ఈ రోజు సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్రం సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యాలయంలో మొదలయింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆయన ఎమన్నారంటే…
“1955 డిసెంబర్ 28న హైదరాబాదులో లోహియా నాయకత్వంలో సమాజ్వాది పార్టీ ప్రారంభించబడింది. సమాజ్ వాదీ ఉద్యమం/ సోషలిస్టు ఉద్యమం రాష్ట్రంలో ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా గెలిపించడం జరిగింది.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమాధి పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 30 నియోజకవర్గాలలో పోటీ చేయడం జరిగింది.
పలు సామాజిక వర్గాల రాజకీయ ఆకాంక్షలను ఏ పార్టీ పట్టించుకోలేదు. సమాజ్వాది ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో అన్ని సామాజిక వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి సమాజ్వాది పార్టీ కృత నిశ్చయంతో ఉన్నది. ముఖ్యంగా పేదలు, రైతులు, స్త్రీలు, యువకులు, విద్యార్థులు, వెనుకబడిన వాళ్లు రాష్ట్రం సాధించుకున్నప్పటికీ వాళ్ల ఆకాంక్షలు నెరవేర్చుటలో ప్రభుత్వం విఫలమైంది.
“ఉదారవాద పాలసీలతో ధనికులను మరింత ధనికులను చేసే రాష్ట్రంగా తయారైంది. దీనితో పలు వర్గాలు విద్యకు దూరమవుతున్నారు. వైద్యాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. పలు వర్గాలు సొంత ఇల్లు లేక బాధపడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మద్యం ఏరులై పారుతున్నది. చాలామంది రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వ వ్యాపారీకరణ దృక్పదమే కారణమని నమ్ముతున్నాం. ఉచిత విద్య వైద్యం అందించాల్సిన ప్రభుత్వం వ్యాపార పరం చేయడం వల్ల పేదలు వెనుకబడ్డవాళ్ళు చదువుకు దూరం అవుతున్నారు.
“ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు. దీంతో నిరుద్యోగులు వారి కుటుంబాలు తీవ్ర కష్టాలకు గురవుతున్నారు. విద్యను త్రికల్ డౌన్ పాలసీ (trickle down policy) కాకుండా మాస్ ఎడ్యుకేషన్ పాలసీని అవలంబించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.
“అంతేకాకుండా భూ నిర్వాసితులు, ఆదివాసీలు పలు సమస్యలతో రోడ్ల మీదికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ధరణి లో చాలామంది భూముల పట్టా సమస్యలను ఎదుర్కొంటున్నారు.
“కాబట్టి వెనుకబడ్డోళ్లకు అధికారం అందించినప్పుడు మాత్రమే సమస్యల నుండి ప్రజలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
“రెండో అంశం కేంద్రస్థాయిలో ప్రైవేటీకరణ ద్వారా పబ్లిక్ రంగాన్ని ఒకరిద్దరు వ్యాపారులకు అప్పజెప్పడం జరుగుతుంది. దాంతో సామాజిక వర్గాలకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతున్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. పెద్ద ఎత్తున బిజెపి ప్రభుత్వం ప్రజల ఆస్తులు, వనరులు, పరిశ్రమలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం జరుగుతున్నది. దేశం భవిష్యత్తులో చాలా సమస్యల లో చిక్కుకునే అవకాశం ఉంది.
“గ్లోబలైజేషన్ ద్వారా ధనికుల పేదల మధ్య అంతరాలు బాగా పెరిగిపోతున్నాయి. సామాజిక వర్గాల మధ్య కూడా అంతరాలు పెరిగి అణిచివేతకు గురవుతున్నారు. స్త్రీలు పురుషుల మధ్య సమానత్వం కోసం ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు.
“ప్రజల కేంద్రంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి సమాజ్వాది పార్టీ ప్రజల మధ్య చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ముందుకు పోతుంది. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య రక్షణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ భారతదేశ రక్షణగా భారత జాతి నిర్మాణంగా సమాజ వాద ఉద్యమాన్ని నిర్మిస్తుంది. కుల జనగణన, మండల కమిషన్ కేంద్రంగా సమాజ్వాది పార్టీ ప్రచారం చేస్తుంది. 75 సంవత్సరాల స్వాతంత్రంలో భాగంగా వెనుకబడ్డోళ్లకు అధికారం అనే నినాదంతో సమాజ్వాది పార్టీ పిలుపునిస్తోంది.
“సామాజిక వర్గాలను విప్లవీకరించే ఆలోచనలతో సమాధి పార్టీని సభ్యత్వ నమోదు ద్వారా బలోపేతం చేయాలని కోరుతున్నాం. తెలంగాణలో సమాజ్వాది ఉద్యమం ద్వారా, సామాజిక న్యాయంతో రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి పిలుపు మేరకు ‘వెనుకబడ్డల్ల విప్లవంకై’ ముందుకు నడుద్దాం”
ఈ కార్యక్రమంలో అక్కల బాబుగౌడ్, మారం తిరుపతి యాదవ్, బరిగెల స్వరూప రాణి,మహమ్మద్ రిజ్వాన్ హుస్సేన్, జే. రాములు, మహమ్మద్ వాజిద్ సిద్ధికి, కాల్వ శ్రీనివాస్ యాదవ్, ఆవుల కుమార్ స్వామి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నవారు..