గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సేవాగఢ్ లోని గురుకుల జూనియర్ కళాశాల లో గుత్తి కోట చరిత్ర పై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గుత్తి కోట సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి వై.రాజ శేఖర్ రెడ్డి కోరారు.
ప్రపంచంలో నే అద్భుతమైన కోటలు రాతి నిర్మాణాలు 101 బావులు బురుజులు
9 కిలోమీటర్ల కోటగొడ రానివాసాలు రహస్యపు సొరంగాలు గుర్రపు,ఏనుగుసాలలు పురాతన గుడులు లాంటి ఎన్నో పురాతన కట్టడాలు ఈ కోటలో ఉన్నాయి అందరూ గుత్తికోట ను సందర్శించి ఆనాటి జ్ఞాపకల్లో విహరించాలన్నారు.
గుత్తి కోట పై తాగు నీరు రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు.అలానే కోట లోని కట్టడాలు సూచిస్తూ సూచికలు ఏర్పాటు చేసి కూలిన కట్టడాలను పునర్నిర్మాణం చేయాలన్నారు. కోటపైకి రోడ్డుని నిర్మించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గుత్తి కోట సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి వై.రాజ శేఖర్ రెడ్డి,ఉపాదక్షుడు కాశీ రావు,కోటేశ్వర రావు ,జ్ఞానేశ్వర్ రెడ్డి,గైడ్ రమేష్, అధ్యాపకులు
వెంకటరాముడు,నిరంజన్,లోకన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు.