ఈ ఫొటోలో ఉన్న పెద్దాయనని గుర్తు పెట్టారా?
ఆయనెవరో కాదు సొంత సొమ్ము ఖర్చు చేసి
తాడిపత్రి ప్రజలకు నీరు అందిస్తానంటున్న మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ అంటే మీలో ఉండే ఇమేజి కి ఈ స్టేట్ మెంట్ కి తేడా ఉంది కదూ. అంతే… కొన్ని సార్లు కొత్త కోణాలు బయట పడుతూ ఉంటాయి. మనం అవాక్కవుతూ ఉంటాం. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈ కొత్త యాంగిల్ నుంచి చూడండి.
అసలు కథ ఏందంటే..
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మనిషి వేరు పట్టుదల వేరు. ఇలా మాట్లాడితే చాలా మందికి కోపం రావ చ్చు. అవును. నిజం . తాడిపత్రి మునిసిపాలిటీని రాజకీయాలకు అతీతంగా చూస్తేనే ప్రభాకర్ రెడ్డి అర్థం అవుతాడు. ఈ మునిసిపాలిటీ దేశంలోనే ఉత్తమమయిన మునిసిపాలిటి గా మార్చిన వ్యక్తి ఆయన. మునిసిపాలిటీని, మన టౌన్ లలో ఉన్న అరాచకాన్ని అదుపులోకి తీసుకుని పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడంలో విజయవంతం అయ్యారు. ఊరును శుభ్రముగా, ప్లాస్టిక్ రహితంగా చేయడం లో సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో మన పౌరులను దారికి తీసుకురావడంలో ఎక్కడ ఎవరు విజయంతం కాలేకపోతున్నారు. అయితే ఆయన, గతంలో చైర్మన్ గా ఉన్నపుడు, కరసేవ, కర్ర ద్వారా టౌన్ ని మచ్చిక చేరుకున్నారు. తెలవారక ముందే తానే రంగంలోకి దిగి చెత్త వేయడాన్ని నయాన భయాన నిరోధించారు. ఆయన మార్గమే కరెక్ట్ అనేలా ప్రజల్లో మార్పు తెచ్చారు.
రెండో సారి చైర్మన్ అయ్యే నాటికి రాష్ట్రం లో వచ్చిన రాజకీయ మార్పులు ఆయన పనికి కొంత ఆటంకమయినా తగ్గేదేలే అంటున్నారు.
పట్టణ ప్రజలకు నిరాటంకంగా మంచినీరు అందించే యజ్ఞం తలపెట్టారు. దీనికోసం సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ విషయంలో లక్షల రూపాయల ఖర్చుకు వెనుకాడనని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే…
పెన్నా నదికి ఇటీవల వచ్చిన వరద తాకిడికి ప్రజలకు మంచినీటి సమస్య ఎదురైంది
మంచినీటి సరఫరా కోసం మున్సిపాలిటీ ఎన్నో ఏళ్ల ఎపుడో వేసిన మోటర్లు, పైప్ లైన్లు కొట్టుకొని పోయాయి. దీనితో ప్రజలు మంచినీటికి కటకట లాడారు. వరదలు రావడం ఈ మధ్య ఎక్కువ కావడంతో దీనికోక శాస్వత పరిష్కారం కనుక్కోవలనుకున్నారు.
లక్షల రూపాయల ఖర్చుచేసి ప్రజలకు మంచినీరు అందించడానికి ఒక మహా యజ్ఞం తలపెట్టారు.
వివరాల్లోకి వెళితే…
గండికోట రిజర్వాయర్ నుండి పైప్లైన్ ద్వారా తాడిపత్రి మున్సిపాలిటీ ప్రజలకు మంచినీరు అందిస్తోంది…. పైప్లైన్ ఎప్పుడైనా, ఏదైనా మరమ్మత్తులు జరిగితే స్థానికంగా పెన్నా నదిలో వేసిన బోర్ల ద్వారా మంచి నీరు విడుదల చేసేవారు. 2010 సంవత్సరం నుండి ఇదేవిధంగా ప్రజలకు మంచినీరు అందిస్తున్నారు. గండికోట పైప్ లైన్ పూర్తిస్థాయిలో మరమ్మతులకు గురైనా ఒకటి రెండు రోజులు మాత్రమే ప్రజలు ఇబ్బందులు పడేవారు..
నవంబర్ నెలలో గండికోట నుండి వచ్చే పైప్ లైన్ ను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టారు… దీంతో ఆరు రోజులుగా ప్రజలు మంచినీరు లేక తీవ్ర అవస్థలు పడ్డారు… తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టిడిపి కౌన్సిలర్ల బృందం పైప్ లైన్ కు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు… మరమ్మత్తులు పూర్తి అయినా ఎందుకు మంచినీరు విడుదల చేయలేదని గుత్తేదారును ప్రశ్నించగా మున్సిపాలిటీలో షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఎమ్మెల్యే పేరుతో బెదిరించడం వల్లే మీకు నీరు విడుదల చేయలేదని తేల్చి చెప్పినట్లు కౌన్సిలర్లు జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలియజేశారు… రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాడిపత్రి మున్సిపాలిటీలో టిడిపికి ఓట్లు వేయడం వల్లే కక్ష ధోరణితో షాడో ఎమ్మెల్యే ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడని వారు ఆరోపించారు…
వెంటనే స్పందించిన జెసి ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థుల కుట్రలను భగ్నం చేసే విధంగా… వారికి సవాల్ విసిరేలా ఏకంగా 35 ట్రాక్టర్ ట్యాంకర్లు, రెండు లారీ ట్యాంకర్లతో ప్రజలకు మంచినీరు అందించారు… మరుసటి రోజే గండికోట నుండి నీరు విడుదల అయ్యాయి… వివాదం సమిసి పోయిందనే లోపే గుర్తు తెలియని వ్యక్తులు పైప్ లైన్ కు వీరాపురం వద్ద గండి కొట్టారు…. తన ప్రత్యర్థులే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని భావించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఇక లాభం లేదనుకుని ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు… ఇంకేముంది…..
ప్రత్యామ్నాయ మార్గమైన తాడిపత్రి పెన్నా నది నుండి ఎటువంటి పరిస్థితుల్లో వారం రోజుల్లోపు తాడిపత్రి ప్రజలకు మంచినీరు అందించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయించుకున్నారు ….అనుకున్నదే తడువుగా వరదల్లో పూడిపోయిన మోటార్లను గుర్తించేందుకు తనకున్న అనుభవంతో జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు…. ఆయన తన సిబ్బందికి తగిన సూచనలు అందజేస్తూ మోటార్లను వెలికి తీసే పనిలో సోమవారం నుండి నిమగ్నమయ్యారు … అలాగే కొట్టుకుపోయిన పైప్లైన్ స్థానంలో కొత్త వాటిని లక్షల రూపాయలు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేశారు…
40 ఏళ్లుగా నా వెంట ఉన్నారు… వారికి నీరు అందించకపోతే ఎలా?
40 ఏళ్లుగా జేసీ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారని… వాళ్లకు మంచినీరు అందించలేక పోతే నా జన్మకు సార్థకత ఏ విధంగా చేకూరుతుందని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఎన్ని లక్షలు ఖర్చయినా మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరు త్వరితగతిర తాగునీరు అందిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు…