ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తొలిసారి తిరిగుబాటు స్వరం వినిపించింది. పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి పబ్లిక్ గా రెచ్చిపోయారు. ఈ నివురు సరిపోతుందా భగ్గున మండుతుందా? తనేందుకు పార్టీమీద తిరగ బడాల్సి వస్తున్నదో చెప్పేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరుగుతూ ప్రభుత్వం ఇసుక మద్యం రూపంలో వేల కోట్ల రూపాయలు దోచుకుంటుందని దానిమీద సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇవ్వాలని అన్నారు.
కోటంరెడ్డి ఏమన్నారంటే..
నేను మాట మీద నిలబడే వ్యక్తినని నాధిక్కార స్వరం వినిపిస్తూనే ఉంటాను అని నాగొంతు ఆపలంటే ఒక్కటే మార్గం అని నన్ను నన్ను ఎన్కౌంటర్ చేయడమే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు….
ఎన్నికలు మార్చి గానీ ఏప్రిల్ లో గాని ఎప్పుడైనా రావచ్చు
ఇంకా చాలా నెలలు అధికారం ఉన్నా మనస్తాపం చెంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆధారాలు చూపించి బయటకు వచ్చా….
ఎంతో నమ్మిన నా అధినాయకుడు నా పార్టీ నన్ను అనుమానించిన తర్వాత ఇంక ఆ పార్టీ లో వుండలేకే బయటకు వచ్చా…
అధికారం వుండి కూడా అధికారానికి దూరంగా జరుగుతున్నా అంటే ఎన్ని సమస్యలు వస్తాయో నాకు తెలుసు…
నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను అని ఆరోపణ చేసిన వెంటనే ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశించి వుంటే సంతోషించి వుండే వాడిని,కానీ ఎటువంటి విచారణ చేయకుండా నా మీద మంత్రులు,జిల్లా కో ఆర్డినేటర్ లు అనేక మాటలు అన్నారు…
నా తమ్ముడు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు నాకు మద్య మంచి సంబంధాలు ఉన్నాయి,కానీ ఆయన నామీద నిన్న అనేక విమర్శలు చేశాడు…
అనిల్ యాదవ్ నిన్న మాట్లాడుతూ పార్టీ కి ద్రోహం చేసావు,ఆ పాపం నీ బిడ్డలుకు శాపంగా తగిలి సర్వనాశనం ఐపోతావు అని అన్నావు, ఆ మాటలకు వివరణ ఇస్తున్నా..
నేను తప్పు చేసి వుంటే దేవుడి ని నేనో కోరుతున్నా నేను సర్వనాశనం ఐపోతా అంతే కానీ ఇతరులు నాశనం ఐపోవలి అని కోరుకోను…
నమ్మక ద్రోహం గురించి అనిల్ యాదవ్ మాట్లాడుతున్నాడు అనిల్ నీకు కార్పొరేటర్ పదవి అవకాశం ఇచ్చింది ఆనం వివేకానందరెడ్డి కాదా,అలాంటి ఆనం వారి ఇంటి మీదకు పోతా అన్నది నువ్వు కాదా?
నువ్వు వోడిపోతే నిన్ను బుజాలు మీద మోసింది ఈ శ్రీధర్ అన్న కాదా అవన్నీ మరిచిపోయావా?
సాక్షిలో ఒక కథనం వచ్చింది డిసెంబర్ 25 న బ్లూ బెంజ్ కారులో చంద్ర బాబాను కలిసినట్టు వార్త రాశారు,నేను నెల్లూరు లో సేవా కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబు ను ఎలా కలుస్తాను,ఒక వేళ మీరు అది నిజం అనుకుంటే నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయవచ్చు కదా….
సజ్జాల్ పై ఫైర్ అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…
నిన్న ఒక ఆడియో సోషల్ మీడియా లో నేను నెలకు 2 లక్షలు మామూళ్లు తీసుకుంటున్నట్టు వచ్చింది,ఈ ఆడియోకి సజ్జల రామకృష్ణా రెడ్డి లాంటి వారే రూప కల్పన చేసి వుంటారు అనుకుంటున్న..
సజ్జల్ రామకృష్ణ రెడ్డి ఇసుక పేరుతో,మద్యం పేరుతో వందల వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది మీకు వీలుంటే ఇసుకాసురులు,మద్యం మాఫియా వారిమీద ఆడియో లు రిలీజ్ చేయండి, కాంట్రాక్టర్ లు కు బిల్లులు ఇచ్చే విషయం పై ఆలోచించండి
నీకుమారుడు సజ్జల భార్గవ్ కోసం నేను నా కార్యకర్తలు కష్ట పడలేదా
నన్ను అరెస్టు చేస్తారంటూ మీడియాకు లీకలు ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడే పోలీసులు పంపించి అరెస్టు చేయించుకో జైళ్లు చాలా అచ్చివస్తాయి,జార్జ్ ఫెర్నండెజ్ జైల్లో ఉండే గెలిచాడు…
రూరల్ నియోజక వర్గం ఇంచార్జీ గా బాధ్యతల స్వీకరించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కి నా అభినందనలు,రూరల్ నియోజక వర్గం అభివృద్ధి కి ఒక శాససభ్యుడిగా పూర్తిగా సహకారం అందిస్తా…
ఇప్పుడు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కమిషనర్ ఇతర అధికారులందరూ కూడా మీ మాట వింటారు కాబట్టి రూరల్ నియోజకవర్గం లో పెండింగ్లో ఉన్న
DKW కలేజి దగ్గర రోడ్డు మార్గం,
వావిలేతు పాడు జగన్ అన్న ఇళ్ళ కాలనీ,
బారా షాహిద్ దర్గా పనులు పూర్తిచేయడం,
ముస్లిం గిరిజన విద్యార్థులకు పాఠశాలలు నిర్మించడం,
ఆమం చర్ల డీప్ కుట్ పనులు పూర్తి
కొమ్మలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చేయండి…