కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను అనే పదం తోనే ప్రజా హృదయంలోకి, వెళ్ళారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం నుండి అధికారంలోకి, వచ్చేవరకు నిరంతర శ్రమతో ముందుకు సాగిన చరిత్ర తనది. నిరంకుశత్వం అహంకారంతో కూడిన పాలనను నాడు గడీల పాలనగా భావించే సమాజానికి స్వేచ్ఛ వాయువులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రూపంలో వ్యాపించాయి. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఉద్యమ స్వభావం పోరాటా స్థానం తెగువ ఉంటాయి.
పాలమూరు జిల్లాలో పుట్టిన తాను, ఆదివాసి దళిత గిరిజన బంధువుగా, అక్కడి అడవులతో పెనవేసుకున్న బంధాలను, వారి కష్టసుఖాలను చూసిన నేతగా, అనతి కాలంలోనే, రాష్ట్రస్థాయి నేతగా ఎదిగినారు. చట్టసభలలో ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూనే, నిరంతరం పాలమూరు మట్టి మనుషుల, ప్రజా అభివృద్ధి కొరకు, అలాగే రాష్ట్ర ప్రజానీకం చైతన్యవైపు సాగడం కోసం నిత్యకుశివలుడిగా, కొనసాగినాడు. అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు పురుడుపోసుకుంటుంది.
ఈ నెల పై అలాగే కాళోజి చెప్పిన సూక్తిని ప్రజలు పాటించారు. శ్రీ, శ్రీ వ్యాఖ్యల్ని తెలంగాణ సమాజం జీర్ణించుకొని, ప్రగతి భవన్ కంచెలను చెరిపివేసి ప్రజాపాలనకు డిసెంబర్ మూడు నా అంకురార్పణ చేసింది. గెలిచిన ధీమాతో కాంగ్రెస్, పటిష్టమైన నిర్ణయాలను, ప్రజాభీష్టం మేరకు సాగుతుంది. చకాచకా నిర్ణయాత్మక వ్యూహాలకు పదును పెట్టింది. డిసెంబర్ 7న మంత్రులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మహోత్సవం కు హైదరాబాద్ వేదికగా, నూతన నవశకానికి నాంది పలికింది.
ఈ గడ్డపై కాంగ్రెస్ కలయికతో, కమ్యూనిస్టులు మేధావులు, ఉద్యమకారులు ఎన్నికల సమరం సాగించి సత్ఫలితాలను తెలంగాణ సమాజానికి అందించారు. ప్రజాస్వామ్య పాలన వైపు, ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన, ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేయడం ప్రారంభించింది.
అలాగే రాజ్యాంగ విలువల పరిరక్షణకు నడుం బిగించింది. గత పాలనకు నేటి పాలనకు ఆదిలోనే తేడాను చవిచూస్తుంది. ఈ సమాజం అంగులు, హార్భాటాలు లేని ప్రజా జీవితానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అధికారికంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వహించాల్సిన, కర్తవ్యాలను బోధిస్తున్నారు. విద్య, వైద్యం రంగాలపై దృష్టి సారించినట్లు మొదటి కేబినెట్ స్పష్టం చేసింది. అలాగే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఆరోగ్యశ్రీ వంటి నిర్ణయాలు ఆచరణలో పెట్టింది. విద్యుత్ రాష్ట్ర హక్కులపై వివిధ రంగాల శాఖల సమావేశాలపై, సమీక్షలు సర్దుబాట్లు చేస్తూ రాష్ట్ర పరిస్థితిపై శ్వేత పత్రం విడుదలకు సిద్ధమైంది. ఇక్కడ సీఎంగా రేవంత్ తన మార్కును ప్రజామనసుల్లోకి చోచ్చుకుపోతున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సాగుతున్న సమయం లో గవర్నర్ గారు ప్రసంగమూలో రాష్ట్రానికి ఏం కావాలో చెప్పింది. ఇన్నాళ్లు నిర్బంధాలను అక్రమ అరెస్టులను, చవిచూసిన ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేని హక్కుల అనుభవించామని చెప్పింది. ప్రతి పేదవారికి పక్క గృహాలు విద్యార్థి, యువజన రంగాల జీవనోపాధికై ఉద్యోగ కల్పన మహిళా సాధికారత వైపు సాగి మత్తుపదార్థాలపై ఉక్కు పాదం మోపుతూ, బెల్టు షాపుల వ్యవహారంపై తనదైన శైలిలో స్పందిస్తున్నాడు.అలాగే ఉద్యమ కారుల పై కేసుల ఎత్తివేత కు ప్రభుత్వం చొరవ చూపుతుంది.
మేడిగడ్డ బ్యారేజ్ లో జరిగిన నాసిరకమైన పనులపై, అవినీతిపై బాణాలను ఎక్కిపెడుతుంది. టిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏం చేయలేని నిరంకుశ పనీతనానికి ప్రజలు చాలా అనూహ్యమైన తీర్పును వెలువరించారు. ప్రస్తుతం గత పాలనను, మించిన నిర్ణయాలు అధికారాలు ప్రజల వైపు సాగించడంలో, ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతున్నారు. కొద్ది సమయంలోనే అక్రమార్కులపై కక్షకట్టకుండా స్టేట్, సెంట్రల్ దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటారని, పరోక్ష పిలుపునిస్తున్నారు. కావున ఎన్నో ఆశయాలు ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో, వాటి అమలుకు ఏమాత్రము గత సర్కార్ పనిచేయలేదనే, వాస్తవం చెప్పాక తప్పాదు.
కాంగ్రెస్ గెలుపు అమరవీరులకు అంకితం చేస్తూ, ప్రగతి భవన్ ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చి, నేరుగా ముఖ్యమంత్రిగారే ప్రజలను కలిసే అవకాశం కల్పించింది. ప్రభుత్వం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా భవనం కృషి చేస్తుంది. కానీ నేటి వరకు ఏ మంత్రం ఎమ్మెల్యేలను ప్రజలను ప్రగతి భవన్ దరి దపులకు, కూడా రానీయలేదు గత ప్రభుత్వం. ప్రజాస్వామ్య పలుకులు పలుకుతుంది.
ఈ తేడానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సీఎంగా తన మార్కు ప్రజల హృదయాల్లోకి వెళ్లాలని. రాబోయే రోజుల్లో ప్రజల కోసం పనిచేసే వారిగానే ముందుకు సాగాలని. రాష్ట్ర ఆశయాలను నెరవేర్చాలని కోరుకుందాం.
-గద్దల మహేందర్
కాంగ్రెస్ నాయకులు జనగామ నియోజకవర్గం
9963226580