*విద్యుత్ బస్సులను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి*
తిరుపతి, సెప్టెంబర్ 27:
రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం 6.40 గంటలకు శ్రీవారి పాదాల చెంత అలిపిరి వద్ద ఆర్ టి సి పర్యావరణ హిత విద్యుత్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితాన్ని పాటించాలని తిరుపతి, తిరుమలలో విద్యుత్ బస్సులు (ఎ.సి) ప్రయాణికుల కోసం 100 బస్సులను (olectra company) అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించడంతో తిరుపతి, తిరుమల దేవస్థానంల వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గౌ.ముఖ్యమంత్రిచే అలిపిరి వద్ద సాయంత్రం 6 గంటలకు దాదాపు 10 బస్సులను ప్రారంభించనున్నారు. ఒక్కొక్క బస్సు 35 మంది ప్రయాణికులతో ఒకసారి చార్జ్ చేస్తే 180 కి.మీ ల ప్రయాణం, ఎల్.ఈ.డి. డిస్ప్లే, సి.సి.టి.వి. కమెరాలు, వై.ఫై. సౌకర్యం, జి.పి.ఎస్. ట్రాకింగ్, లగేజ్ ర్యాక్స్ వంటి సౌకర్యాలతో కలిగి ఉంది. ఈ బస్సుల కోసం అలిపిరి డి.పో ను పూర్తిగా విద్యుత్ బస్సులకు కేటాయిస్తూ చార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటు చేశారు. అలాగే మదనపల్లి, కడప , నెల్లూరు బస్ స్టేషన్లలో కూడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. ఎసి కరెంట్ చార్జింగ్ 3 గంటల్లో , డిసి చార్జింగ్ 1.30 గంటల్లో చార్జింగ్ కానున్నది. తిరుపతి – తిరుమల మధ్య 50, తిరుపతి – రేణిగుంట ఎయిర్పోర్ట్ 14, తిరుపతి – మదనపల్లి 12, తిరుపతి – కడప 12, తిరుపతి – నెల్లూరు 12 బస్సులను ఆర్.టి.సి నడపనున్నది.
ఈ కార్యక్రమంలో డిప్యూటి సి.ఎం నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి , ఆర్ కే రోజా , టిటిడి చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి, శాసన సభ్యులు కరుణాకర రెడ్డి , చింతల రామచంద్రారెడ్డి, ఆర్ టి సి చేర్మన్ మల్లిఖార్జున రెడ్డి, ఎం డి ద్వారక తిరుమల రావు, టిటిడి జే ఈ ఓ సదాభర్గవి, ఆర్ టి సి వై స్ చైర్మన్ విజయ నంద రెడ్డి, ఆర్ టి సి ఆర్ ఎం చంగల్ రెడ్డి, టిటిడి ట్రాన్స్ పోర్ట్ జి ఎం శేసా రెడ్డి, olectra company కంపెనీ సి ఈ ఓ ప్రదీప్ పాల్గొన్నారు.
కార్యక్రమ అనంతరం సాయంత్రం 6.45 కు తిరుమల బయలు దేరి వెళ్ళారు.