కేసీఆర్ మీద బండి సంజయ్ తీవ్ర ఆరోపణ

కుత్బుల్లాపూర్
బండి సంజయ్ కామెంట్..
జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం… కార్మికుడి మొదలు.. కంపెనీల సీఈవోల వరకు ఉండే ప్రాంతమిది. ఇక్కడ కంపెనీల్లో వాటా కావాలని సీఎం కుటుంబం ఒత్తిడి తెస్తుంటే తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నయ్. హైదరాబాద్ ను ఏ విధంగా నాశనం చేసినవో ప్రజలకు చెప్పడానికే పాదయాత్ర చేస్తున్నా.

KCR అసెంబ్లీలో నువ్వు చెప్పిందంతా అబద్దమని నిరూపిస్తా
నీకు సిగ్గు, లజ్జ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయ్

ఇదిగో కేంద్ర విద్యుత్ బిల్లు…పవిత్రమైన అసెంబ్లీనే తప్పుదోవ పట్టిస్తావా?

తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే

నేను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధం… బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెడితే ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడతాం

99 ఏళ్ల లీజు పేరుతో ఆర్టీసీ డిపోలు, స్థలాలను కేసీఆర్ కుటుంబం, చెంచాగాళ్లకు కట్టబెట్టే కుట్ర

దేశ్ కీ నేత.. దిన్ పర్ పీతా… ఫాంహౌజ్ మే సోతా…

ప్రగతి భవన్ కాదది… కేసీఆర్ బార్

సిటీలో గుంత చూపిస్తే వెయ్యి ఇస్తానన్నవ్ కదా… నీ బడ్జెట్ కూడా సరిపోనన్ని గుంతలున్నయ్

– కుత్బుల్లాపూర్ ఓ మినీ భారత్

అసోం సీఎం వస్తే భద్రత కల్పించలేని దుస్థితి తెలంగాణదే

కేసీఆర్ పాలనలో యువతకు ఉద్యోగాల్లేవ్… ఉద్యోగులకు జీతాల్లేవ్.. రిటైర్డ్ అయితే పెన్షన్లు లేవ్..
29 మంది వీఆర్ఏలు చనిపోయినా స్పందించని మూర్ఖుడు కేసీఆర్

బీజేపీ లేకుంటే హిందువులది భిక్షమెత్తుకునే వచ్చే ప్రమాదం

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపి తీరుతాం

దారుస్సలాంకు భయపడే జాతీయ సమైక్యత పేరుతో చరిత్రను వక్రీకరించే కుట్ర

పాకిస్తాన్ లో తెలంగాణను విలీనం చేసేందుకు రూ.20 కోట్లు పంపిన నీచుడు నిజాం

ఇన్నాళ్లు ఎందుకు తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలు ఎందుకు జరపలేదు?

కర్నాటకలోనే పట్టించుకోని కుమారస్వామిని కేసీఆర్ పైసలిచ్చి రప్పించుకుంటుండు

బీఆర్ఎస్ కాదు.. పీఆర్ఎస్ పెట్టుకుని కేఏ పాల్ తో కలిసి తిరిగినా నో ప్రాబ్లం

ఏ కేసులో చూసినా కేసీఆర్ కుటుంబ ప్రమేయమే…అన్ని మాఫియాలకు కేంద్ర బిందువు హైదరాబాదే

ట్విట్టర్ టిల్లు దావోస్ పోయి సాధించేదేమిటి….. కర్నాటక పోయి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చింది

102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నా… అయినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు

ట్రిపుల్ ఆర్ ఎమ్మెల్యేలను చూస్తేనే కేసీఆర్ గజ గజ వణికి పోతున్నడు…

మునుగోడు తరువాత నాలుగో ఆర్ రాబోతున్నడు…ప్రగతి భవన్ వద్ద ’నాలుగో ఆర్‘ సినిమా చూపిస్తా

సీఎం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా రాజగోపాల్ రెడ్డి గెలుపును ఆపలేరు

4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కరెంట్ కట్ చేసేలా కేంద్రం విద్యుత్ బిల్లును రూపొందించిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడివో పాత పేపర్లను, చిత్తు కాగితాలను పట్టుకుని పవిత్రమైన అసెంబ్లీని కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందంతా అబద్దమని నిరూపించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
కేసీఆర్… ఇదిగో కేంద్ర విద్యుత్ బిల్లు… నీకు పంపిస్తున్నా. చదువుకో… నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయ్. పవిత్రమైన అసెంబ్లీనే తప్పుదోవ పట్టించిన నువ్వు వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ నేను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధం’’అని సవాల్ విసిరారు. బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, కరెంట్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కేసీఆర్ కుట్రకు తెరదీశారని అన్నారు. బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెడితే ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టి తీరుతామని హెచ్చరించారు. ఆర్టీసీ విషయంలోనూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 99 ఏళ్ల లీజు పేరుతో విలువైన ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ కుటుంబం, వారి చెంచాగాళ్లకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయనీయబోమని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను ఉద్దేశించి ‘‘దేశ్ కీ నేత.. దిన్ పర్ పీతా… ఫాంహౌజ్ మే సోతా… అమాయ పున్నమికి బహర్ ఆతా’’ అంటూ సెటైర్లు విసిరారు. కేసీఆర్ తాగడానికి అడ్డాగా మారిన ప్రగతి భవన్ ను కేసీఆర్ బార్ గా అభివర్ణించారు. బీజేపీ చేపట్టిన 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కుత్బుల్లాపూర్ లోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేలాది మందిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….

కుత్బుల్లాపూర్ మినీ భారత్. అన్ని రాష్ట్రాల వాళ్లు కలిసి ఉండే ప్రాంతమిది. సీఎంకు సోయి లేదు. అసోం సీఎం వస్తే భద్రత కల్పించలేని దుస్థితి. పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు పెట్టారు. అయినా పాదయాత్ర చేస్తున్నా.. తెలంగాణ తల్లి రోదిస్తోంది. సమస్యలు తెలుసుకోవాలని కోరుతోంది. బంధ విముక్తిరాలిని చేయాలని అడుగుతోంది.

హైదరాబాద్ ను డల్లాస్, లండన్, సింగపూర్, న్యూయార్క్ చేస్తానన్నవ్… ఏమైంది? హైదరాబాద్ లో గుంత కన్పిస్తే వెయ్యి రూపాయలిస్తానంటివి…. నేను వస్తున్న దారంతా గుంతల మయమే. ఆ గుంతలకు డబ్బులియ్యాలంటే.. నీ బడ్జెట్ కూడా సరిపోనట్లుంది.
కేంద్ర నిధులతో ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జీలు కట్టి అదే అభివ్రుద్ధి అంటున్నడు.. డ్రైనేజీ సరిగా లేదు..చినుకు పడితే హైదరాబాద్ మునిగిపోయే దుస్థితి. నాలాల్లో పడి చనిపోతున్నరు. పట్టించుకోవడం లేదు. నాలాలు, చెరువులను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నరు. దీనిని ప్రశ్నించడానికే పాదయాత్ర చేస్తున్నా.

మూసీని ప్రక్షాళన చేస్తానన్నడు. కొబ్బరి నీళ్లలా మారుస్తానన్నడు. రూపాయి బిల్ల వేస్తే కనబడేలా హుస్సేన్ సాగర్ ను తీర్చిదిద్దుతానన్నడు.. కానీ ఏమైంది? మూసీ నీళ్లను పంపిన.. తాగి స్నానం చేయమని చెప్పిన. జీడిమెట్లలో అదే పరిస్థితి. నీళ్లు కాలుష్యం… పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నరు. నీళ్లన్నీ విషమైనయ్. ఈ నీళ్లు పంపిస్తా.. తాగి చెప్పాలి కేసీఆర్..ఇవన్నీ అడుగుతుంటే బీజేపీది మతతత్వ పార్టీ అంటున్నడు. 80 వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నిస్తే మతతత్వమా?

కేసీఆర్ నిండు అసెంబ్లీలో కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని షరతు పెడుతోందంటూ అబద్దం చెప్పిండు.. మోటార్లకు మీటర్లు పెడతానని ఎవరు చెప్పారు? 30 గ్రామాలకిచ్చే కరెంట్ ను నీ ఫాంహౌజ్ ను వాడుకుంటున్నవ్. రైతుల పేరుతో మంత్రులు, సీఎం సహా పాంహౌజ్ లకు కరెంట్ వాడుతున్నరు. ఎక్కడివో పాత పేపర్లు అసెంబ్లీలో చూపెట్టి కేంద్ర ఆదేశాలంటూ శాసనసభనే తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లు -2022ను నేనే పంపిస్తా… ఈ బిల్లులో ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టాలని ఉంటే నేను రాజీనామా చేస్తా… నువ్వు మాట్లాడింది తప్పని నిరూపిస్తా… నీకు సిగ్గూ లజ్జా ఉంటే రైత పక్షపాతివైతే రాజీనామా చెయ్… ముక్కు నేలకు రాయి. పవిత్రమైన శాసనసభలో పనికిరాని పేపర్లను చూపి సభనే తప్పుదోవ పట్టిస్తావా?

కేసీఆర్ ను చూసి జనం నవ్వుకుంటున్నరు. ఈయనో దేశ్ కీ నేత.. రాత్ మే పీతా… ఫాంహౌజ్ మే సోతా… అమాస పున్నమికి బహర్ ఆతా… ఇదీ కేసీఆర్ యవ్వారం.. ప్రగతి భవన్ లో ప్రజలను కలుసుకోడు. మంత్రులు, ఎమ్మెల్యేలూ కలిసే పరిస్థితి లేదు. అందుకే అది ప్రగతి భవన్ కాదు.. కేసీఆర్ బార్…
యూనివర్శిటీల్లో డ్యాన్సులు వేయకపోతే డిస్ క్వాలిఫై చేస్తానని చెప్పి వీసీ తప్పతాగి చిందులేసిండు. మీడియా ప్రశ్నిస్తే పైసలిచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాడని సిగ్గు లేకుండా చెప్పిండు… మనందరం సిగ్గు పడాలే…

ప్రభుత్వ హాస్టళ్లలో, గురుకులాల్లో పురుగులలు, బొద్దింకలు, బల్లులు పడ్డ అన్నం తినలేక ఆసుపత్రులపాలైతున్నరు. కుటుంబ నియంత్రణ పేరుతో పేద మహిళలకు ఎలాంటి పరీక్షలు చేయకుండానే గంటలో 34 మందికి ఆపరేషన్ చేస్తే 4 గురు చనిపోయిండ్రు. 30 మంది ఆసుపత్రి పాలైండ్రు. దీనికి కారణమైన హెల్త్ డైరెక్టర్ ను వెనుకేసుకొస్తున్నరు.

లిక్కర్ స్కాంలో ప్రమేయమున్న సీఎం బిడ్డపై చర్య తీసుకోకుండా సిగ్గు లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలంతా పోయి ఆమెను పరామర్శిస్తున్నరు. జీడిమెట్ల సహా ఆర్టీసీ డిపోలన్నీ 99 ఏళ్ల లీజు పేరిట కేసీఆర్ కుటుంబం, ఆయన అనుచరులకు దారాధత్తం చేసే కుట్ర చేస్తున్నారు.

కేంద్రం పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తే ప్రగతి భవన్ బద్దలు కొడతాం…డిస్కంలకు వేల కోట్ల బకాయిలు కట్టలేక డిస్కంలను మూసివేసే కుట్ర చేస్తూ ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టివేసేందుకు కేసీఆర్ యత్నం.. రైతులారా… ఉచిత కరెంట్ ఇస్తానని డిస్కంలకు పైసలెందుకు ఇస్తలేవని నిలదీయండి. ఉచితం పేరుతో ఒక్కో తలపై రూ 1.20 లక్షల అప్పు ఎందుకు చేసినవని నిలదీయండి. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే అడ్డుకునేందుకు బీజేపి సిద్ధం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *