‘గీత సాక్షిగా’ పోస్టర్స్ రెస్పాన్స్ అదుర్స్

సినిమా అనేది శక్తివంతమైన కళారూపం. సమాజంలోని సత్యాన్ని మరియు కఠినమైన వాస్తవాలను ప్రేక్షకులకు తెలియచేయడానికి ఇప్పటివరకు ఎంతో మంది చిత్ర నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు ప్రేక్షకులనుండి గుర్తించబడడమే కాకుండా, ప్రేక్షకుల , ప్రేమ, ఆధరణతో వారు తీసిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద  విజయవంతమయ్యాయి. ఇప్పుడు అదే తరహా కంటెంట్  ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ తో వస్తున్న చిత్రమే “గీత సాక్షిగా”.
PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆంథోని మట్టిపల్లి  స్క్రీన్ ప్లే రాసుకొని మొదటి సారి మెగాఫోన్ పట్టారు. చేతన్ రాజ్ ఈ సినిమాకు కథను అందిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంచలన సంగీత విద్వాంసుడు గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం నుండి  విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి సంబంధించిన ప్రీ-అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..పోస్టర్ లో కోర్టు మరియు పోలీసు విచారణకు సంబంధించిన విషయాలను చూపిస్తూ.. నేరం మరియు న్యాయంపై ఆధారపడిన బలమైన సబ్జెక్ట్ ఉన్న  చిత్రంగా ఆగుపిస్తుంది అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్  చూస్తుంటే చిన్నారి తప్పించుకోవడానికి ప్రయత్నించడం,అదే  చిన్నారి పోస్టర్‌పై పెద్దల నీడ కనిపించడంతో  ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అలాగే సెకండ్ లుక్‌ను పోస్టర్ లో  శ్రీకాంత్ అయ్యంగార్ లాయర్ వేషంలో ఎంతో సీరియస్ గా వున్నట్లు తన ముఖం కనిపిస్తుంది. పోస్టర్ పై ‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా’  అనే క్యాప్షన్‌ ఉండడంతో అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారు.
నటీ నటులు
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు
సాంకేతిక నిపుణులు
కథ – నిర్మాత : చేతన్ రాజ్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ఆంథోని మట్టిపల్లి
సంగీతం: గోపీసుందర్
ఆడియో : ఆదిత్య మ్యూజిక్
సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ
ఎడిటర్: కిషోర్ మద్దాలి
సాహిత్యం: రెహమాన్
కళ: నాని
నృత్యం : యశ్వంత్ – అనీష్
ఫైట్స్ – పృధ్వీ
పి. ఆర్. ఓ : సురేంద్ర నాయుడు, ఫణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *