారులకు మాత్రమే హెచ్చరిక బోర్డ్ లు ప్రదర్శించడము పరిపాటిగా జరుగుచున్నది. ఆ మద్యన పాస్ బుక్ కొరకు తిరిగి తిరిగి వేసారిన రైతు కోపముతో తహశీల్దార్ గల్ల పట్టినాడన్న ఆరోపణతో సదరు రైతును రూం లో వేసి కొట్టిన రెవెన్యూ సిబ్బందిని కనీసము అభిశంచించడానికి కూడా ప్రభుత్వము సహసించలేదు.
ప్రభుత్వము ప్రజలకు బాద్యతలను చెప్పుచున్నారు. కాని అదే క్రమములో ప్రజలకు వాల్ల హక్కుల గురించి ఎందుకు ? చెప్పడము లేదు. ప్రభుత్వము అర్ధ సత్యాలు చెప్పుచూ కేవలము ప్రభుత్వ యంత్రాంగముకు రక్షణ గా ఉండడము సమంజసము కాదు. ప్రజల హక్కులను కూడా జనసామాన్యము చేసి ప్రజలకు కూడా అండగా / రక్షణగా నిలువాలని —– సింగరేణి కాలరీస్ వర్కర్య్ యూనియన్ /AITUC గా కోరుకుంటున్నాము.
(ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)