సింగరేణి గనులను అమ్మేది లేదు: ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. అలాగే, మూడు నేషనల్‌ హైవేలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో​ మోదీ.. తెలుగు పదాలతో ప్రసంగం ప్రారంభించారు.

అక్కడ ప్రసంగిస్తూ సింగరేణి గనులను ప్రైవేటికరించే ఆలోచనే తమ దగ్గిర లేదని ప్రధాని స్పష్టమ్ చేశారు.కంపెనీ యాజమాన్యం 51 శాతం వాటితో తెలంగాణ దగ్గిర ఉన్నపుడు కేంద్రం రల ప్రైవేటికరిస్తుంది అని ప్రధాని ప్రశ్నించారు.

“సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశక్తే లేదు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం వాటా కేవలం 49 శాతం మాత్రమే. ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి ఉండదు. మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్రం ఎలా విక్రయిస్తుంది?. బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు. పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న వారికి ఈరోజు నిద్రకూడా పట్టదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ప్రధాని మోదీ ఇంకా ఏమన్నారంటే.. ‘రైతులు, సోదర, సోదరీమణులకు నమస్కారాలు. ఈ సభకు వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు. రైల్వేలైన్‌, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కరోనాతో పాటు యుద్ధాల కారణంగా సంక్షోభం వచ్చింది. రెండున్నరేళ్లుగా ప్రపంచం సంక్షోభంలో ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత్‌.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కాకపోవడంతో గతంలో ఈ కంపెనీ మూతపడింది. కొత్త ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇప్పుడు ఫెర్టిలైజర్‌ సెక్టార్‌ను చాలా అభివృద్ధి చేశాము. తక్కువ ధరకే నీమ్‌ కోటింగ్ యూరియా అందిస్తున్నాము.

గత 8 ఏళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధి పనుల మంజూరులో వేగం పెంచాము. సంక్షోభం సమయంలోనూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాము. విపత్కర పరిస్థితుల్లోనూ సంస్కరణలు తెచ్చాము. నిరంతరం అభివృద్ధి కోసమే తపిస్తున్నాము. మేము శంకుస్థాపనలకే పరిమితం కాలేదు.. పనులు కూడా వేగంగా పూర్తి చేశాము. ఎరువుల కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం. రైతులు లైన్లలో నిలబడేవారు. లాఠీదెబ్బలు తినేవారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీతో ఎరువుల కొరత తీరుతుంది. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు ఇస్తున్నాము. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకునే చర్యలు చేపట్టాము. యూరియా బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాము. 5 ఫ్యాక్టరీల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోంది. పీఎం కిసాన్‌ కింద రైతులకు రూ.6వేలు అందిస్తున్నాము. రైతుల కోసం 10 లక్షల కోట్లు ఖర్చుచేశాము. వచ్చే రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తాము.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *