గంగాపురం-కోడిపర్తిలో కొత్త కళ్యాణీ చాళుక్య శాసనం
కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించిన కొత్త శాసనం
వెలుగు చూసిన భూలోక మల్ల(3వ సోమేశ్వరుని) కొత్త శాసనం
కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు ఆలూరి అనంతరెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి మహబూబునగర్ జిల్లా జడ్చర్ల మండలం ప్రసిద్ధ చారిత్రక ప్రదేశం గంగాపురం సమీపంలోని కోడిపర్తి గ్రామం పొలాల్లో పడివున్న రాతిస్తంభంపై కొత్త శాసనాన్ని గుర్తించారు. ఈ కొత్త శాసన స్తంభం ఇటీవల కురిసిన వర్షాలవల్ల పొలాల్లో బయటపడ్డదని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
తెలుగన్నడ లిపిలో, కన్నడభాషలో 19 పంక్తులలో వేయబడిన కళ్యాణీ చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల(3వ సోమేశ్వరుడు) పాలనాకాలంనాటిది ఈ శాసనం. శాసన సంవత్సరం వివరాలు అస్పష్టంగా వున్నాయి. శాసనంలో పేర్కొన్న మాసం, వారం, సోమగ్రహణ సందర్భాలతో ‘ఇండియన్ ఎఫిమెరిస్’ తొ పరిశీలించినపుడు ఈ శాసనం 1142(దుందుభి)సం. ఫిబ్రవరి 12 గురువారమని తెలుస్తున్నదని శాసనాన్ని చదివిన కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
ఈ శాసనం భూలోకమల్లుని కాలంలో మహాదండనాయకుడు గోవిందనాయకుడు సోమగ్రహణ సందర్భంగా మల్లికార్జున దేవరకు నైవేద్యం, నందాదీపం కొరకు చేసిన భూదానశాసనం సం.(అస్పష్టం) ఫాల్గుణ మాస పౌర్ణిమ గురువారంనాడు వేయబడింది. మహబూబునగర్ జిల్లా శాసనసంపుటులలో గంగాపురం శాసనాలు 8 వున్నాయి. భూలోకమల్లుని శాసనాలు 4, గోవింద దండనాయకుని పేరన 1 శాసనం వున్నాయి.
కోడిపర్తి శాసన పాఠం:
1. స్వస్తిశ్రీమచ్చాళుక్య భూలో
2. కమల్ల… ఆదేనేయవి
3. ….శ్రీ…వత్సరదపాల్గుణ
4. ..ద……..సి బ్రిహస్ప
5. తివారదలు శ్రీ మన్మహాప్రా
6. …నం దండనాయకనన…పొ
7. యుంగళమగశ్రీగోవింద
8. దండనాయకనసాహణి
9. …నాయక కోడూరరాయ
10. గేఱేయహిందోయమత్తగా…
11. …సోమగ్రహణనిమిత్త
12. …మల్లికార్జునదేవర….
13. …నిరడివర్గో నివేద్యక్కం నందా
14. (దివి)గ మంగ…..రా..
15. ….కందారాసోశ్చకంమా
16. ….దత్తిIIఈ ధర్మవనారొ…
17. …గొదవరంసాయరక
18. …యుమం బ్రాహ్మ..మ
19. నడిగ..పII
క్షేత్ర పరిశోధన: ఆలూరి అనంతరెడ్డి, 8328007113, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు
శాసన పరిష్కరణ: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం
డా. ఈమని శివనాగిరెడ్డి, 9848598446, సీఈవో, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్