-టి.లక్ష్మీనారాయణ
ప్రముఖ ఇంజనీర్ చెరుకూరి వీరయ్య(92)గారి మరణ వార్త తీవ్రదిగ్భ్రాంతి కలిగించింది. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో, ఇంటికే పరిమితమై ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల రంగంలో వీరయ్యగారు ప్రముఖ ఇంజనీర్ గా అందరి మన్ననలు పొందారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపైన, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు సంబంధించి విశేషమైన కృషి చేశారు. అనేక వ్యాసాలు వ్రాశారు. ప్రముఖ ఇంజనీర్ డా. కె.శ్రీరామకృష్ణయ్యగారితో కలిసి పనిచేశారు. డా. కె.శ్రీరామకృష్ణయ్యగారి పేరుతో స్మారక సేవా సమితిని ఏర్పాటు చేసి పుస్తకాలను ప్రచురించారు.
చెరుకూరి వీరయ్యగారు నాగార్జునసాగర్, శ్రీశైలం, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి, శ్రీశైలం కుడి గట్టు కాలువ, బలిమెల డ్యాం, మాచికండ్ జల విద్యుదుత్ఫత్తి కేంద్రం, తదితర ప్రాజెక్టుల నిర్వహణలో వివిధ హోదాల్లో ఇంజనీర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఇతర అంశాలపై కూడా మంచి రచనలు చేశారు. వారి మరణం ఆంధ్రప్రదేశ్ కు పూడ్చలేని నష్టం.
చెరుకూరి వీరయ్యగారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.
(టి.లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)