అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమ
అనంతపురం లోని జెడ్పీ హాల్ లో ‘అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి’ నిర్వహించిన
సదస్సు లో తీర్మానించడం జరిగింది. తీర్మానాలు:
రాయలసీమ లో రాజధాని హైకోర్టు
తక్షణం ఏర్పాటు చేయాలి..
1. రాష్ట్ర ప్రభుత్వం 2020 జనవరి నెలన అసెంబ్లీ సాక్షిగా ఆమోదించిన మూడు రాజధానుల చట్టం నిర్ణయాన్ని తక్షణం అమలు చేయాలి.
2. న్యాయరాజధాని కర్నూలులో హైకోర్టును భవిష్యత్తులో బెంచ్ లుగా విభజించాలని భావిస్తున్నట్లే రాయలసీమలోను మినీ సెక్రటేరియట్, ఒక సెక్షన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.
3.శ్రీ బాగ్ ఒప్పందం, శ్రీ కృష్ణ కమిటీ, శివరామన్ కమిటీ, జి.యన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ ల వికేంద్రీకరణ విషయమై చేసిన సూచనలు పరిగణలోకి తీసుకొని అమలు చేయాలి.
4. విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీనీవా, గాలేరునగరి,తెలుగంగ,వెలిగొండ ప్రధాన ప్రాజక్టులు పూర్తిచేసి నికరజలాలు కేటాయించాలి.
5.తుంగభద్ర సమాంతర కాలువ, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్ట్ లు, సిద్దేశ్వరం అలుగు. సంప్రదాయ నీటివనరుల సంరక్షణ చేపట్టాలి. కరువునివారణకు ప్రత్యేక పథకాలు కొనసాగించాలి.
6. కృష్ణా యాజమాన్య బోర్డు ను కర్నూలు లో ఏర్పాటు చేయాలి.
7. విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీని బుందేల్కండ్ తరహాలో అమలు చేయాలి.
8. ప్రత్యేక హోదా అమలు చేయాలి.
9. గుంతకల్లు లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి.
10. విభజన చట్టంలోని ఎయిమ్స్, అగ్రికల్చర్ యూనివర్శిటీ లను రాయలసీమలో నెలకొల్పాలి.
11.రాయలసీమ ప్రాంత సమస్యలు, సాంస్కృతిక అధ్యయనానికి ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి.
12. ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తి చేయాలి.
13. ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
పై డిమాండ్ లపై అన్ని రాజకీయ పార్టీలు తమ
వైఖరిని స్ఫష్టం చెయ్యాలి లేకుంటే ఎన్నికల్లో
ప్రజలే ఎవరికి ఓట్లు వెయ్యాలో నిర్ణయం తీసుకుంటారు..
అనంతపురం లోని జెడ్పీ హాల్ లో ‘అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి’ నిర్వహించిన
సదస్సు లో తీర్మానించడం జరిగింది