GPS సమావేశానికి ఉద్యోగులు దూరం

*AP JAC అమరావతి నేతలు బొప్పరాజు & వైవీ రావు ప్రకటన

CPS అంశంపై ప్రభుత్వం నేడు (7.9.2022న) ఏర్పాటు చేసిన సమావేశానికి APJAC అమరావతి సభ్య సంఘాలు దూరం.

ఇప్పటికే అనేకసార్లు జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశాల్లో APJAC AMARAVATHI పక్షాన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్న సంఘాల తరపున స్పష్టంగా GPS అమలుకి మేం వ్యతిరేకమని, భవిష్యత్ లో జరిగే సమావేశాలు OPS అయితేనే మేము చర్చలకు సిద్ధమని లిఖితపూర్వకంగా APRSA పక్షాన కూడా తేదీ 24.5.2022న ప్రభుత్వానికి తెలియచేసియున్నాము.

తదనంతరం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ CPS ఉద్యోగ సంఘాలతో అనేకసార్లు గా చర్చలు జరుపుతున్నారు.

ఇన్ని చర్చల తర్వాత కూడా నేడు ప్రభుత్వం CPS అంశంపైనే సమావేశం ఏర్పాటు చేసినందున, ఈ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాము. గౌ. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్పష్టమైన హామీకి కట్టుబడి CPS రద్దు చేసి పాత పింఛను విధానం అమల్లోకి తేవాలని AP JAC అమరావతి పక్షాన మరొక్కసారి కోరుతున్నాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *