ఆంధ్రప్రదేశ్ లో అందరికంట పిన్నవయసు మంత్రి అయిన రాష్ట్ర వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ రాజ్యంగ కారణాల వల్ల పదవి నుంచి తప్పుకోవలసి వస్తున్నది. ఇలా రాజ్యంగ నియమం ప్రకారం చట్ట సభకు ఎన్నిక కాలేక పదవి పొగొట్టుకున్న వారిలో శ్రావణ్ రెండో వ్యక్తి. మొదటివాడు నందమూరి హరికృష్ణ.
హరికృష్ణ లాగే శ్రాశణ్ కుమాడు కూడా శాసన సభ్యుడు కాకుండానే 2018లో మంత్రి అయ్యారు. అలాంటపుడు అరునెలలో ఆయన ఏదో ఒక చోటనుంచి ఎమ్మెల్యేగా గెలివాలి . లేదా ఎమ్మెల్ సి కావాలి. ఆయన మంత్రి గా 2081 నవంబర్ 11 న ప్రమాణం చేశారు. ఈ నెల పదోతేదీకి ఆరునెలల గడువు పూర్తవుతుంది. రాజ్యంగంలోని ఆర్టికిల్ 164 (4) ప్రకారం ఆరునెలల్లో ఆయన ఏదో ఒక సభలో సభ్యుడు కావలి. మంత్రి అలా కాలేకపోయాడు కాబట్టి మంత్రిపదవికి రాజీనామా చేయాల్సి వస్తున్నది. ఆయన ఏదో ఒక చట్ట సభలో సభ్యుడయ్యేందుకు గత అరునెలల కాలంలో ఏ సభకు ఎన్నికలు జరగలేదు.
శ్రావణ్ తండ్రి, అరకులోయ టిడిపి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును సెప్టెంబర్ 23న, విశాఖ పట్నం ఏజన్సీలో లివ్రిపుట్టువద్ద మావోయిస్టులు హత్య చేశారు. సర్వేశ్వర రావుతో పాటు మరొక మాజీ ఎమ్మెల్యే సోమాను కూడ ఈ దాడి లో చనిపోయారు.
పార్టీ ఎమ్మెల్యే పొగొట్టుకున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు బెదిరిపోయి, పార్టీ పట్టు నుంచి చెదిరి పోకుండా ఉండేందుకు ఆయన కుమారుడు శ్రవణ్‌కుమార్ ను ఏకంగా క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఆయనతో పాటు నంద్యాలకు చెందిన ఎన్ ఎమ్ డి ఫరూక్ కూడా అపుడు మంత్రి అయ్యారు. ఫరూక్ అస్పటికే ఎమ్మెల్సీ కాబట్టి ఆయన కొనసాగుతారు.
ఈ సారి అరకు నుంచి శ్రావణ్ పోటీ చేస్తున్నారు. ఎన్నికలయితే ముగిశాయి గాని, ఫలితాలము 23 న వెలవడబోతున్నాయి. రాజ్యంగ నియమం ప్రకారం ఆరునెలలు పూర్తవుతున్నందన ఆయనను పదవినుంచి తప్పించాలని గవర్నర్ సూచించినట్లు చెబుతున్నారు.
రాజ్యంగం ఏం చెబుతుందంటే…
ఆరునెలల కాలంలో ఏ సభలో సభ్యుడు కాలేక మంత్రి పదవి పొగొట్టుకున్న తెలుగు రాష్ట్రాల మంత్రులలో శ్రావణ్ కుమార్ రెండో వ్యక్తి.. మొదటి వ్యక్తి నందమూరి హరికృష్ణ. 1996 చంద్రబాబు నాయుడి తిరుగుబాటు తర్వాత క్యాబినెట్ లో చేరాడు. ఆయన రవాణా శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే, ఆరు నెలల దాకా ఆయన శాసస సభకు ఎన్నిక కాలేకపోయారు. దీనితో ఆయన క్యాబినెట్ నుంచి తప్పుకోవలవ వచ్చింది. ఎన్టీయార్ మీద చంద్రబాబు తిరుగు బాటు చేసినపుడు హరికృష్ణ బావతోనే ఉన్నారు. దీనికి ప్రతిఫలంగా ఆయన మంత్రి పదవి ఇచ్చారు.