లోన్ యాప్ కేటు గాళ్ళు ఇలా దొరికారు…

 

*ఒక్క క్లిక్ తో రుణాలు అంటూ ప్రజలను మోసం చేసి వేధిస్తున్న 2 కేసులలో 4 కేటుగాలను అదుపులోనికి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.

*కేటుగాళ్లు పన్నిన వలలో చిక్కుకొని జీవితాలను బలికానివ్వద్దని హితవు*.

*అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు జిల్లా ఎస్పీ.

*నిందితులను అదుపులోనికి తీసుకోవడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.

*విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జాషువా ఐపీఎస్.

_కుటుంబ అవసరాల నిమిత్తం, పిల్లల చదువు కోసం, ఇతరత్రా పనుల కోసం నగదు అన్వేషన్లో ఉన్న అమాయక ప్రజల అవసరాలను పెట్టుబడిగా మార్చుకొని ఎటువంటి స్యూరిటీ లేదు, డాక్యుమెంటేషన్ మాటే లేదు అంటూ ఒక్క క్లిక్ తో తక్షణ ఋణం అంటూ లోన్ యాప్ ల ద్వారా రుణాలు మంజూరు చేస్తూనే, సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నప్పటికీ వడ్డీల పేరుతో అధిక మొత్తాలను వసూలు చేస్తూ, చెల్లించలేని పక్షంలో వారిని అసభ్యంగా చిత్రీకరించి బెదిరింపులకు గురి చేస్తూ, ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్న లోన్ ఆప్ కేటుగాళ్లను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో మిగిలిన నేరస్తుల పాత్రను నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పెనమలూరు, ఆత్కుర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన లోన్ ఆప్ వేధింపుల కేసులను అత్యంత చాకచక్యంగా చేదించగా ఈ కేసు కు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ గారు విలేకరుల సమావేశంలో వెల్లడించారు_.

*కేసు పూర్వాపరాలు*
_20.07.2022 తేదీన పెనమలూరు మండలానికి చెందిన కల్పన (కల్పిత పేరు) అనే మహిళ కుటుంబ అవసరాల నిమిత్తం అత్యవసరంగా నగదు అవసరం అయ్యి లోన్ కోసం అన్వేషిస్తుండగా,షూరిటీ లేదు, డాక్యుమెంటేషన్ పేరే లేకుండా తక్షణమే రుణమని తన స్మార్ట్ ఫోన్ కు వచ్చిన నోటిఫికేషన్ చూసి క్లిక్ చేసింది. వెంటనే ప్లే స్టోర్ లో ఉన్న *WELL CREDIT APP* డౌన్లోడ్ చేసుకోమనగా దానిపై క్లిక్ చేసి వారు అడిగిన సమాచారం అంతా ఓకే చేసి చివరిగా ఆధార్, పాన్ కార్డు గూర్చిన సమాచారం కూడా ఎంటర్ చేసింది. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే తన ఖాతాలో వెస్ట్ బెంగాల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతా నుండి 7000/- రూపాయలు నగదు జమ అయ్యాయి. వారం రోజుల తర్వాత అనగా 27.7.2022వ తేదీన లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి లోన్ గా తీసుకున్న మొత్తం నగదు వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని వేధింపులు ప్రారంభించగా, తిరిగి మహారాష్ట్ర నాసిక్ చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాకు వివిధ దఫాలుగా వారి ఒత్తిడికి లోనై బెదిరింపుల వలన 16,270/- రూపాయలు వారు చెప్పిన యూపీఐ లింకులకు పంపించింది. అయినప్పటికీ వేధింపులు ఆగక బాధితురాలి యొక్క ఫోటోలను అసభ్యంగా మార్పింగ్ చేసి ఆమె ఫోన్ కే పంపి అధిక మొత్తం కోసం డిమాండ్ చేయడం జరిగింది. బాధితురాలు అనాలోచితంగా ఫోన్ గ్యాలరీకి వ్యక్తి సమాచారానికి సంబంధించిన అనుమతి ఇవ్వడంతో సైబర్ నేరగాళ్లు ఆమె సమాచారాన్ని బాధితురలిని బెదిరించడం జరిగింది. ఆమె సమాచారం అంతా చేజిక్కించుకొని ఫోన్లో ఉన్న బంధువుల, స్నేహితుల ఫోన్ నెంబర్లకు ఆ ఫోటోలను పంపి తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయమని 9.8.2022వ తేదీన పెనమలూరు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. వెంటనే ఆమె ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 617/2022, 420 ఐపిసి, 66-డి, 66-బి,ITA 2000 – 2008 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది_

_అలాగే ఆత్కూరు పోలీస్ స్టేషన్లో మరొక బాధితురాలు తన ఫోన్ కు వచ్చిన తక్షణ ఋణ యాప్ను గూర్చిన లింక్ను క్లిక్ చేసిన వెంటనే ప్లే స్టోర్లోని *FF lone* లోన్ యాప్ డౌన్లోడ్ చేసి బాధితురాలు తన వ్యక్తిగత సమాచారన్నంత ఇవ్వడంతో 3360/- రూపాయల లోను తక్షణమే తన యొక్క బ్యాంకు ఖాతాలో జమ తిరిగి మరల తక్షణమే చెల్లించాలని, లేకుంటే అసభ్యంగా చిత్రీకరించి ఫోటోలు వైరల్ చేస్తామని బెదిరించడంతో 7000/- రూపాయలు వారు పంపిన లింకుకు జమ చేసింది. అయినప్పటికీ వేధింపులు ఆగక తన యొక్క ఫోటోను అసభ్యంగా చిత్రీకరించి తన కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాట్సాప్ నెంబర్లకు షేర్ చేయడంతో ఆత్కూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 123/22 U/S 420, 384, 506, 509, 67 ఐటీ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు._

*దర్యాప్తు కొనసాగిందిలా*
_లోన్ ఆప్ వేధింపులపై తక్షణం విచారణ చేసి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించమని గౌరవ డిజిపి శ్రీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మీదట కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారు అడిషనల్ ఎస్పీ శ్రీ వెంకట రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెనమలూరు, ఆత్కుర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు గురించి ప్రతిష్టాత్మకంగా స్వీకరించి విచారణ ప్రారంభించారు. మొదటగా ఆమెకు ఫోన్ ద్వారా వేధింపులకు గురి చేస్తున్న వాట్సాప్ నెంబర్లను, ఆమె బ్యాంకు ఖాతాకు జమ అయిన అకౌంట్ నెంబర్ ను, నగదు పంపిన అకౌంట్ ను తీసుకొని దాని ద్వారా విచారణ ప్రారంభమైంది. ఆ క్రమంలో 16,270 రూపాయలు పంపిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాకు ఆమె నగదు జమ చేసినట్లుగా గుర్తించి ఆ వాట్సాప్ నెంబర్లు బ్యాంకు ఖాతా నెంబర్ల ద్వారా విచారణ ప్రారంభించారు. కాలక్రమేనా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రత్యేక బృందాలు ఐటీ సిబ్బందితో ఎప్పటికప్పుడు కావలసిన సమాచారం రాబట్టుకుంటూ వచ్చిన ఆధారాల ద్వారా ఒక ప్రత్యేక బృందం ఆ ప్రాంతాలకు వెళ్లి వాకబు చేసే పనిలో పడ్డారు. ప్రతి చిన్న ఆధారాన్ని సేకరించి ఆ దిశగా విచారణ కొనసాగిస్తూ ఈ కేసును చేదించడం చాలెంజింగ్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నేరానికి పాల్పడిన వారి చిరునామా దొరకడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు రెండు కేసులలో నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకోవడం జరిగింది._

*నేరస్తుల వివరాలు*

1. Nilesh Vilas Gorade, S/o Vilas Shivram Gorade, 29 yrs, C/Marata, Baragaon Pimpri (v), Sinnar Taluk, Nashik Dt., Maharashtra.

2. Amit Sunil Gavli, S/o Sunil Gavli, A/31yrs, C/Lohar, Raja Fattesiha road, near Sinnar Sarvajanik Wachnalya, Sinnar (V & Taluk) Nasik Dt, Maharashtra.

3. Sarfaraj Azeej Shaik, S/o Sk Azeej Hussain, A/32 yrs, C/Muslim, Shivaji chowk, Raja Fattesiha road, Sinnar Taluk, Nashik Dt, Maharashtra

4. Ramdas Dattatreya daradas S/O Dattatreya nirhale sinnar . maharastra (ఆత్కూరు పోలీస్ స్టేషన్ కేసు)

5. ఓంకార్ శంకర్ మూలే. మహారాష్ట్ర. (ఆత్కూరు పోలీస్ స్టేషన్ కేసు) ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

*నేరస్తుల నేర స్వభావం*
_ఈ నేరానికి పాల్పడిన 1) నీలిష్ విలాస్ గోరడే, 2) అమిత్ సునీల్ గవ్లీ మరియు 3) సర్ఫరాజ్ అజీజ్ షేక్ అను ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద వాంగ్మూలాన్ని నమోదు చేయగా… అమిత్ సునీల్ గవ్లీ @ శివా గావ్లీ అనే వ్యక్తి తనకు ఢిల్లీ లో పరిచయం ఉన్న జై వీర్ అనే వ్యక్తికి మోసపూరితమైన లోన్ యాప్ repayment లింకులు తయారు చేసి పంపి కమీషన్ తీసుకునేవాడు, ఎక్కువ మొత్తంలో కమీషన్ పొందటం కోసం కరెంట్ అక్కౌంట్ లు ఓపెన్ చేసి ఇవ్వమని అడుగగా తన స్నేహితుడైన్ సర్పారాజ్ సంప్రదించగా, అదే ప్రాంతం లో నివశిస్తున్న నీలేశ్ విలాస్ గోరడే అనే ట్రాన్స్పోర్టర్ ను పరిచయం చేయగా అతను రెండు కరంట్ అక్కౌంట్ లు ఓపెన్ చేసి అమిత్ సునీల్ గవాలీ కి ఇవ్వగా అతను సదరు అక్కౌంట్ లకు చెందిన పాస్ బుక్ ఏ‌టి‌ఎం కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర పత్రాలను ఢిల్లీకి చెందిన జైవీర్ అనే వ్యక్తికి పంపించడం జరిగింది. అనంతరం బాధితులకు ఫోన్లు చేసి బెదిరించి, వీరి అక్కౌంట్లలో డబ్బులు వేయిన్చుకుని వాటిని జయవీర్ కు పంపగా కమిషన్ రూపేనా ఈ ముగ్గురు ముద్దాయిలు ముందుగా అనుకున్న కమిషన్ ప్రకారం పంచుకునేవారు. అలాగే మరొక ప్రధాన నిందితుడు ఓంకార్ శంకర్ మూలే ఇదే తరహాలో వేధింపులకు పాల్పడేవాడు. ఇతనిపై కుశల్ వాడి పోలీస్ స్టేషన్ నందు నమోదైన పీడీ యాక్ట్ కేసు లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు._

_పేదవాడి అవసరమే వారి అవకాశం, మధ్యతరగతి వారి ఇబ్బంది వారి పెట్టుబడి. ఎలాంటి రుజువులు, సాక్షాలు అవసరం లేదంటూ, తాకట్టు పెట్టాల్సిన పని లేదంటూ కేవలం స్మార్ట్ ఫోన్లో ఉన్న యాప్ లో వారు అడిగిన సమాచారం ఇస్తే చాలు క్షణాల్లో మీకు రుణం ఇస్తామని చెప్పే వారి మాటలు ప్రజలు ఎవరు నమ్మవద్దు.

ఆధార్, పాన్ కార్డ్ సమాచారం ఇస్తే చాలు లోన్ గ్యారెంటీ అని వచ్చే నోటిఫికేషన్ల ను నమ్మి లోన్ తీసుకున్నారో ఇక అంతే.

లోన్ ఆప్ సిబ్బంది ప్రాణం పోయినా వదిలే ప్రసక్తే లేదు. బంధువులు, స్నేహితులకు సైతం ఫోన్ చేసి వేధిస్తారు.

అనధికారికంగా చలామణి అవుతున్న నకిలీ లోన్ ఆప్ లను నమ్మి ప్రజలు మోసపోవద్దని కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి తో నడపబడుతున్న బ్యాంకుల వద్ద నుండి సంబంధిత పత్రాలు సమర్పించి లోన్లు పొందాలని ఎస్పీ గారు హితవు పలికారు.

మీ ఫోన్ కు మెసేజ్ల ద్వారా గాని వాట్సప్ ద్వారా గాని వచ్చిన ఏ విధమైన లింకులను క్లిక్ చేయకుండా, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఎకౌంటుకు సంబంధించిన వివరాలు ,పాన్ కార్డ్, ఆధార్ కార్డుల వివరాలు భద్రపరచుకోవాలి.

మీకు ఇలాంటి మోసాలకు గూర్చి ఏదైనా సమాచారం తెలిస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ నెంబర్ 1930, ఏపీ సైబర్ మిత్ర నెంబర్ 9121211100, డైల్ -100 కు గాని సమాచారం అందజేయాల్సిందిగా ఎస్పీ గారు తెలిపారు.

_అనంతరం లోన్ యాప్ లపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవగాహన పెంచేందుకు తయారుచేసిన పోస్టర్లను జిల్లా ఎస్పీ గారు ఇతర పోలీసు అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు.

_ఈ విలేకరుల సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీమతి అస్మా ఫర్హీన్ గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్చార్జి డిఎస్పి భరత్ మాతాజీ గారు,గన్నవరం డిఎస్పి విజయపాల్ గారు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *