ఇది వందల కోట్ల మైనింగ్ స్కామ్ : సోమిరెడ్డి

 

*వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్, రామదాసు కండ్రిగ, సత్రం భూముల్లో కాకాణి & బ్యాచ్ మైనింగ్ మాఫియా చేసిన భారీ గోతులను మీడియాకు చూపించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

*సోమిరెడ్డి కామెంట్స్

సర్వేపల్లిలో గ్రావెల్ ను కాకాణి & బ్యాచ్ కొల్లగొడుతుంటే అధికారులు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారా

వైసీపీ మూడేళ్ల పాలనలో ఊహించలేని స్థాయిలో కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ ను కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారు

నేషనల్ హైవేకి, కృష్ణపట్నం పోర్ట్ రోడ్డుకు ఆనుకుని ఉన్న విలువైన భూముల్లో గ్రావెల్ తవ్వకాలకు అధికారులు అనుమతి ఎలా ఇస్తారు

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో మైనింగ్ కు అనుమతి ఇవ్వడంతో పరిమితికి మించి గ్రావెల్ ను కొల్లగొట్టేసి భారీ గుంతలు పెట్టేశారు.

టీడీపీ హయాంలో రామదాసు కండ్రిగ వద్ద బీసీలకు, రామదాసు సత్రం వద్ద ఎస్సీలకు భూములిచ్చి పట్టాలిచ్చాం

ప్రభుత్వం పట్టాలిచ్చింది అమ్ముకోడానికి కాదు.. సాగు చేసుకోవడానికే… ఇచ్చిన భూములను ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కైనా, పరిశ్రమల కైనా సేకరించి నష్టపరిహారం చెల్లించాలి

కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒత్తిడితో ఎకరా రూ.కోటి విలువ చేసే భూముల్లో 30 అడుగుల గుంతలు పెట్టేసి నాశనం చేసేశారు

సర్వేపల్లి రిజర్వాయర్ లోని తిక్కవరప్పాడు వైపు 50 ఎకరాలు, గొలగమూడి వైపు 40 ఎకరాలు, అనికేపల్లి వైపు 40 ఎకరాలు, జోసఫ్ పేట వైపు 40 ఎకరాలు అంతా కలిపి 170 ఎకరాలు, ఈదగాలిలో 100 ఎకరాలు, రామదాసు కండ్రిగలో 30 ఎకరాలు, రామదాసు సత్రంలో విలువైన భూములు, ఎర్రగుంటలో స్మశానం భూముల్లో గ్రావెల్ ను కొల్లగొట్టేశారు

కోడూరు చెరువులో 100 ఎకరాలు, వరిగొండ చెరువులో 40 ఎకరాలు, పిడతాపొలూరు చెరువులో 50 ఎకరాలలో మట్టి, ఇసుక ఎత్తేశారు

కాకాణి గోవర్ధన్ రెడ్డి కోట్ల విలువైన గ్రావెల్ ను సొమ్ము చేసుకుంటూ రాయల్ ప్యాలెస్ నిర్మించుకుంటున్నాడు

ఒక హిటాచి, దాని కింద 40 టిప్పర్లు ఒకరోజు పని చేస్తే 8వేల క్యూబిక్ మీటర్లు, ఒక నెలకు 2,40 లక్షల క్యూబిక్ మీటర్లు ఆ వంతున మూడు నెలలకు 7 లక్షల క్యూబిక్ మీటర్లు.. ఇలా మూడు హిటాచీలు పనిచేస్తే 20 లక్షల క్యూబిక్ మీటర్లుశ. ఆ లెక్కన ఒక సర్వేపల్లి నియోజకవర్గంలోనే గడిచిన మూడు నెలల్లో 20 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను ఎత్తేశారు

సర్వేపల్లి రిజర్వాయర్లు అంతర్భాగంలో లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను ఎత్తేస్తుంటే ఇరిగేషన్ అధికారులు కళ్లు మూసుకుని ఉన్నారా

మైనింగ్ అధికారులు గాజులు తొడుక్కొని ఉన్నారా

ప్రజల ఆస్తులను అధికారులు కాపాడలేరా..ఒక్కో అధికారి రూ.లక్షకు పైగా జీతాలు, ఇతర బెనిఫిట్స్ తీసుకుంటూ మీ కుటుంబాలతో సంతోషంగా ఉంటారు

ప్రజల ఆస్తులు కాపాడే ధైర్యం, చిత్తశుద్ధి లేనప్పుడు ఉద్యోగాలు చేయడం ఎందుకు

సీఎం జగనన్న హోల్ సేల్ గా రాష్ట్రాన్ని అమ్మేస్తుంటే, ఎమ్మెల్యేలు, మంత్రులు రిటైల్ గా అమ్మేస్తున్నారు

వీళ్లు నియోజకవర్గాల్లోని పంచభూతాలను దోచుకుంటుంటే, ఆయన ఏకంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు

ఘోరమైన పరిస్థితుల్లో ఏపీ ఉంది ..బీహరే మేలనిపిస్తోంది

వెంకటాచలం మండలానికి ఆనుకొని కృష్ణపట్నం ఓడరేవు, భారీ పరిశ్రమలు, జాతీయ రహదారి, ధర్మల్ ప్రాజెక్టులు ఉన్నాయి

కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు ప్రతిష్టాత్మక సంస్థలు తీసుకొచ్చి వెంకటాచల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు.. అలాంటి మండలం నేడు గ్రావెల్ మాఫియా కోర్లలో చిక్కుకుంది

ఇంత దారుణాలు జరుగుతుంటే కలెక్టర్, Sఈ ఇరిగేషన్, EE ఇరిగేషన్, DD మైనింగ్, జిల్లా ఎస్పీ, ఆర్డీవోలు ఏం చేస్తున్నారు

మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న గ్రావెల్ మైనింగ్ పై చర్యలు తీసుకోండి

*లేకుంటే నెల్లూరు నడిబొడ్డున గాంధీ బొమ్మ దగ్గర మాకు చేతకాదు..మేము పనికిరాము.. ప్రజల డబ్బులు జీతాలుగా తీసుకుంటామే తప్ప ప్రజల ఆస్తులను మేము కాపాడలేం.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎదిరించి మాఫియాపై చర్యలు చేపట్టే ధైర్యం లేదని చెప్పేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *