2వ రోజూ ఉల్లాసంగా సాగిన రెవిన్యూ క్రీడలు

అమరావతిలో అంబరానంటుతున్న సాంస్కృతిక పోటీలు…

రెవెన్యూ శాఖలోని గ్రామ రెవిన్యూ సహాయకుని స్థాయి నుండి డిప్యూటీ కలెక్టరు స్థాయి వరకు నవంబర్-11 వ తేది న మొదలైన రెవిన్యూ క్రీడలలో ఒక జిల్లాకి మరో జిల్లా గట్టి పోటీనిస్తూ ఏంతో ఉల్లాసంగా రెండవరోజు కు చేరాయి. ప్రతీ క్రీడలోనూ నువ్వా నిన్న అన్నట్లు పోటీపడుతూ ఎక్కడికక్కడ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్నేహపూర్వక వాతావరణములో క్రీడలో సాగుతుంటే … మరొక ప్రక్క రెవిన్యూ ఉద్యోగులు సినీ గాయకులకు, తారలకు మేమేమి తక్కువ కాదంటూ భక్తి పాటలను, సినీ గేయాలను పాడుతూ, వివిధ పౌరాణిక వేష దారణలో స్కిట్స్ వేస్తూ బహుమతి నీకా నాకా అనెంత స్థాయిలో ఒకరితో ఒకరు పోటీపడుతూ సాంస్కృతిక కార్యక్రమాలను అంబరన్నటిస్తున్నారు.

రెండవ రోజుకి చేరిన రెవిన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములలో సాయంత్రము 6 గంటల నుండి సినీ గాయకులు శ్రీమతి సునీత గారు , సింహా గారు, సాయి భార్గవి గారు తదీతరులచే సంగీత విభావరి కార్యక్రమము, కాంప్ ఫైర్ నిర్వహించగా ఉద్యోగుల ఉర్రూతలూగుతూ పదం కలుపుతూ , నాట్యలతో ఉల్లాసంగా సాగాయి.

కాగా , 6 వ రాష్ట్ర స్థాయి రెవిన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములు – 2022 ముగింపు ఉత్సవములు తేదీ 13.11.2022 న (ఆదివారం) సాయింత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గౌ II రెవిన్యూ, రిజిస్ట్రెషన్ మరియు స్టాంపుల శాఖామాత్యులు శ్రీ ధర్మాన ప్రసాద రావు గారు, గౌ II ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గార్లు హాజరవుతారని, వారిచే క్రీడలు మరియు సాంస్కృతిక పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవము జరుగుతుంది. ఈ ముగింపు పండుగలో ప్రత్యేక ఆతిదిగా శ్రీ కిదాంబి శ్రీకాంత్ గారు అంతర్జాతియ్య బాట్మెంట్టెన్ క్రీడాకారులు, గౌ II విద్యా శాఖామాత్యులు శ్రీ బొత్చ సత్యనారాయణ గారు, గౌ II పర్యాటక, క్రీడలు శాఖామాత్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారు, గౌ II పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖామాత్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి ప్రాతినిధ్యంవహిస్తున్న గౌ II నీటిపారుదల శాఖామాత్యులు శ్రీ అంబటి రాంబాబు గారు, గౌ II సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు శ్రీ మేరుగ నాగార్జున గారు , గౌ II కుటుంబ సంక్షేమము మరియు వైద్య విద్యా శాఖామాత్యులు శ్రీమతి విడదల రజనీ గారు, ఇంకా అనేక మంది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గౌ|| ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు, అనేక మంది పెద్దలు అతిధులుగా హాజరవుతారు.

ఆలాగే 13 వ తేది ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు జరిగే క్రీడల ముగింపు సభకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పచ్చిమ గోదావరి జిల్లాల లో నుండి గ్రామ రెవిన్యూ సహాయకుని నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు గల రెవిన్యూ ఉద్యోగులందరూ ముగింపు కార్యక్రమములో పాల్గొని 6 వ రాష్ట్ర రెవిన్యూ క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవములు-2022
జయప్రదం చేయాలని ప్రతి ఒక్క రెవిన్యూ ఉద్యోగిని కోరుకోనుచున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, అమరావతి నేతలు బొప్పరాజు & చేబ్రోలు కృష్ణమూర్తి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *