చేనేత వస్త్రాలపై 5% GST ఏంటి మోదీ సారూ!

 

కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5% GST విధించడం బాధాకరమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికీ రంగులు, నూలు తదితర వస్తువుల ధరలు పెరగటంతో అనేక ఇబ్బందులతో వస్త్రాలు తయారు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై 5శాతం GST విధించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, బతుకమ్మ చిరాల ద్వరా ఉపాధిని పెంచి వారి రంగాన్ని ఆడుకోవడం ద్వారా ఇప్పుడిప్పుడే కుదిట పడిన తరుణంలో ఇలాంటి నిర్ణయంతో మళ్ళీ చేనేత కార్మికులు కష్టాలను ఎదుర్కొంటారు అన్నారు.

దీనిపై కేంద్రం మళ్ళీ పునరాలోచించాలని విధించిన GST ని తక్షణమే ఎత్తివేయాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు.

ఇప్పటికే పెరిగిన ధరలతో చేనేత రంగం కూరుకుపోయిందని, పెరిగిన చేనేత ముడిసరుకుల ధరలతో చీరకు గిట్టుబాటు లేకుండా పోయిందన్నారు.

రెండేళ్ల క్రితం కిలో రేషం ధర రూ.3 వేలు ఉంటే ప్రస్తుతం రూ.5 వేలకు పెరిగిందని, వార్పు, జరీ, అద్దకం ప్రతిదాని ధరలూ పెరిగాయన్నారు. ధరలు పెరిగినా చీరల రేటు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదన్నారు

ఈ నేపథ్యంలో పన్నుల భారం మోపితే ఉన్న కొద్దిపాటి ఆదాయం కూడా కోల్పోకతప్పదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.

చేనేత పరిశ్రమను కేంద్ర పాలకుల నిర్లక్ష్యంతో ఈ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థం అయ్యిందని, ఇది చాలదన్నట్లు మళ్లీ జీఎస్టీ బాదుడు మోపడం దుర్మార్గం అన్నారు. బిజెపి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒక మాట చెబుతోందని ద్వజమెత్తారు.

2017లో కేంద్ర ప్రభుత్వం 149 పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చిందని, ఇందులో చేనేత రంగం లేదని గుర్తు చేశారు.

ఉపాధి రంగంగా ఉన్న చేనేతపై పన్నుల భారాలు వేయరాదని స్పష్టమైన నిబంధన ఉన్నా బిజెపి దానిని ఉల్లంఘిస్తు చేనేతకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.

చేనేతకు జీఎస్టీని మినహాయించకపోతే ఆ రంగమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని, ఇప్పటికే ఈ రంగంలో ఆదాయం చాలా తగ్గిందన్నారు. చీరకు గిట్టుబాటు ధరలు లేక ఆయా రంగం నిర్వాహకులు అప్పులు చేయాల్సి పరిస్థితి వస్తోందన్నారు.

గత రెండేళ్లతో పోలిస్తే చేనేత ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి కన్పించడం లేదన్నారు.

ఈ పరిస్థితుల్లో జీఎస్టీ రూపంలో పన్నుల భారాలు వేస్తే చీరలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకురారని, తద్వారా కార్మికుడు ఉపాధి కోల్పోతాడని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి, చేనేతకు జీఎస్టీ పన్నుల భారాల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *