తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రశ్న

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టాయిష్టాల వ్యవహారం.    అంతా ఇది మేలు అనే దాని మీద ఆధారపడి ఉంది. ఎప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ రద్దు చేయకపోయినా నవంబర్ డిసెంబర్‌లో జరుగుతాయి.

అయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన  కారణంగా ముందు తెలంగాణ ఎన్నికలకు వెళతారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నసమ్ముతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రోజు అదే విషయం చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే ఆలోచిస్తున్నారని ఒక MLA కూడా అనుమనించారు. అసెంబ్లీ ఎన్నాకల్లో గెలిచి ఆ వేడిలో జాతీయ పార్టీ కి ప్రచారం చెస్తే క్రెడిబిలిటీ బాగావుంటుందని కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చని ఆయన చెప్పారు. అయితే, అంతే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ ముందస్తు ఎన్నికల లో ఓడకపోయినా సీట్ల సంఖ్య తగ్గితే…అది కూడా సెట్ బ్యాక్ అవుతుంది. ఈ సెట్ బ్యాక్ కేసీఆర్ లెక్క చేయరని, గెలుస్తాననే ధీమాతో ముందస్తుకు వెళతారని, దీని వల్ల ఎక్కువ ప్రయోజనాలు కనబడుతున్నాయని చాలామంది కేసీఆర్ అభిమానుల అభిప్రాయం.

ఒక వేళ ముందుస్తూకు పోవడం నిజమయి తే కేసీఆర్ అన్ని రకాలుగా సిద్ధమయి ఉంటారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు కేసీఆర్ అభ్యర్థులపై కూడా పూర్తి కసరత్తు చేశారు. అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకుని రంగంలోకి దిగారు. ఎక్కడా వెనుతిరిగి చూడకుండా ..మరోసారి విజయాన్ని అందుకున్నారు.

ఈ సారి కూడా ముందస్తుకు వెళ్లాలనుకుంటే.. అంతే ప్రణాళిక ప్రకారం వెళ్తారు. అందులో ఎలాంటి సందేహాలు ఉండవు. అంటే.. కేసీఆర్ ప్రిపరేషన్స్ విషయంలో బీఆర్ఎస్ కు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఎన్నికల వార్ లో గ్రౌండ్ రెడీ చేసుకుని కేసీఆర్ యుద్ధానికి సిద్ధమైపోయి ఉంటారు కానీ.. విపక్షాలు మాత్రం సిద్ధంగా ఉంటాయా లేదా అన్నది ఆలోచించాల్సిన విషయమే.

బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న రెండు పార్టీలు జాతీయ పార్టీలే. వాటి నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఢిల్లీ నుంచే తీసుకోవాలి. అందుకే బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తీసుకున్నంత వేగంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఇంకా చెప్పాలంటే.. ముందస్తుగా కసరత్తు కూడా చేసుకోలేరు. అందుకే రెండు విపక్ష పార్టీల్లోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది.

ఇక ఆ పార్టీల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం, అపయిన అసంతృప్తి, తిరుగుబాట్లు, పార్టీ ఫిరాయింపులు …అబ్బో చాలా నాటకాలు ఉంటాయి.

ఇంకా ఎన్నికల ప్రిపరేషన్స్ ప్రారంభించలేని నిస్సహాయత కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికలు వచ్చినా… సమయానికే ఎన్నికలు జరిగినా సిద్దమవడం అనే కసరత్తే ఉండదు. ఎన్నికల తేదీలు వచ్చాక.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా అబ్యర్థుల కసరత్తు జరుగుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకూ ఈ పంచాయతీ జరుగుతుంది. ఇలాంటి రాజకీయ కసరత్తు ఉండే కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా పెద్దగా మార్పేమీ ఉండవు.

అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ఆయన చెబుతున్నారు.. కానీ సీనియర్ల సహాయ నిరాకరణతో ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతూనే ఉన్నారు. ఆయన రెండు, మూడు రోజుల కిందటే పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే రేవంత్ కిందా మీదా పడాల్సిందే. ఇక అధికారంలోకి వచ్చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో తప్ప ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. చేరికల కోసం వేసిన మాస్టర్ ప్లాన్స్ అన్నీ విపలమయ్యాయి. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టిక్కెట్లు రాని నేతలకు .. బీ ఫారాలు ఇచ్చి పోటీ చేయించడం మినహా ఆ పార్టీకి మరో దారి ఉండదన్న వాదన ఉంది. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు … ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని ప్రకటనలు చేస్తూ ఉంటాయి. కానీ అసలు గ్రౌండ్‌లో మాత్రం అలా ఉండదు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే.. సన్నాహాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయి అని చెప్పక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *