భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్ నేత, మాజీ చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్ కృష్ణారావుమీడియా సమావేశంలో చెప్పిన విశేషాలు:
1953 నుంచి ఎపి రాజధాని అంశం వివాదంగానే ఉంది. రాజాజీ, ప్రకాశం పంతులు వంటి నేతలు నాడు నిర్ణయించలేక పోయారు
ఆనాడు గౌతు లచ్చన్న వంటి పెద్దలు గుంటూరు లో రాజధాని పెట్టాలని, హైకోర్టు కర్నూలు లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
ఆ తరువాత అనుకోని పరిణామాల తో పూర్తి స్థాయిలో అమలు చేయలేదు
*2014లో రాష్ట్ర విభజన లో చంద్రబాబు పూర్తి స్థాయిలో అమలుచేయలేదు. నేటి రాజధాని వివాదాలకు ఆది పురుషుడు చంద్రబాబు, మూల పురుషుడు జగన్మోహన్ రెడ్డి
ఎంతో చారిత్రక నేపధ్యం ఉన్న నాలుగు ప్రాంతాలను కలుపుకుని వెళ్లడంలో చంద్రబాబు విఫలమయ్యారు
రాజధాని పేరుతో రైతుల భవిష్యత్తు ను పణంగా పణంగా పెట్టారు
ఒకేసారి పెద్ద రాజధాని నిర్మాణం సాధ్యం కాదని తెలిసినా పనులు చేపట్టారు
1953లో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ లేదు.. 2014లో రియల్ ఎస్టేట్ ఎంటర్ అయ్యింది
రాజధాని అభివృద్ధి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి ని చంపేశారు
మధ్యలో ఉన్న పనులను కూడా పూర్తిగా ఆపేసి రాజధానిని నాశనం చేసారు
అమరావతి ని పరిపాలనా రాజధానిగా ఉంచి, మహానగరంగా విశాఖను అభివృద్ధి చేస్తే వివాదం ఉండేది కాదు
హైకోర్టు ను కర్నూలు కు తరలించాలి…ఇదే బిజెపి విధానం
ముంబై తరహాలో విశాఖ ను అభివృద్ధి చేయవచ్చు… దానికి రాజధానే చేయనక్కర్లేదు
పచ్చటి కొండలను తవ్వేసి ప్లాట్లు వేసి దోచుకోవడమే అభివృద్ధా
పరిపాలనా రాజధాని ఉన్న ప్రాంతమే ఎపి రాజధాని
అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ పెద్ద తప్పు
ఎపికి రాజధాని అమరావతి, మహా నగరం విశాఖపట్నం
అభివృద్ధి కి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉంది
విశాఖ లో ఉన్న ల్యాండ్ బ్యాంక్ లో పరిశ్రమ లు ఏర్పాటు చేయాలి
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి పని చేసేందుకు బిజెపి ప్రభుత్వం సిద్దం
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టడం సులువు… వాటిని నియంత్రణ చేయడం కష్టం
రాష్ట్ర పాలకులు ఈ అంశాలను పరిశీలించి.. ఇటువంటి చర్యలు ఆపాలి
ఎపి రాజధాని విషయం లో ఇదే బిజెపి విధానం
*ఐ.వై.ఆర్. కృష్ణారావు*
మీడియా తో ఇంకేమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి లేకుండా పోయింది
అమరావతి ప్రాంతంలో పనులు పూర్తిగా నిలిపి వేశారు
ప్రస్తుతం రాష్ట్రం లో కనిపిస్తున్న పనులు కేంద్రం చేసే అభివృద్ధే
జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పడమే తప్ప.. పనులు చేయడం లేదు
నిజంగా ఆర్థిక పరిస్థితి ఉంటే… అది ప్రతిబింబించే లా కనిపించాలి కదా
దీపావళి వస్తుంటే… సిఎం ను కలిసి ఉద్యోగులు అదనపు సౌకర్యాలు అడిగే వారు
ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేదంటే… పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు
ఎపిలో ఏ పని చేయాలన్నా…వేతనాలు ఇవ్వాలన్నా వెతుక్కునే పరిస్థితి
అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన అప్పులు .. వేటికి వాడారో చెప్పాలి కదా
మూల ధనం వ్యయం అప్పు కన్నా ఎక్కువ ఉందంటే .. నియంత్రణ ఏది
సంక్షేమం, అభివృద్ధి సమ తూకంలో చేయడానికే ప్రభుత్వం ఉంది
ఎపి ఓవర్ డ్రాప్ట్ లో 146రోజులు ఉంది
ఎపి లో ఆర్ధిక ప్రగతి బాగుందని చెప్పడం .. మోసం చేయడమే
*ఎపి విడిపోయే సమయానికి లక్ష కోట్లు వరకుఅప్పులు ఉన్నాయి
చంద్రబాబు హాయాంలో రెండు లక్షల కోట్లు చేశారు
*జగన్మోహన్ రెడ్డి మూడున్నర ఏళ్లల్లో ఆరు లక్షల కోట్లు అప్పులు చేశారు
ఈ డబ్బంతా ఏం చేశారు… వేటికి ఉపయోగించారు… ప్రజలకు చెప్పాలి. 200శాతం ద్రవ్య లోటుగా ఉన్న భారం ఆందోళన కలిగిస్తుంది
*రాజధాని గా అమరావతిని తీసేయాలని నేను ఏ పుస్తకం లో రాయలేదు. విశాలమైన మహా నగరం అభివృద్ధి తక్కువ సమయంలో సాధ్యం కాదనే చెప్పాను
*ఆ ప్రాంతాలను అన్నివిధాలా అభివృద్ధి చేయాలని బిజెపి తరపున కోరుతున్నాం
*పాత్రికేయుల సమావేశంలో సుధీష్ రాంభోట్ల ,వినూషారెడ్డి, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీపతి రాజా తదితరులు పాల్గొన్నారు*