TRS MLAల కొనుగోలు బ్రోకర్లు ఏమ్మాట్లాడారు (1,2,3)

 

తెలంగాణ  రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని సైబరాబాద్ పోలీసు చక్కగా రికార్డు చేసిన విషయాన్ని ఇపుడు మీడియాకు రిలీజ్ చేశారు. బిజెపి బ్రోకర్లుగా చెప్పబడుతున్న ముగ్గురు వ్యక్తులు, రామచంద్ర భారతి, సంహయాజీ, నందకుమార్ అనే వాళ్లు ఎలా బ్రోకరేజ్ చేశారు అనేది వీడియో లో రికార్డు చేశారు.  ఈ టాపింగ్ , ట్రాపింగ్  టిఆర్ ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగింది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ట్రాపింగ్ గురించి వివరాలు అందించాారు. ఆయన  వీడియోలను సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు, పార్టీలకు, మీడియాల, ఇతర ప్రజాస్వామిక వాదలుు పంపించి, ప్రజాస్వామ్యాన్ని ఈ ఎమ్మెల్యేల కొనుగోలు నుంచి    కాపాడాలని వినతిచేశారు. అంతేకాదు, ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చే విధానం మానుకోవాలని, అది చెడ్డపేరు తెస్తుందని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. పోలీసులు రికార్డు చేసిన వీడియోాలు ఇపుడు నెట్లో దొరుకుతాయి. ఈ సంభాషణల్లో బ్రోకర్లు కేంద్ర హోమంత్రి అమిత్ షా తమ చేతుల్లో ఉన్నట్లు, ఫోన్ కాల్ కు స్పందిస్తాడన్నట్లు కూడా చెప్పారు.  ఇక్కడ ఆడియో ను అందిస్తున్నాం.

PART 01

రోహిత్ రెడ్డి: మేమంతా రెడీగా ఉన్నాం. ఇప్పటికే మొత్తం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్తే వాళ్లకి నమ్మకం వస్తుంది.
రోహిత్ రెడ్డి: మేమొకటి మాట్లాడుతున్నాం. మీరొకటి చెప్తున్నారు.
రామచంద్రభారతి: ఇక్కడి నుంచి మాకు కొంచెం కావాలని రోహిత్ అడిగారు. మిమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్లి జాయిన్ చేసుకుంటామని చెప్పాం. మనం మాట్లాడుకున్నదంతా పైవాళ్లకి మెసేజ్ చేశాను. వాళ్ల రిప్లై కోసం ఎదురుచూస్తున్నాం.
రోహిత్ రెడ్డి: అమౌంట్ గురించి కూడా ఓపెన్ గా చెప్పండి.
రామచంద్రభారతి: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తాం.
గువ్వల బాలరాజు: 50 అంటే..?
రోహిత్ రెడ్డి: రూ.50 కోట్లు
సింహయాజి: మీరు రూ.50 లక్షలు అనుకున్నారా? కాదు రూ.50 కోట్లు.
రోహిత్ రెడ్డి: మనం మాట్లాడుకున్నదంతా పైవాళ్లకి మెసేజ్ చేశారట. వాళ్ల రిప్లై కోసం ఎదురుచూస్తున్నారు.
రామచంద్రభారతి: మీకు ఇక్కడే డెలివరీ కావాలా?
గువ్వల బాలరాజు: మిగిలిన వాళ్ల గురించి కూడా మాట్లాడుదామా?
సింహయాజి: మొదట మీ విషయం పూర్తి కానివ్వండి. తర్వాత వాళ్లది చూద్దాం.
సింహయాజి: మీకు ఎక్కడ డెలివరీ కావాలంటే అక్కడ ఇస్తాం.
నందు: స్వామీజీ మరో ఐదుగురైనా ఓకేనా? వాళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
రామచంద్రభారతి: వాళ్లు ఎంత అడుగుతున్నారో కరెక్టుగా మాకు తెలియాలి.
రోహిత్ రెడ్డి: అన్నా మూడు విషయాలు అడిగిన. ఒకటి- రాజకీయ భవిష్యత్తు.
గువ్వల బాలరాజు: మాకు కూడా సేమ్ అడిగినవా?
రోహిత్ రెడ్డి: తర్వాత ఎన్నికల్లో బీ ఫామ్స్ కూడా వీళ్లే ఇచ్చేలా చూడాలి.
రామచంద్రభారతి: మీ వైపు నుంచి మీరు క్లియర్ గా ఉంటే మా వైపు నుంచి మేము పూర్తి సహకారం అందిస్తాం. బీ ఫామ్ ల గురించి ఇప్పుడే కాదు.. తర్వాత చూసుకుందాం.
రామచంద్రభారతి: బీజేపీలో అన్ని వ్యవహారాలను చూసుకునే ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలతో ఎవరికీ సంబంధం ఉండదు. మొత్తం జాతీయ నేతలే చూసుకుంటారు. ఒకరు బీఎల్ సంతోష్, రెండు అమిత్ షా, మూడు జేపీ నడ్డా.
గువ్వల బాలరాజు: మరి ప్రధాని జోక్యం చేసుకోడా?
రామచంద్రభారతి: అలాంటిదేమీ ఉండదు. ఇలాంటి నిర్ణయాల్లో ప్రధానికి అధికారం ఉండదు. ఇలాంటి వ్యవహారాలను ప్రధాని పైనుంచి పర్యవేక్షిస్తుంటారు. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయనకు అప్ డేట్స్ వెళ్తూనే ఉంటాయి.
గువ్వల బాలరాజు: ప్రధాని ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతుంటాయా?
రామచంద్రభారతి: అందరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. అందరూ కలిసే, అందరికీ తెలిసే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి.
గువ్వల బాలరాజు: సమాజంలో ఒక అపోహ ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ వేర్వేరు అని..
రామచంద్రభారతి: అవును. నిజమే. వాటి మధ్య తేడాలున్నాయి. ఆర్ఎస్ఎస్ అనేది పొలిటికల్ లిస్టింగ్ ఆర్గనైజేషన్. బీజేపీ అనేది పొలిటికల్ పార్టీ.
రామచంద్రభారతి: ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఆర్గనైజేషన్ మాత్రమే. కానీ ప్రతీ బీజేపీ వ్యక్తి వెనక ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంటుంది.
గువ్వల బాలరాజు: ప్రధానికి కూడానా?
రామచంద్రభారతి: అవును. ప్రధాని కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారక్. అక్కడి నుంచే ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీగా మారారు. అక్కడ్నుంచి గుజరాత్ సీఎంగా పదవి చేపట్టారు.
గువ్వల బాలరాజు: మూడుసార్లు సీఎంగా చేసిన తర్వాత ప్రధాని అయ్యారు కదా?
రామచంద్రభారతి: అవును. మూడుసార్లు సీఎం చేశాక ప్రధాని అయ్యారు. ఇదంతా బీజేపీ పనిచేసే విధానం. రాజకీయపరంగా వస్తే ఇక్కడ వ్యవహరాలన్నీ అమిత్ షా, బీఎల్ సంతోష్, నడ్డా చూసుకుంటారు.
రామచంద్రభారతి: తొలుత ప్రతీ విషయాన్ని బీఎల్ సంతోష్ పర్యవేక్షిస్తారు. ఆయన ఆ అంశాలపై అమిత్ షా, నడ్డాతో చర్చించి అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు.
రామచంద్రభారతి: నాకు ఈ మొత్తం వ్యవహారం గురించి సమాచారం రాగానే సంతోష్, తుషార్, అమిత్ షాకు మెసేజ్ చేశాను. ఇప్పుడు అమిత్ షా గుజరాత్ లో ఉన్నారు. అక్కడ పబ్లిక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. సంతోష్, తుషార్ కూడా గుజరాత్ లోనే ఉన్నారు. కానీ వీళ్లంతా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారు.
రామచంద్రభారతి: దీనిపై వాళ్లందరికీ మెసేజ్ చేశాను. మాట్లాడుతున్నారు. తుషార్ కు ఇప్పుడే నేను ఫోన్ చేశాను. అమిత్ షాతో మాట్లాడారంట. మరో 30 నిమిషాల్లో మనకు కాల్ చేస్తారు. ఇక్కడికి రావడానికి ముందే మేమంతా మాట్లాడుకున్నాం. మీరు అడిగిన వాటన్నింటికీ వాళ్లు ఒప్పుకున్నారు. ఇందులో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు.
రామచంద్రభారతి: మిమ్మల్ని చూసేంత వరకు నేనేమీ చెప్పలేను. కాబట్టి హామీ ఇవ్వలేదు. జాతీయ పార్టీలోకి వస్తున్నారంటే ఆషామాషీ కాదు. మీరు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి వచ్చారు. గతంలో మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. అవి కూడా జాతీయ పార్టీలే. ఇక్కడ కూడా అదే విధంగా నిర్మాణ వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి నేను వివరాలన్నింటినీ పైవాళ్లకు చెప్పాను. వాళ్లు ఒప్పుకున్నారు.
గువ్వల బాలరాజు: మరి మునుగోడు ఎన్నికల సంగతేంటి?
రామచంద్రభారతి: అక్కడ బీజేపీ లీడింగ్ లో ఉంది. వందకు వంద శాతం గెలుస్తాం.
నందు: స్వామీ. బీఎల్ సంతోష్ గురించి వారికి చెప్పండి.
సింహయాజి: బీఎల్ సంతోష్ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు.
గువ్వల బాలరాజు: ఆయన గురించి నాకు తెలియదు. రోహిత్ మమ్మల్ని పిలిచాడు. మేం ఇక్కడికి వచ్చాం. అవన్నీ మేం తెలుసుకోలేదు.
రామచంద్రభారతి: ఆయనే ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆయన కాంగ్రెస్ లో సుర్జీవాలా తరహాలో పనిచేస్తుంటారు. అక్కడ సుర్జీవాలా ఎలాగో ఇక్కడ సంతోష్ అలా! కానీ ఇక్కడ సుర్జీవాలా కంటే బీఎల్ సంతోష్ చాలా పవర్ ఫుల్.
రామచంద్రభారతి: బీజేపీకి సంబంధించిన వ్యూహాలను పూర్తిగా అమలు చేసేది బీఎల్ సంతోష్. ఎవరికి బీ ఫామ్ ఇవ్వాలన్నా వారికే పూర్తి అధికారం ఉంటుంది.
గువ్వల బాలరాజు: కానీ మేము బీ ఫామ్ ల కోసం ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు కదా?
రామచంద్రభారతి: అలాంటిదేమీ ఉండదు. రాబోయే ఎన్నికల్లో మీకు బీ ఫామ్ తప్పకుండా వస్తుంది. రాజకీయపరంగా కావాల్సిన అన్ని అవసరాలను చూసుకుంటాం. కేంద్రం నుంచి గానీ రాష్ట్రం నుంచి గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఈ మూడింటిపై మీకు హామీ ఇస్తున్నాం. మీటింగ్ పూర్తయ్యేలోపే వాటన్నింటిపై మీకు క్లారిటీ ఇస్తాం. ఆ తర్వాతే మనం ముందుకెళ్దాం.
రామచంద్రభారతి: ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు టెన్షన్ పడుతున్నారు. నాకు కూడా కొంత టెన్షన్ గా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజంతా నా ఫోన్ స్విచాఫ్ చేశాను. మీకు పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకెళ్లండి. అప్పటివరకు ఎక్కడికీ వెళ్లకండి.
గువ్వల బాలరాజు: మేం రాష్ట్ర నాయకులతో టచ్ లో ఉండాలా?
రామచంద్రభారతి: దాని గురించి మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు. మీరు కేవలం రోహిత్ తో మాత్రమే టచ్ లో ఉండండి. ఆయన ఎప్పటికప్పుడు మమ్మల్ని సంప్రదిస్తుంటాడు.
రోహిత్ రెడ్డి: మనకు మొత్తం ఇక ఢిల్లీ నుంచే. ఇప్పుడు స్వామీజీకి ఈ బాధ్యత అప్పగించారు. నిజానికి కర్ణాటక, మహారాష్ట్ర ఆపరేషన్ చేసింది ఆయనే.
రామచంద్రభారతి: కర్ణాటక ఆపరేషన్ గురించి మీకు తెలుసు కదా? కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి 16 మందిని తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం.
గువ్వల బాలరాజు: గతంలో కుమారస్వామి ప్రభుత్వం ఉండేది. ఆయనను దించి మీరు వచ్చారు కదా?
రామచంద్రభారతి: అవునవును. చూడండి. కర్ణాటకకు, తెలంగాణకు చాలా తేడా ఉంది. తెలంగాణ, ఆంధ్రాల్లో మిగిలిన రాష్ట్రాల్లోని రాజకీయాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి.
రామచంద్రభారతి: ఇక్కడ ఒక్క నియోజకవర్గం ఎన్నిక ఖర్చుతో అక్కడ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక పూర్తవుతుంది. ఇక్కడ ఒక నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తే.. అక్కడ 7 నుంచి 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు.
గువ్వల బాలరాజు: మునుగోడులో ఎంత ఖర్చు చేస్తున్నారు?
రామచంద్రభారతి: నేను అదే చెప్తున్నా. తెలంగాణలో ఒక్క నియోజకవర్గంలో పెట్టే ఖర్చుతో వేరే రాష్ట్రంలో ఎన్నికలన్నీ పూర్తి చేసుకోవచ్చు.
గువ్వల బాలరాజు: ఇంతకీ మునుగోడులో ఎంత ఖర్చు చేస్తున్నారు?
రామచంద్రభారతి: చూడండి. సిటింగ్ పార్టీ వారివారి వ్యూహాలతో వెళ్తుంది. ఎందుకంటే.. రాష్ట్ర ఇంటలిజెన్స్, పోలీసులు, స్థానిక నేతలంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇవన్నీ కేంద్రం చేతిలో ఉండవు. కేంద్రం నుంచి ఇక్కడి ఎన్నికలను మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు.
రామచంద్రభారతి: ఏదైతే ఏముంది? టీఆర్ఎస్ ఎలాగూ ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది. టీఆర్ఎస్ కాదు.. బీఆర్ఎస్. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం వారికి ఉంది.
గువ్వల బాలరాజు: బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా?
రోహిత్ రెడ్డి: అయిపోయింది. ఫామ్స్ అన్నీ సమర్పించారు. ఇంకా అప్రూవల్ రాలేదు.
రామచంద్రభారతి: బీఆర్ఎస్ పేరు రాదు లెండి. బీఆర్ఎస్ అనేది చాలా కష్టం లెండి. ఇప్పటికే బీఆర్ఎస్ అనే కోడ్ నేమ్ మీద నాలుగు పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. దాన్ని ఎవరో ఒకరు ఆపే అవకాశముంది. దాన్ని మేము ఆపం. ఆటోమేటిగ్గా వ్యవస్థ ప్రకారం అదే ఆగిపోతుంది.
రోహిత్ రెడ్డి: మహారాష్ట్ర ఎపిసోడ్ ను కూడా స్వామీజీ చూసుకున్నారు.

PART 02

రామచంద్రభారతి: అవునవును. అదంతా నేనే చూసుకున్నా.
సింహయాజి: ఆ సమయంలో వారి వసతి అంతా నేనే చూసుకున్నాను. రిసార్ట్ ఏర్పాటు చేసింది నేనే.
గువ్వల బాలరాజు: మీరెక్కడ ఉంటారు స్వామీ?
సింహయాజి: నేను తిరుపతిలో ఉంటా.
నందు: సింహయాజి గారు పీఠాధిపతి స్వామీజీ.
సింహయాజి: స్వామీజీ, నేను మంచి దోస్తులం.
రామచంద్రభారతి: ముంబైలో మా వ్యవహారాలన్నీ ఈయనే చూసుకునేవారు.
గువ్వల బాలరాజు: మొత్తానికి తెలంగాణలో ఎన్నికలను చాలా ఖరీదైనవిగా చేస్తున్నారు.
నందు: వచ్చేటప్పుడు అదే విషయం వారికి చెప్పాను. 50కి తక్కువ కుదరదు అని.
గువ్వల బాలరాజు: అహ ఇప్పుడు మునుగోడులో ఎంత ఖర్చు చేస్తున్నారూ అని! మునుగోడులో కూడా యాభైయేనా?
నందు: 50 అయితే ఎలా అయితది అన్నా. ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినం.
గువ్వల బాలరాజు: రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు గానీ..
సింహయాజి: ఆయనే పెట్టుకుంటారు అంతా. ఎంత ఖర్చయినా గానీ ఆయనే పెట్టుకుంటారు. ఆయనకు పెద్ద కాంట్రాక్టు ఇచ్చాం కదా!
గువ్వల బాలరాజు: కాంట్రాక్టు కాకుండా పార్టీ ఇంకా ఏమీ ఇవ్వలేదా?
నందు: ఇచ్చింది ఇచ్చింది.
గువ్వల బాలరాజు: ఎంతిచ్చింది?
సింహయాజి: 30 ఇచ్చింది. ఇంకో 20 వస్తాయి. పార్టీ 50 ఇచ్చింది. మిగతావి ఆయన్నే ఖర్చు పెట్టుకోవాలని చెప్పింది.
రామచంద్రభారతి: రాబోయే 15 ఏళ్ల పాటు బీజేపీనే జాతీయ స్థాయిలో అధికారంలో ఉంటుంది. ఇది ఫిక్స్! కాంగ్రెస్ లో సరైన నాయకులు లేరు. బీఆర్ఎస్ అనేది ఇప్పుడే నిర్మాణమవుతున్న జాతీయ పార్టీ.
రామచంద్రభారతి: తెలంగాణలో తప్పితే వాళ్లకు జాతీయ స్థాయిలో నాయకులు లేరు. తృణమూల్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు. మొత్తం 17 పార్టీలను ఒక్కతాటి మీదికి తీసుకొచ్చి, ఒక ప్రతిపక్షంగా తయారు చేయడం అసలు సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే వారిలో ప్రతీ ఒక్కరూ ప్రధాని అభ్యర్థే. నితీశ్ కుమార్, గెహ్లాట్, ఖర్గే, శశిథరూర్, పినరయి విజయన్, కేసీఆర్ కూడా ప్రధాని అభ్యర్థే. ప్రతీ ఒక్కరూ ప్రధాని అభ్యర్థే. అందరూ ప్రధానులు అయితే ఇక మంత్రులు ఎవరు?
నందు: కేజ్రీవాల్ కూడా ఉన్నారు కదా?
రామచంద్రభారతి: అవును. కేజ్రీవాల్ కూడా ప్రధాని అభ్యర్థి. కాబట్టి వాళ్లంతా ఒక్కతాటి మీదికి రాలేరు. అది అసలు సాధ్యమయ్యే పనే కాదు. కాబట్టి బీజేపీ మాత్రమే ఇక్కడ ఆప్షన్. రాబోయే 15 ఏళ్ల పాటు బీజేపీ మాత్రమే ఆప్షన్. ఇందులో సందేహం లేదు.
సింహయాజి: కేవలం 15 ఏళ్లు మాత్రమే కాదు స్వామీజీ మన మెషిన్ ఉన్నన్ని రోజులు బీజేపీనే అధికారంలో ఉంటుంది.
గువ్వల బాలరాజు: ఏం మెషిన్? ఈవీఎం మెషినా?
సింహయాజి: ఈవీఎం మెషిన్ ఉన్నన్ని రోజులు బీజేపీకి భయం లేదు.
గువ్వల బాలరాజు: ఈవీఎం మెషిన్లను ఎలా మానిప్యులేట్ చేస్తారు?
రామచంద్రభారతి: కాదు కాదు. ఈవీఎం మెషిన్లను మాత్రమే కాదు. దీనికి ఇంకా వేరే పద్ధతులు కూడా ఉన్నాయి.
సింహయాజి: అవే కదా మనం ఈవీఎం మెషిన్లు అనేది?
గువ్వల బాలరాజు: అందుకే అప్పుడప్పుడు బ్యాలెట్ సిస్టమ్ కావాలని అడుగుతుంటారు.
రామచంద్రభారతి: బ్యాలెట్ కూడా ఒక సమస్యే. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. కానీ ఈవీఎంలలో కొన్ని స్ట్రాటెజీలను ఉపయోగిస్తాం. వ్యూహాత్మకంగా పనిచేయడం అనేది జరుగుతుంటుంది.
గువ్వల బాలరాజు: మీరు పీఠాధిపతి కాకముందు రాజకీయాల్లో ఉన్నారా?
నందు: లేదు లేదు. ఆయన ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు. కానీ తెరవెనక ఉండి రాజకీయాలు నడిపిస్తున్నారు.
రామచంద్రభారతి: చూడండి. నేను ఆర్ఎస్ఎస్ లో వ్యూహకర్తను. ఆర్ఎస్ఎస్ నుంచే పూర్తిగా నా పనులన్నీ చేస్తుంటాను.
సింహయాజి: స్వామీజీ ప్రధానితోపాటు పనిచేశారు. స్వామీజీ, ప్రధాని ఒకటే ఫ్లయిట్ లో వెళ్తూ వస్తూ ఉంటారు.
గువ్వల బాలరాజు: మోడీ గారితోనా?
సింహయాజి: అవును మోడీగారితోనే.
గువ్వల బాలరాజు: ఇంతకీ స్వామీజీ వయసు ఎంత?
సింహయాజి: స్వామీజీ వయసు అడగకూడదు. రుషిమూలం, నదిమూలం అడగకూడదు.
రామచంద్రభారతి: నా వయసు 45 ప్లస్.
సింహయాజి: చిన్న వయసులోనే ఏబీవీపీ నుంచి ఈ స్థాయికి ఎదిగారు. 12 ఏళ్ల నుంచి ఇదే చేస్తున్నారు. స్వామీజీ పీఠాధిపతే ఇంతకుముందు. ఆరోగ్య దృష్ట్యా బయటకు వచ్చారు. అంతేగానీ అంతకుముందు స్వామీజీ పీఠాధిపతిగానే ఉన్నారు. హరిద్వార్ లోని కపిలాశ్రమంలో.
గువ్వల బాలరాజు: ఫోన్ రావడానికి ఇంకా టైం పడుతుందా?
రోహిత్ రెడ్డి: స్వామీజీ మెసేజ్ పంపించారా?
గువ్వల బాలరాజు: ఎందుకంటే నేను గన్ మెన్లను, కారును తీసుకురాలేదు.
రోహిత్ రెడ్డి: నేనేమైనా తీసుకొచ్చానా?
గువ్వల బాలరాజు: చెప్పలేం కదా. రాత్రిపూట చెకింగ్ అవుతోంది.
గువ్వల బాలరాజు: బ్రిటన్ వ్యవహారంలో కూడా మనవాళ్లే ఇన్ వాల్వ్ అయ్యారట కదా.
సింహయాజి: అవునవును. రుషి సునాక్ కదా? ఆయన పంజాబీ బ్రాహ్మిణ్. నారాయణమూర్తి అల్లుడు కదా?
నందు: అవును నారాయణమూర్తి బ్రాహ్మణుడే కదా!
సింహయాజి: అల్లుడంటే మేనల్లుడా?
నందు: కాదు కాదు. ఆయన కూతురిని పెళ్లి చేసుకున్నాడు.
సింహయాజి: సునాక్ అనేది ఒక గోత్రం. గోత్రం పేరునే సునాక్ గా పెట్టుకున్నాడు. సునకశ్య గోత్రం.

PART 03

సింహయాజి: ఫోన్ చేసి గ్యారెంటీ ఏంటని నందు అడిగాడు. నేను వెంటనే అక్కడికి పంపించా. ఈ స్వామీజీ దగ్గరికి వెళ్లి ఆయనని పరిచయం చేసుకొమ్మని పంపించా. నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ పని చేయమని చెప్పా.
నందు: మరి చూడకుండా నేనెలా చెప్తాను? నాకు ఈ పార్టీతో ఏ సంబంధం లేదు. నాకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను అవతలి వారికి ఎలా చెప్పాలి? అప్పుడు అక్కడికి వెళ్లి వచ్చాక కన్ ఫమ్ చేసుకున్నా. ఆ విషయం చెప్పిన తర్వాత అందరూ నన్ను స్వామీజీతో కూర్చుందామా అని అడిగారు. బండి సంజయ్ కి కూడా తెలియదు.
సింహయాజి: బండి సంజయ్ ఇందులో అసలు లేడు.
నందు: బండి సంజయ్ ది ఇక్కడేం నడవదు. వాళ్లకు అసలు అపాయింట్ మెంటే దొరకదు.
గువ్వల బాలరాజు: ఇక్కడ స్టేట్ లీడర్లతో ఏం కాదంటారా?
నందు: అస్సలు కాదు.
గువ్వల బాలరాజు: బండి సంజయ్ మొత్తం నేనే చేస్తా అని చెప్పుకుంటాడు కదా?
నందు: అలాంటిదేమీ లేదు. అక్కడ ఒకటే నిమిషంలో బండి సంజయ్ స్థానంలో మీ పేరు రాస్తే.. రేపటి నుంచి మీరిక్కడ పనిచేసుకోవచ్చు. కిషన్ రెడ్డి కూడా దిగిపోవాలంటే దిగిపోవాల్సిందే. బీఎల్ సంతోష్ అంత పవర్ ఫుల్ అక్కడ.
సింహయాజి: అక్కడ అంతా బీఎల్ సంతోష్ క్యాండెట్లే ఉన్నారు. అర్థమయ్యిందా?
గువ్వల బాలరాజు: మరి అమిత్ షా?
సింహయాజి: అమిత్ షా, సంతోష్ ఒకటే కదా? ఇంకోటి. బీఎల్ సంతోష్ నో అని చెప్తే అమిత్ షా ఏమీ చేయలేడు. అంత పవర్ ఫుల్ ఆయన అక్కడ.
హర్షవర్ధన్ రెడ్డి: పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కదా?
సింహయాజి: పార్టీ అధ్యక్షుడు కూడా ఈయన చెప్పినట్టే వినాలి. బీఎల్ సంతోష్ అంత పవర్ ఫుల్. కేబినెట్ మీటింగ్ లో కూడా బీఎల్ సంతోష్ మాటే నడుస్తుంది. ప్రతీ కేబినెట్ మీటింగ్ లో బీఎల్ సంతోష్ కూర్చుంటాడు.
గువ్వల బాలరాజు: ఆయన మినిస్టరా?
సింహయాజి: కాదు. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ.
గువ్వల బాలరాజు: కేబినెట్ మీటింగ్ లో కూర్చుంటాడా?
నందు: ఆయన అశోకా వీధిలో ఉంటాడు. మోదీ, అమిత్ షా మాట్లాడాలి అనుకుంటే ఫోనులో మాట్లాడతాడు. లేదంటే వాళ్లే వచ్చి వెళ్తారు.
సింహయాజి: ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో ఆయనకు అంత ప్రాధాన్యత ఉంది. బీఎల్ సంతోష్ చాలా పవర్ ఫుల్.
నందు: ఢిల్లీలో సంతోష్ ను కలిసి వచ్చిన తర్వాత బీజేపీ అధ్యక్షుడు నాకు కలిశాడు. మేం 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా మాకు ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదు. మీకెలా దొరికిందని షాకయ్యాడు. అదంతా స్వామీజీ దయ అని చెప్పా.
గువ్వల బాలరాజు: స్వామీజీ అంత పవర్ ఫులా?
సింహయాజి: బీజేపీని ఆర్గనైజ్ చేసేది స్వామీజీనే. అందుకే వీళ్లంతా వెళ్లి స్వామీజీలను మొక్కుతుంటారు.
నందు: వీళ్లు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతారు. మోడీ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని చెప్తుంటారు.
సింహయాజి: స్వామీజీకి లుకేమియా ఉంది.
గువ్వల బాలరాజు: ఎవరికి?
సింహయాజి: రామచంద్రభారతి స్వామీజీకి లుకేమియా ఉంది.
గువ్వల బాలరాజు: వాళ్ల రాష్ట్రంలో లుకేమియాకు చికిత్స ఉంది కదా?
సింహయాజి: కేవలం ఆయన గోమూత్రం మాత్రమే తీసుకుంటారు.
గువ్వల బాలరాజు: స్వామీజీది ఎక్కడ?
నందు: కర్ణాటక
గువ్వల బాలరాజు: ఇంతకీ ఈయన నేటివ్ ఎక్కడ?
సింహయాజి: ఈయన, సంతోష్ ఇద్దరూ కర్ణాటక వారే.
నందు: ఆర్ఎస్ఎస్ లో నంబర్ వన్ మోహన్ భగవత్. నంబర్ 2 దత్తాత్రేయ బస్వరాజ్. నంబర్ 3 బీఎల్ సంతోష్. ఆయనది కర్ణాటక. దత్తాత్రేయ బస్వరాజ్ ది కూడా కర్ణాటకే. వీళ్లతోపాటు అమిత్ షా కూడా నిర్ణయాలు తీసుకుంటారు.
సింహయాజి: వీళ్లందరూ ఒప్పుకొని బీఎల్ సంతోష్ ఒక్కరూ ఒప్పుకోకపోతే పని కాదు.
గువ్వల బాలరాజు: ఏంటి? ప్రధాని ఒప్పుకున్నా కూడానా?
సింహయాజి: అవును. సంతోష్ ఒప్పుకోకపోతే అంతే. బీఎల్ సంతోష్ నో అంటే నో. అంతే!
నందు: చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టు వరకు ప్రతీ ఒక్కటి ఆయనే నిర్ణయిస్తారు.
సింహయాజి: సంతోష్ ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివారు.
గువ్వల బాలరాజు: మీరేం చదువుకున్నారు?
సింహయాజి: నేను ఎంఏ లిటరేచర్.
గువ్వల బాలరాజు: మా అచ్చంపేటలో కూడా చాలా మంది స్వాములు ఉన్నారు. వాళ్లు చదువు మానేసి మొత్తం ఇదే. వేద పాఠశాలకు వెళ్లడం, చదువుకోవడం!
రోహిత్ రెడ్డి: వేద పాఠశాలలో కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. వేద పాఠశాలలో కూడా సోషల్, సైన్స్ సహా అన్ని సబ్జెక్టులు ఉంటాయి.
సింహయాజి: మా పీఠం చాలా డిఫరెంట్.
గువ్వల బాలరాజు: మీ పీఠం పేరేంటి స్వామీజీ?
సింహయాజి: శ్రీ మంత్రరాజ పీఠం.
నందు: నరసింహ ఉపాసకులు. వీళ్ల గురువుగారు చతుర్వేది గారు. ఒకసారి యోగి(యూపీ సీఎం)ని ఇలా రా అని పిలిచి..
సింహయాజి: అప్పుడు యోగి ఎంపీగా ఉన్నారు. అప్పుడు మా గురువు గారు పిలిచి ఒక సాలగ్రామం ఇచ్చి, ఒరేయ్ నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పారు. అంత పవర్ ఫుల్ మా గురువు గారు.
గువ్వల బాలరాజు: ఏం పేరు?
నందు: చతుర్వేది గారు.
సింహయాజి: ఇవన్నీ అయిపోయాక ఒకసారి కొండకు రండి. అన్నీ మాట్లాడుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *