కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు రంగంలో నెలకొల్పుకొంటామని కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిగారు ఉత్తరం వ్రాశారని బిజెపి ప్రతినిథి పార్థసారథిగారు ఈ రోజు ఉదయం టీవీ5 చర్చలో ప్రస్తావించారు.
దానిపై స్పందిస్తూ, ఆ ఉత్తరాన్ని మోడీ ప్రభుత్వం తక్షణం బహిర్గతం చేయాలని నేను డిమాండ్ చేశాను. జగన్మోహన్ రెడ్డిగారు నిన్న కడప జిల్లాలో మాట్లాడుతూ విభజన చట్టంలో కడప ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యానించిన విషయం విదితమే.
కడప ఉక్కు కర్మాగారాన్ని విభజన చట్టం మేరకు ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పాలని జగన్మోహన్ రెడ్డిగారు ఏనాడైనా డిమాండ్ చేశారా? లేదా, బిజెపి ప్రతినిథి తెలియజేసినట్లు ప్రయివేటు రంగంలో నెలకొల్పుకొంటామని ఉత్తరం వ్రాశారా! ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నది.
కడప ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడం లాభదాయకం కాదని మోడీ ప్రభుత్వం చెప్పి వెనుకబడ్డ రాయలసీమను దగా చేసిన విషయం వాస్తవం కాదా! జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేయాలని నేను డిమాండ్ చేశా.
-టి. లక్ష్మీనారాయణ