ఖమ్మం BRS సభ ఎలా ఉంటుందంటే…?

జనవరి 18న ఖమ్మంలో జరగనున్న BRS సభ విశేషాలను మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే…

18 న జరిగే ఖమ్మం సభ చారిత్రక సభ..

దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ..

వంద ఎకరాల్లో బహిరంగ సభ జరుగుతుంది

పార్కింగ్ 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశాము

వెయ్యి మంది వాలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారు

నియోజక వర్గాల వారీగా ఇన్ చార్జి లను నియమించి జన సమీకరణ చేస్తున్నాం

13 నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ చేస్తున్నాం..ప్రజల నుంచి స్పందన వస్తోంది

సభకు వాహనాలు దొరకడం లేదు..

పక్క రాష్ట్రాల నుంచి బస్సులు,వాహనాలు సమకూరుస్తున్నాము

ముఖ్య అతిధులతో పాటు
ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు,నేతలు వేదికపై ఉంటారు

రేపు రాత్రికి ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకుంటారు

ఎల్లుండి 18 న ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు చర్చలు జరుపుతారు

యాదాద్రి దర్శనం చేసుకొని..రెండు హెలి కాప్టర్ల లో ఖమ్మం చేరుకుంటారు

నూతన కలెక్టరేట్ ప్రారంభం తర్వాత
ఖమ్మం కలెక్టరేట్ లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారు.

కంటి వెలుగు ప్రారంభం తర్వాత కలెక్టరేట్ లో నలుగురు ముఖ్యమత్రులు భోజనం చేస్తారు..

సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది

కళా కారులకు ప్రత్యేక వేదిక ఉంటుంది.. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *