‘లంపి’ మనుషులకు సోకుతుందా ?

డాక్టర్ భాస్కర్,
(ఎస్వీ వెటర్నరీ యూని వర్సిటీ, తిరుపతి)

‘లంపి’ అనే ఈ వ్యాధి పశువుల నుండి మానవాళికి సంక్రమీస్తుందని ఈ మధ్య పేపర్లోను, ఛానెళ్ళలోనూ తరచుగా ప్రచారం జరుగుతోంది.

దీనిలో వాస్తవం ఎంత ?

లంపి చర్మ వ్యాధి సోకిన పశువుల పాలు మానవ వినియోగానికి సురక్షితమేనా?

ముందుగా పశువులలో సంక్రమించే లంపి చర్మ వ్యాధి గురించి తెలుసుకొందాము.

ఈ మధ్య అనేక సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతూ ప్రజలలోకి తప్పుడు సంకేతాలను పంపుతున్నాయి.

లంపి చర్మ వ్యాధి వ్యాప్తి కారణంగా పాలు మానవ వినియోగానికి ప్రమాద కరంగా మారాయని, వ్యాధి సోకిన జంతువు నుండి వచ్చిన పాలు తాగడం వల్ల మానవులలో కూడా చర్మ వ్యాధి వ్యాపి వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ , మానవాళిలో తెలియని భయానికి భయాన్ని కల్పిస్తున్నారు.

‘న్యూరో ఫైబ్రోమాటోసిస్ టైపు 1’ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల చిత్రాలను చూపుతూ వీరు లంపి చర్మ వ్యాధి సోకిన పశువు పాలు త్రాగడం వలన వీరికి ఈ జబ్బు సోకిందని విషప్రచారం చేస్తూ జనబాహుళ్యం లో తెలియని భయాన్ని సృష్టిస్తున్నారు.

లంపి స్కిన్ డిసీస్ జూనోటిక్ వ్యాధి కాదు. అంటే ఈ వ్యాధి మనుషులకు వ్యాపించదు. ఇది పశువులలో మాత్రమే దోమలు, ఈగలు , పేలు వంటి వాహకాల ద్వారా వ్యాపించే ఒక అంటువ్యాధి.

యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం, ఈ వ్యాధి సోకిన జంతువులు నోరు, ముక్కు నుంచి కారే స్రావాల ద్వారా వైరస్‌ను విడుదల చేస్తాయి. ఇవి ఆహారం, నీటి తొట్టెలను కలుషితం చేస్తాయి.

అందువల్ల, వ్యాధి వాహకాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా కానీ, కలుషితమైన మేత, నీటి ద్వారా ఇంకొక పశువుకి వ్యాపిస్తుంది.

లంఫీస్కిన్ డిసీస్ నివారణ కొరకు పశువైద్య సిబ్బంది గ్రామగ్రామాలలో తిరుగుతూ రైతు ఇంటి ముoగిటనే ఉచితంగా టీకాలు వేస్తున్నారు.

టీకాలు పశువులకు వేసుకోవడం మూలాన పశువులలో రోగనిరోధక శక్తి పెరగడమే కాక వ్యాధిని ఎదుర్కోవడానికి పశువులకు సులభతరమవుతుంది.

లంపి స్కిన్ వ్యాధిని మన జిల్లాలో అరికట్టడానికి ఇతర జిల్లాలనుంచి, పక్క రాష్ట్రాలనుంచి వ్యాధి సోకిన పశువులు జిల్లాలోకి రాకుండా ఇరవై నాలుగు గంటలు పాటు సురుటుపల్లి,తడ చెక్ పోస్టుల లో పశువైద్య సిబ్బంది వ్యాధిసోకిన పశువులు జిల్లా లోకి రాకుండా చూస్తున్నా రు.

లంపి స్కిన్ వ్యాధికి సంబంధించిన వాక్సిన్ ఇంకా తయారీ దశలోనే వుంది.

గొట్ పాక్స్ వైరస్, లంపి స్కిన్ డిసీస్ వైరస్ రెండు అంటిజినికెల్లి కి సంబందించినది కావడం మూలాన దేశవ్యాప్తంగా గొట్ పాక్స్ వాక్సిన్ ని లంపి స్కిన్ డిసీస్ నివారణకు ఉపయోగిస్తున్నారు.

గొట్ పాక్స్ వాక్సిన్ లంపి స్కిన్ డిసీస్ రాకుండా నివారించదు. గొట్ పాక్స్ వాక్సిన్ వేయడం వలన పశువుల్లో వ్యాధి నిరోధకత పెరిగి లంపి స్కిన్ వ్యాధి నుంచి తొందరగా కోలుకొంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *