తెలంగాణ ఫస్ట్: ఇదే మర్రి నినాదం…

 

టిఆరెస్ పార్టీ నుండి ప్రజలకి విముక్తి కలిగించాలని,

తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతో నేను ముందుకెళ్తానని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ లేఖని సోనియా గాంధీకి పంపి రాజీనామా కారణాలను వివరించినట్లు చెప్పారు. తాను బీజేపీ లో చేరుతున్నట్లు ప్రకటించినారు.

ఆయన ఏమేమీ చెప్పారంటే…

*రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థాయిని కొల్పోయింది .

*నాకు ఎలాంటి నోటిస్ రాలేదు.. నన్ను సస్పెండ్ చేసినట్లు కూడ నాకు తెలీదు

నేను మొన్న అమిత్ షా ని కలిశాను బీజేపీ లో చేరతాను

పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి నేను బీజేపీ లోకి వెళతాను..

టిఆరెస్ తో కాంగ్రెస్ పార్టీ కుమ్మకై ముందుకి వెళుతుంది

*తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతో నేను ముందుకెళ్తాను.

*మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి *

*ఎంతో బాధతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.*

*ఈరోజు తో కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నాను*

ఎందుకు రాజీనామా చేశానో సోనియాగాంధీ కి లేఖలో వివరించాను.

కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దిగజారుతోంది ..

*చేతి గుర్తును ఎంపిక చేయడంలో నాన్నగారి పాత్ర చాలా ఉంది…*

కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడంలో మర్రి చెన్నారెడ్డి పాత్ర ఉంది

*ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన విషయాన్ని పూర్తిగా కాంగ్రెస్ విస్మరించింది…*

*కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయిందన్నది ప్రజల్లోకి వెళ్లిపోయింది..*

ఆయన వచినప్పటి నుండి అన్ని ఎన్నికల్లో ఓడిపోయాము

*పీసీసీ అధ్యక్షులకి ఇంఛార్జ్ లు ఏజెంట్స్ లా మారిపోయారు ..*

*పీసీసీ అధ్యక్షులు బంగారు బాతు గుడ్డులు మారిపోయారు ..*

*ఇది ఇంచార్జ్ లకే కాదు.. పైన ఉన్న KC వేణుగోపాల్ కి కూడ వర్తిస్తుంది ..*

మేము కలుస్తాము అంటే kc వేణుగొపాల్ కలవనివ్వలేదు ..

*సోనియాగాంధీ కూడ నిస్సహాయంగా ఉంది..*

కాంగ్రెస్ పార్టీ లో డబ్బు ఉన్నవాళ్లదే మాట చెల్లుతుంది ..

ఉత్తం కుమార్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడారు ..

కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లు పార్టీ లో ఉంటారో లేదో అన్న అలోచోన ప్రజల్లో వచ్చింది ..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *