RTCలో PRC అమలు ఎపుడు?: APJAC అమరావతి

ఆర్టీసీ (AP PTD) లో 01.01.2020 తరువాత ప్రమోషన్స్ పొందిన 2096 మంది ఉద్యోగులతో సహా అందరికీ అక్టోబర్ 1 తేదీన కొత్త PRC అమలు చేయాలని
APJAC అమరావతి నేతలు బొప్పరాజు , వైవీ రావు, వైఎస్ రావు కోరారు.

ఈ రోజు 12.9.2022 న APJAC అమరావతి చైర్మన్  బొప్పరాజు గారి నాయకత్వంలో APPTD సెక్రెటరీ జనరల్ వై.వి. రావు, APPTD కార్మికపరిషత్ ప్రధానకార్యదర్శి వై.శ్రీనివాసరావు మరియు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు సిద్దిఖ్ లతో కలిసి RTC MD
ద్వారకా తిరుమల రావు  గారిని వారి ఛాంబర్ లో కలిసి APPTD ఉద్యోగుల PRC-2022 అమలులో జరుగుచున్న జాప్యం పై, 01/01/2020 తరువాత ఇచ్చిన పదోన్నతులపై ప్రభుత్వం పెట్టిన అభ్యంతరాల మీద కూలంకషంగా చర్చించారు.

ఈ సందర్బంగా బొప్పరాజు  మాట్లాడుతూ 01.01.2020 తరువాత 2096 మంది APPTD ఉద్యోగులకు ఇచ్చిన ప్రమోషన్స్ అన్నీ నిబంధనలకనుగుణంగా ఇచ్ఛినవేననీ, గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాలవలన అనగా రాష్ట్ర విభజన, ప్రభుత్వంలో RTC ఉద్యోగుల విలీనం తదితర కారణాలతో ఆలస్యమైన ప్రమోషన్స్ ను గత రెండు సంవత్సరాలలో ఇవ్వటం జరిగిందన్నారు.

16.08.2021 న TR&B prl. సెక్రెటరీ ఆధ్వర్యంలో RTC ఉన్నతాధికారులు మరియు అసోసియేషన్ లతో జరిగిన సమావేశంలో చర్చల అంగీకారం ప్రకారం ఇచ్చిన ప్రమోషన్సే అని పేర్కొన్నారు.

పదోన్నతులు పొందడం ఉద్యోగుల హక్కు, కల్పించడం ప్రభుత్వం భాధ్యత.

పదోన్నతి పొందిన 2096 మంది APPTD ఉద్యోగులు ఇప్పటికే ప్రమోషన్ స్కేల్స్ లో జీతాలు పొందుతున్నారు. వారికి అందరి లాగానే కొత్త PRC స్కేల్ లో ఫిట్మెంట్, ఫిక్సేషన్ మాత్రమే చేయవలసి ఉంటుంది. గతంలో ఉన్నతాధికారులు సంఘా నాయకులతో జరిగిన సమావేశాల్లో ఒప్పుకున్నవే కనుక ఒక్క నిర్ణయంతో, ఇచ్చిన పదోన్నతుల నిర్ణయాన్ని రాటిఫికేషన్ చేసి సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉన్నతాధికారులు పదోన్నతులకు ముందస్తుగా ప్రభుత్వ ఆర్థిక శాఖ అనుమతి పొందలేదనే సాకుతో పదోన్నతి పొందిన 2096 మందికి కొత్త జీతాలు ఇవ్వలేమని ఓరల్ గా చెప్పటం చూస్తుంటే, 51,448 మంది RTC ఉద్యోగుల కొత్త PRC అమలు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు.

ఇటువంటి పాలనాపరమైన సమస్యలన్నీ ఆయా శాఖల ఉన్నతాధికారులు అంతర్గతంగా అనుమతులు పొందటము ద్వారా పరిష్కరించాలేగానీ, కొంతమందికి జీతాలు నిలిపివేయడం సరికాదన్నారు.

అక్టోబర్ 1 వ తేదీ న చెల్లించే కొత్త జీతాలతో పదోన్నతి పొందిన 2096 మందిని మినహాయిస్తే RTC ఉద్యోగులందరికీ PRC అమలు జరిగినట్లుగా మేము భావించము అని తేల్చి చెప్పారు.

కనుక, ప్రభుత్వం…

(1) తక్షణమే 51488 మంది ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలు జనవరి 2022 నుంచి అర్రియర్స్ తో సహా ఈ నెలలొనే చెల్లించాలి. ఎందుకంటే మాతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కొత్త జీతాలు జనవరి-2022 నుండి పొంది ఉన్నారు.

(2) 2096 మందికి ఇచ్చిన పదోన్నతులు అన్నీ క్యాడర్ strength పరిధిలోనే ఉన్నాయి కాబట్టి, అలాగే ఉన్నతాధికారులే ఆ రోజుకు ఉన్న నిబంధనలు ప్రకారమే పదోన్నతులు కల్పించారు కాబట్టి, 2096 మంది పదోన్నతులు పొందిన వారిని మినహాయిస్తామంటే ఒప్పుకునేదిలేదనీ, అవసరమైతే ఇప్పటికే RTC (PTD) ఉన్నతాధికారులు వ్రాసిన లేఖ ప్రకారం వారి పదోన్నతులు అనుమతి ఉత్తర్వులు ఇచ్చి, పదోన్నతి పొందిన 2096 మందికి కూడా అందరితో పాటు కొత్త 2022 PRC జీతాలు ఈ సెప్టెంబర్ మాసం నుండే చెల్లించాలని,

(3) లేని పక్షంలో ఇంతకు ముందే ప్రకటించినట్లు, మేము RTC సంఘాలతో సమావేశం నిర్వహించుకుని
కార్యాచరణ దిశగా వెళ్తామని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *