నేడు ‘సంగీతం : మహదేవన్’ జయంతి

“మామ..మామ..మామా..” అపుడు ఇపుడు ఊపేస్తున్న పాట.

ఆ మామనే
తన పేరుగా మార్చుకున్న
మమ్మమ్మమ్మ  కెవి మహదేవన్..
*దసరాబుల్లోడు గోపీకి..
*మంచిమనసులు వేణుకి..
*శంకరశాస్త్రికి…
*అనంతరామశర్మకి…
ఎందరికో తన పాటలతో
ప్రాణం పోసిన
స్వరబ్రహ్మ పుట్టినరోజు..
సినిమా పాటకి పండుగరోజు!

క్లాసు..మాసు..
పాట ఏదైనా
ఈ మామ హై కలాసు…
*_ఆరేసుకోబోయి
*_పారేసుకున్నాను

ఊపేసింది తెలుగునాట..

*_ఎట్టాగొ ఉన్నాది ఓలమ్మి
*_ఏటేటో ఔతోంది సిన్నమ్మి…
ఈ పాట ఎంత ఊపో..
*_శంకరా నాద శరీరా పరా_*
*_వేద విహారా హరా.._* *_జీవేశ్వరా…_*
ఆ పాట అంత కైపు..
ఇలాంటి వెరైటీ ట్యూన్లు
కట్టిన మామ అదెంత తోపో!

తెలుగు రాని
ఈ సంగీత సరస్వతికి
పాటకు తగ్గ పల్లవి
ఇవ్వడంలో ఎనలేని పాండితి
కవి రాయనీ..
అప్పుడే సరిగమపదనీ..
అదే మామ బాణీ…
అలాగే కట్టేసాడు అద్భుతమైన
గీతాలకు అదిరిపోయే ట్యూన్లు…
*_ఉర్రూతలూగిపోయేలా_*
*_హీరోల ఫ్యాన్లు..!_*

మామా..నువ్వెళ్లి ఎన్నేళ్ళయినా…
నిన్ను మరచిపోవాలని
వేరే పాటలు వినాలని
ఎన్నిసార్లో అనుకున్నా..
*_మనసు రాక మానుకున్నా..!_*

పాట వింటుంటేనే
ఇది మహదేవన్ పాటరోయ్..
*_మెల్ల మెల్ల మెల్లగా_*
అంటూ హాయిగా..
*_కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల.._*
అలా ట్రిక్కీగా..
*_నవ్వులు రువ్వే పువ్వమ్మా_*
*_నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా.._*
ఇలా జలపాతంలా..
*_కొమ్మకొమ్మకో సన్నాయి.._*
*_కోటి రాగాలు ఉన్నాయి.._*
*_ఎందుకీ మౌనం.._*
*_ఏమిటీ ధ్యానం.._*
వేదనాభరితంగా…!

*_శిలలపై శిల్పాలు చెక్కినారు.._*
_*మనవాళ్ళు సృష్టికే*_
*_అందాలు తెచ్చినారు.._*
_కదలని..చెదరని శిల్పాల_ వలె
మామ పాటలు
హృదయ తంత్రులు మీటుతూనే ఉండు..
ఆయన పాట మన నోట
_*పలకాలి చిలక..*_
ఎహే..సిలక..
ఆయన ప్రతిభ చల్లగుండు..!

ఆకట్టుకునే ఆ మ్యూజిక్..
అదే మామ మ్యాజిక్..
అందంగా మ్రోగే గంటలు..
సెగ పుట్టించే చలిమంటలు..
శాస్త్రీయ సంగీతం రాని
బాలుకి పండిత పట్టాభిషేకం..
ఇక నీ దర్శకత్వంలో మాస్టారు పాడిన పాటలు
వింటుంటేనే
అదోలాంటి మైకం..
మొత్తంగా నీ పాటలన్నీ
*_అదిగో నవలోకం.._*
వెలసే మా కోసం..!

-సురేష్ కుమార్ ఇ. మొబైల్: 9948546286

(సోర్స్: వాట్సాప్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *