ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, ప్రజా గాయకుడు గద్దర్ అన్న గారుసమాజ్ వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి గారిని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా గద్దర్ గారు మాట్లాడుతూ భారతదేశంలో పార్లమెంటు నూతన భవనం తయారు కాబోతున్నది అట్టి భవనానికి గౌరవనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేరును పెట్టాలని సూచించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో చర్చించడం జరిగింది.
భారత రాజ్యాంగాన్ని రచించి భారత పౌరులకు సమాన హక్కులను ప్రసాదించిన మహనీయుని పేరును కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అతని పేరు సరియైనదని చెబూతు ఈ విషయమై సమాజ్ వాదీ పార్టీ మద్దతును కోరడం జరిగింది.
ఈ సందర్భంగా సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గారు సింహాద్రి గారు మాట్లాడుతూ పార్లమెంట్ నూతన భవనానికి మాట్లాడుతూ పార్లమెంటు నూతన భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం సరైనదని సూచించడం జరిగింది. ఇట్టి విషయమై మా పార్టీ తరఫున మీకు అన్ని విధాల సహకరిస్తామని అదేవిధంగా భారత రాజకీయ వ్యవస్థలో రామ్ మనోహర్ లోయ గారి సోషలిస్ట్ సిద్ధాంతం అంబేద్కర్ గారి సమానత్వ సిద్ధాంతం రెండు కూడా ఈనాటి భారత దేశ పునర్నిర్మాణానికి చాలా అవసరం అని ఇట్టి విషయమై అన్ని పార్టీలు కూడా సహకరించాలని గద్దర్ గారు కోరడం.
జరిగింది ఈ కార్యక్రమానికి సమాజ్వాది పార్టీ రాష్ట్ర నాయకులు అక్కల బాబు గౌడ్ మారం తిరుపతి యాదవ్ బోనాలవిజయ్ కుమార్ గారూ మేకల కృష్ణ గారు అదేవిధంగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ యూనియన్ నుంచి మహేష్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది ఇట్టి విషయమై సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో తెలంగాణ విద్యావంతులను అదేవిధంగా ఇతర సోషలిస్టు ఉద్యమకారులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది